ఓం సాయి నాధాయనమః !
గురు పౌర్ణమి – నా అనుభవం
సాయినాధుని దయ తో నిన్న నేను గురు పౌర్ణమి ని మొదటిసారిగా చాల గొప్ప గా జరుపుకున్నాను .దీనికయి నేను ఏమి ప్లాన్ చేసుకోలేదు . బాబా నే ప్లాన్ చేసి నాకు తన ప్లాన్ తెలియజేసేదాకా నాకు గురు పౌర్ణిమ డేట్ కూడా ఐడియా లేదు . సాయి కి నాపై దయ చూస్తే నాకు ఆనందం గా అనిపిస్తోంది .
గురు పౌర్ణమి కి 25 రోజుల ముందు నేను sinus operation కోసం హాస్పిటల్ కి వెళ్ళినపుడు, హాస్పిటల్ నుండే ఒక సాయి డీవోటీ ని టెంపుల్ construction, డిజైన్ విషయం లో సలహాల కోసం కాల్ చేయడం జరిగింది . ఆవిడ విషయం తెలుసుకుని , “గురు పౌర్ణిమ సందర్భం గ జులై 16 న నాగార్జున సాగర్ దగ్గర గురుగారి సత్సంగ్ వుంది. నువ్వు తప్పకుండా రా. బాబా అనుగ్రహం ఉంటే మన గురుగారు నీతో మాట్లాడి తగిన సలహాలు ఇచ్చే అవకాశం వుంది . ఒకరోజు ముందు గానే ఆశ్రమానికి వచ్చి మరునాడు గురు పౌర్ణిమ ని జరుపుకుని వెళ్ళచ్చు” అని వారు నిర్వహించే శాఖాపూరం సాయి సేవాశ్రమం కి నన్ను ఆహ్వానించడం జరిగింది . ఆప్యాయత తో కూడిన వారి మాటలు నా బాధాతప్త హృదయాన్ని వూరడించాయి .అప్పటివరకు నాకు ఈసారి గురు పౌర్ణిమ డేట్ కూడా స్ఫురణ లో లేదు . అస్సలు నేనేమి ప్లాన్ కూడా చేసుకోలేదు. ఇది బాబా నాకోసం చేసిన ప్లాన్ ఏమో అని సంతోషం గా అనిపించింది .ఇక ఆ విషయాన్ని మర్చిపోయాను . మా ఇంట్లో ,,దగ్గరగా ఏదయినా సత్సున్గ్ ఉండి ఉదయం వెళ్లి రాత్రి వరకు వస్తే అనుమతిస్తారు .కానీ రెండు రోజుల ఈ దూర ప్రయాణం అంటే అనుమతించడం కష్టమే కాబట్టి నేను వెళ్తానని నమ్మకం నాకే లేదు . కానీ,వాళ్ళు వేరే వూరు వెళ్లే పని ఉండటం వల్ల, నన్ను కూడా వూరికెళ్లడానికి అనుమతించడం జరిగింది ..
నల్గొండ జిల్లా శాఖాపూరం సాయి సేవాశ్రమం లో గురు గారు బస చేసి ,మరునాడు ఆశ్రమం కి దగ్గరగా వున్న నాగార్జున సాగర్ కాలనీ లో గురు పౌర్ణిమ సందర్భం గా సత్సున్గ్ జరుపుతారు . కావున నేను శాఖాపూరం కి వెళ్లాలని బయల్దేరాను . వెళ్లేముందు బాబా ని నా తోడు గా రమ్మని వేడుకున్నాను . సాయి స్మరణ తో 15th న hyd వరికి వచ్చి MGBS చేరుకున్నాను . MGBS లో సుమారు 50th నెంబర్ ప్లాట్ఫారం దగ్గర బస్సు దిగి మిర్యాలగూడ వెళ్లే ప్లాట్ఫారం కి (సుమారు 14 or 15 అనుకుంటాను) వెళ్తున్నాను(బాబా ఫోటో కోసం వెతుకుతూ) . కానీ కనిపించలేదు. బాబా నాతోడు వుండు అని అన్నాను కదా, ఎక్కడున్నావు అనుకుంటున్నాను . అంతలో నే మిర్యాలగూడ వెళ్లే ప్లాట్ఫారం వచ్చేసింది . అక్కడే చిన్న మందిరం ఏదో కనిపించింది బస్టాండ్ లో . బాబా మందిరమేనా అని ఆశ గా లోపలికెళ్ళాను . చాలా పెద్ద బాబా ఫోటో ద్వారకామాయి లో కూర్చుని వున్నది ఉంది .
బాబా కి దణ్ణం పెట్టుకుని విభూతి తీసుకుని బయటికొస్తే ,అటు పక్క న శ్రీ శరత్ బాబు గారు వున్న పెద్ద ఫోటో కూడా ఉంది.బహుశా వారి శిష్యులు ఈ ఫోటో లు బస్టాండ్ లో ఏర్పాటు చేశారేమో అనుకున్నాను .మందిరం ఎదురుగానే వున్న మిర్యాల గూడా ప్లాట్ఫారం పై బస్సు ఎక్కి మిర్యాలగూడ చేరుకున్నాను . అక్కడ ఇంకో బస్సు ఎక్కాల్సి ఉంటుంది .పక్క వారిని అడుగుతే , ఆ బస్సు కి చాలా రద్దీ ఉంటుందని తెలిసింది .ఆ బస్సు వచ్చేసరికి ఎక్కడానికి ప్రయాణికులు విపరీతంగా వున్నారు .. ముందే ఆ బస్సు నిండుగా ఉంది . ఇంత మంది లో నేను ఎక్కగలనా అని భయపడ్డాను . ఎందుకంటె నా ముందు చాలా పెద్ద గుంపు ఉంది . అందరు ఎక్కడానికి తోసుకుంటున్నారు . బాబా నువ్వే నన్ను బస్సు ఎక్కించు ఎలాగయినా అనుకున్నాను . నా ముందర వున్న
ఒక అతను నన్ను చూసి ,నాకు దారి కల్పించడం వల్ల చాలా సులభం గా బస్సు ఎక్కేసాను .ఇక స్టేజి వచ్చి బస్సు దిగేసరికి 7pm అయ్యింది . అక్కడి నుండి సుమారు 1km నడిచి ఆశ్రమం చేరుకోవాలి . దిగేసరికి ఒక సాయి సేవక్ నా ఎదురుగా కనిపించారు . ఆవిడ కూడా ఆశ్రమానికే వస్తున్నారు. అలా ఇద్దరం ఆశ్రమం చేరుకున్నాము .
తెల్లారి అందరితో బాటు ఉదయాన్నే ఫ్రెషప్ అయ్యి మందిరం లో కాకడ ఆరతి కి అటెండ్ అయ్యాను . తరువాత సాయికోటి స్థూపం ప్రదక్షిణ , గురు దర్శనం చేసుకున్నాను . మందిర నిర్మాణం విషయం లో గురు గారి ఆశీసులు అందాయి . గురుదేవా శరణం శరణం ..గురుగారితో బాటు మొదటిసారి నాగార్జున సాగర్ లో స్టీమర్ లో ప్రయాణించడం చాల ఆనందాన్ని కల్గించింది. తరువాత గురు గారి సత్సన్గ్ విన్నాము . సత్సన్గ్ లో ఎలా ఉండాలి, ఎలా వుండవద్దో చాల చక్కగా వివరం గా తెలుసుకున్నాను .తిరుగు ప్రయాణం లో నేను ఊహించని విధం గా సాయి, సాయిబంధువుల కార్ లో hyd వరకు ప్రయాణం ఏర్పాటు చేసారు . దారి లో ప్రముఖ చింతపల్లి సాయిమందిరం ని కూడా దర్శించుకున్నాము ..hyd mgbs చేరుకునేసరికి 9 pm అయ్యింది.
hyd లో వారి పని అయిపోయి మా పేరెంట్స్ మా వూరికెళ్ళిపోయారని తెలిసి నేను ముందుగా అనుకున్నట్లు hyd లో నే మా సిస్టర్ వాళ్ళింట్లో స్టే చేయడం కుదరక మా ఊరుకి బయలుదేరక తప్పలేదు. కానీ మా ఊరికి ఇంకో మూడు గంటలు ప్రయాణం . మళ్ళి బాబా ని వేడుకుని మా వూరికెళ్లే ప్లాట్ఫారం చేరుకునేసరికి, మళ్ళీ బాబా బస్టాండ్ లో ని ఒక షాప్ లో దర్శనం ఇచ్చేసరికి ధాయిర్యం గా బస్సు ఎక్కాను .. తెల్లవారుజామున 3 .45 am కి లేచిఉన్నందున బస్సు లో ఎంత ఆపుకున్న ఆగని నిద్ర వచ్చేసింది . మా వూరు 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అనగా ఎవరో గట్టిగా కుదిపేసినట్లు అయ్యింది .లేచి చూసేసరికి మా వూరు వచ్చేసింది . బాబా నన్ను నిద్ర నుండి లేపారేమో అనుకున్నాను . అలా క్షేమం గా ఏ ఇబ్బంది లేకుండా గా ప్రయాణం గడిచింది .
ఈ విధం గా ఈ గురు పూర్ణిమ కి బాబా నాకు కలిగించిన అనుభూతి మరువలేనిది . హే సాయినాథ ! నా పై ఇలాగే మీ కృపా దృష్టి ఎల్లపుడూ ప్రసరింప చేయుము .