SAI The Friend
Happy Friendship Day to all saibandhus!!
బాబాగారు భౌతిక శరీరంతో దర్శనం
1989 జూన్ నెలలో నేను, నా భార్య కలసి కొంత మంది మా రైల్వే మితులతో కలసి కాశీ యాత్రకు బయలురినాము. మా ఇద్దరు పిల్లలను ఇంటిదగ్గర వదిలి పెట్టి వెళ్ళినాము. మా పొరుగింటి వాళ్ళ పిల్లలు మా పిల్లలను తరచూ కొడుతూ ఉండే వాళ్ళు. వాళ్ళను ఇంటి దగ్గర వదిలి వుంచటానికి మనసు చాలా బాధ పడింది. అయినా ప్రయణ మైనాము కదా అని కాశీయాత్ర పూర్తిచేసుకొని వచ్చాము. తిరిగి వచ్చినప్పటి నుంచి పొరుగు సమస్యలు ఎక్కువే, మనశ్శాంతి కరువై నది. వారు చీటికి మాటికి తగువు పెట్టుకొని మా యింటికి రావటం మాకు చాలా ఇబ్బందిగా వుండేది. మేము బాబాకు నమస్కరించి మొర పెట్టు కోవటం తప్ప తిరిగి ఏమీ అనలేకపోయేవాళ్ళం. దానిని వాళ్ళు మరింత ఆసరాగా తీసుకొని నేను ఇంట్లోలేని సమయం లో నా భార్యతో తగాదా పెట్టుకొని అనరాని మాటలు అంటూ ఆతి నీచంగా ప్రవర్తించేవాళ్ళు. నా భార్య శివపార్వతి కూడ బాబాతో మొర పెట్టుకోవటం తప్ప వాళ్ళను ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోయేది.
ఆఖరికి ఒకనాడు ఆ మాటలు విని భరించలేక యింటిలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయసాగిందట. వెంటనే ఆమెకు ఇంటి బయట గుమ్మము నుంచి సాయిబాబా కే మాతా అని బిగ్గరగా పిలిచిన శబ్దం విని ఆత్మహత్యా ప్రయత్నం మానుకొని బయటకు వచ్చి చూస్తే, ఇద్దరు హిందుస్తానీ సాధువులు, ఒకరు ముసలి వయస్సులో అచ్చం బాబాగారిలా వున్నారట. ఇంకొకరు 35- 50 సంవత్సరముల వయస్సులో వున్నారట. ఇద్దరినీ ఇంటిలోనికి ఆహ్వానించిందట. ముసలి సాధు నా భార్యతో – “అమ్మా మీరు మూడు సముద్రములో మునిగివచ్చారు. ఇప్పుడు నీ మనస్సులో మూడుసముద్రములు పొంగుచున్నవి’‘ అనగానే ఆమెకు చెప్పలేని దుఃఖం వచ్చిందట. అప్పుడు ఆ సాధువు ఆమెను ఓదార్చుతూ,“ఏమీ బాధపడకమ్మా! మేము కోపరగాం నుంచి వచ్చాం. నీ కష్టాలను తీసుకొని వెళుతున్నా. ఇంకేమి కష్టముండదు, నా మాట నమ్ము తల్లి బాబా మీద నమ్మకం లేదా? బాబా ఎప్పుడైనా ఎవరికైనా ఆబద్ధం చెప్పి నాడా?” అంటూ తల నిమురుతూ, ఆమె చేతిలో ఒక ఎండిన తులసీదళాన్ని వేసి ,నీకు దర్శనం కావాలంటే నీ యిష్ట దైవాన్ని తలచుకో నీకే అర్థమౌతుందని అన్నారట. అప్పుడు నా భార్య ఆ తులసిదళంతో బాబా పటం దగ్గరకు వెళ్ళి మనస్సులో బాబాను ధ్యానించుకోగానే చేతి లోని తులసిదళం మాయమై ఆ స్థానంలో మందార పువ్వు, మల్లెపూలు, ఒక తావీదు ఉన్న దట. ఆ తావీదు ఇప్పటికీ మా ఇంట్లోనే వున్నది.
ఆ తరువాత వారిద్దరికీ నా భార్య భోజనం పెడితే భోం చేసి వెళ్ళారట, వీరు ఆచ్చం బాబాలాగానే వున్నారు. బాబా అనేక * రూపాలలో వస్తూ వుంటారు కదా? ఎటు వైపు ఎలా వెళతారో చూద్దామని గుమ్మం ముందు నిలబడ్డదట. మా ఇంటిముందు రైలు పట్టాలు దాటి నడుస్తూ చూస్తుండగానే మాయమైనారట. నేను ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో జరిగిన ఈ విషయా లన్నీ చేప్పగా నేను, ఆమె ఎంతో సంతోషించాం. ఆరోజూ నుంచి ఇంతవరకు చాలా సంతోషంతో బాగానే ఉన్నాం.. బాబాగారు తిరిగి మా యింటికి వస్తానన్నారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం.
–ధనుంజయ రావు గారు
నాస్తికుడైన ధనుంజయరావును ఆస్తికునిగా మార్చటమే కాకుండా ఆత్మహత్య చేసుకొని మరణించాలనుకున్న ఆయన భార్య శివపార్వతికి దర్శనమిచ్చి, నిదర్శనాలు చూపించి ఆమె బాధలను తీసుకువెళ్ళిన సాయి సమర్ధుడైన సద్గురువని ఎంచి, మన బాధలను, బరువులను, కష్టాలను, నష్టాలను ఆయన సమాధిపై వేద్దాం వాటినన్నిటినీ ఆయన మోస్తూ, మన అను అన్ని వైపుల నుంచి రక్షిస్తాడు.
శాంతి ప్రదాత – సాయి శరణం