అమ్ముల సాధనా మార్గాలు-9

అమ్ముల (పూజ్య గురుదేవులు )బోధించిన సాధనా మార్గాలు-8

 

జై సాయినాథాయ నమః !

 

22491837_141136839965647_1428984581032161498_n

స్వార్ధాన్ని జయించండి!

స్వార్థమనే గుణం మన శరీరంలో అరికాలు నుంచి నడినెత్తి వరకు గల శరీర భాగాలలో పూర్తిగా నిండి పొర్లి పారు తున్నట్లుగా మనకు పదేపదే కనిపిస్తూ వుంటుంది. యింత ఎక్కువగా వున్నా కూడ ,సాధారణ సంసార జీవితంలో సత మతమౌతూ వున్న వుద్యోగ, వ్యాపార, యితర వృత్తులలో వున్న సామాన్యుల మైన మన అందరికీ. స్వార్ధం అనే గుణం ఒకటి మనలో వున్నట్లుగా అసలు మనకు కనిపించదు. కాని చేసే ఆలోచనలలో, పనులలో అది ఎప్పుడూ తొంగిచూస్తూనే వుంటుంది. నిజం చెప్పాలంటే వివిధ రకాలైన దేముళ్ళ దగ్గ అదే రకు వెళ్ళేది కూడ స్వార్ద కోరికలు తీరాలనే !

సత్సంగం వలనగాని, సత్ గ్రంధ పఠనం వలనగాని, ఆత్మవిమర్శనాశ క్తి వలనగాని, జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల ద్వారా పొందే అనుభవాల వలనగాని, వీటన్నిటినీ మించి భగవత్సంకల్పం వలనగాని, కొద్దిపాటి జ్ఞానదృష్టి మనలో ప్రారంభమౌతున్నప్పుడు మాత్రమే, సద్గురు కృప వలన ఈస్వార్దమనే గుణం మనలో కూడ వున్నది గుర్తించగల్గుతాము  మనలో వున్న స్వార్ధ గుణాన్ని మనం గుర్తించగలిగినప్పుడు దీనిని తొలగించుకోవటానికి గట్టి ప్రయత్నం చేయాలి. నిస్వార్ధ జీవితం గడపాలనే పవిత్ర భావం మనస్సులో స్థిరంచేసుకోవాలి. ఈ స్థితివరకు రావటం కేవలం గొప్పతనం కాదు. యిక్కడి నుంచే అసలు కష్టం మొదలౌతుంది. మనం ఎంత నిస్వార్ధంగా వుండాలన్నా అంతకు ముందు రక్తంలోని భాగంగా తయారైన స్వార్ధ గుణం మనకు తెలియకుండానే మన చేత స్వార్ధపు పనులు చేయిస్తూ వుంటుంది. యిలా ఆవకాశాలు వున్నప్పుడు స్వార్ధ గుణం కోడె త్రాచువలె పడగవిప్పి బుద్ధిని లొంగతీసుకుని మన చేత స్వార్ధపు పనులు చేయిస్తూనే వుంటుంది. అలాంటి పనులు చేసిన తరువాత బుద్ధి మళ్ళీ తన ఆలోచనలలోకి వచ్చి * అయ్యో నేను ఓడిపోయానే అని కొంత సేపు బాధపడుతుంది.

యిలా ఆనేక సార్లు బుద్ధి పై స్వార్ధం విజయం సాధించి మన చేత స్వార్ధపు పనులు మనం వద్దనుకున్నా చేయిస్తూనే వుంటుంది. ఈ కుస్తీ పోటీలలో అనేకసార్లు కింద, మీద పడిన తరువాత మాత్రమే స్వార్ధాన్ని జయించగలుగుతాము.

 

 సాయి సూక్తుల ప్రకారం స్వార్థం గురించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే “అసలు నీవెవరు? నీకు  ధనం ఎందుకు? ధనంకోసం యింత తాపత్రయ పడతావెందుకు” అన్నారు బాబా. మనం ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఏమీ తీసుకురావటంలేదు. అలాగే చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోవటం లేదు. కేవలం పొట్ట కూటికోసం మాత్రమే అవసర మయ్యే ఈ ధనంకోసం యింత తాపత్రయం మనం ఎందుకు పడుతున్నాం ! యిది ఒక భ్రమ, ఒకరకం పిచ్చి, వెర్రితనం కాక మరేమిటి? మనం చనిపోయేటప్పుడు మనం | సంపాదించే ఆస్తిపాస్తులు మన వెంట రావు. పైగా ఆ ఆస్తిపాస్తులు సంపాదించటానికి మనం చేసిన పాపపు పనులు ఏమైనా వుంటే వాటి ఫలితాలు మాత్రం మనతోపాటుగా మరు జన్మకు మన వెంట వస్తాయి. అంటే అర్ధమేమిటన్న మాట. స్వార్ధగుణం అనే శత్రువుకు పూర్తిగా లొంగిపోయిన వారు తమతోపాటుగా శాశ్వతంగా తమ వెంటరాని భౌతిక మైన ఆస్తి పాస్తులకోసం అడ్డదారులలో అన్యాయం చేస్తూ పాపం సంపాదిస్తే , ఆ పాప ఫలితం మాత్రం  మరుజన్మ లోకి తమ వెంట వచ్చి తమను బాధిస్తుంది. అంటే మన చేత అడ్డదారులు తొక్కించి, పాపపు పనులు చేయించి, జన్మ జన్మల వరకు మన లను బాధలకు గురిచేసే భయంకర మైన శత్రువు- స్వార్థం. ఆందువలనే సాయి సైనికులు ఈ గుణం పై ఈ క్షణ నుంచే ఆంతులేని, భయంకరమైన పోరాటాన్ని ప్రారంభించాలి. ఈ పోరాటం ఎవరికోసమో కాదు. మన కోసం, మన క్షేమం కోసం. మనం తప్పులు చేయకుండా వుండటం కోసం. పాప ఫలితాలు జన్మ జన్మలకు అనుభవించకుండా వుండటం కోసం.మన బాగు కోరుకుని మనమే సైనికులమై మనలో వున్న ఈ శత్రువును జయించాలి.

బాబా సర్వసమర్థుడు. ఈ సృష్టి అంతా ఆయనే కాబట్టి, ఆయనవద్ద ఆన్ని సంపదలు వున్నట్లే కదా! ఈ అనంత సృష్టిలోని ఏ వస్తువు లేక పదార్దము, సంపద లేక ఔషధము  ఏవి కావాలన్నా అన్నీ ఆయన దగ్గర నిండుగా దండిగా వుంటాయి. ఈ విషయం బాబా మాటలలోనే “నా కోశాగారము నిండుగా వుండి పొంగి పొర్లిపోతూ వుంటుంది”. యిలా అన్నీ బాబావద్ద వున్నప్పుడు ,తన భక్తులకు ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ఆప్పుడు వారి అవసరమ, అర్హత లను బట్టి ఆయన యిస్తూవుంటాడు. అయితే మనం మాత్రం బాబామీద పూర్తి విశ్వాసం వుంచకండ ఆవకాశం వచ్చినప్పుడల్లా చిల్లర స్వార్థాలకు పాల్పడుతూ అప్పుడప్పుడు ఆవవకాశాల ద్వారా ధనంకోసం ప్రయత్నాలు చేస్తాం. యిలాంటి వారి గురించి బాబా సూక్తి “నేను నీకు జలతారు శాలువను యిచ్చుటకు సిద్ధంగా వుంటే ,యితరుల దగ్గర నీవు పాతగుడ్డ పీలికలు దొంగిలించెదవెందుకు? నీకు నేను లేనా!” అని,

ధనాన్ని ఖర్చు పెట్టటంలో మన స్వభావం ఎలా వుంటుందో చూద్దాం! మన యింటికి ఎవరైనా స్నేహితులో లేక బంధువులో చూసిపోవటానికి వచ్చారనుకోండి. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయా పరిస్థితులనుబట్టి కాఫీ, టీ లేక ఫలహారము, భోజనమో చేయమని వత్తిడి చేస్తాం. వారు వద్దంటున్నా బలవంతం చేస్తాం. తీసుకోమని వత్తిడి చేస్తాం. అదే టైములో గుమ్మం ముందు బిచ్చగాడు నిలిచి అమ్మా, ధర్మం! గుప్పెడు అన్నం పెట్టమని దీనంగా అడుగుతూ వుంటే చేతులు ఖాళీ లేవు పొమ్మంటాం. ఆకలితో అలమటిస్తూ కావాలని ఆడిగేవాడికి పెట్టం. వద్దన్న వాళ్ళని తినమని బలవంతం చేస్తాం. ఏమిటి దీనికి కారణం. బాగా ఆలోచిస్తే స్వార్ధమే యిందుకు మూలం, స్నేహితులో, బంధువులో యింటికి వచ్చి నప్పుడు వాళ్ళకు మర్యాద చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయం ఒక కారణం. యింతకంటే ముఖ్యమైన కారణం – వాళ్ళకు మనం పెడితే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరకు ఎప్పుడేనా వెళ్ళినప్పుడు తిరిగి పెడతారనే ఒక ఆశ, ఆదే బిచ్చగాడికి పెడితే అది తిరిగి రాకపోగా మళ్ళీ రేపు బిచ్చగాడు తయా రవుతాడనే భయం.

సాయి సైనికులుగా మారాలనుకునే భక్తులు మాత్రం హీనులకు, దీనులకు, సమాజంలో అట్టడుగున వున్న అభాగ్యుల కోసం తమ సంపాదనలో కొంతభగం తమ స్థితినిబట్టి తప్పని సరిగా ఖర్చు చేయాలి, తప్పదు. యిలాంటి నిస్వార్థ సేవకు తప్పక కొంత ధనం ఖర్చు చేయాలి. దీనిని గురించిన బాబా సూక్తి ని గమనిద్దాం- “ధనము స్వార్ధమునకు ఖర్చు చేసిన ఆది నిరుపయోగమగును”.

జీవితంతో అన్నీ సక్రమంగా జరుగుతూ, సుఖప్రదమైన జీవితం సాగుతున్నా చాలామంది తొందరగా లక్షలకు లక్షలు సంపాదించాలనే తాపత్రయంతో ఏవేవో ఆలోచనలు చేస్తూ బాబా దగ్గరకు వెళ్ళి ధనంకోసం ప్రార్ధిస్తారు. యిలాంటి వారిని గురించి బాబా చెప్పిన సూక్తిని గమనిద్దాం. “ప్రజలు అంతా చెడ్డవారై నన్ను బాధ పెడుతున్నారు, సిగ్గులేకుండా కేవలం డబ్బుకోసమే నన్ను బాధిస్తున్నారు. నేను విసిగి పోయాను”. కాబట్టి డబ్బు కోసం ఏనాడు బాబాను ప్రార్ధించవద్దు. మనం అడక్కపోయినాసరే గత జన్మలోని మన కర్మల ప్రకారం మనకు ధనం పొందే అర్హత వున్నదాని కంటే యింకా ఏమాత్ర మైనా ఎక్కు వే మనకు అందించాలని గా ప్రయత్నిస్తూ వుంటాడు,

ఈ విధం గా, స్వార్ధాన్ని కొంతవరకు జయించిన సాయి సైనికులు మమకారమనే గుణానికి లొంగిపోయి, నాకోసం ఏమీ ఆక్కర్లేదుగాని నా సంసారపు సభ్యులకోసం యిలా చేస్తున్నాను అంటూ గందరగోళ పడుతూ వుంటారు. సంసారపు సభ్యులకోసమే అయినా ధర్మ మార్గాన్ని తప్పటం మాత్రం ఏనాటికీ మంచిది కాదు. “ఈ సంసారము నాది కాదు దేము డిది అని భావించి, జాగ్రత్తగ వుండి, నీ కర్తవ్యమును మాత్రము నీవు జాగ్రత్తగ పూర్తిచేయి’ ఆన్న బాబా సూచన ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి.

పైన సూచించిన విధంగా ఒక్కొక్క విషయంలోను జాగ్రత్తగా ప్రవర్తిస్తూ వుండాలి, మనం ఎంత ప్రయత్నంచినా కోరికలు, మమకారంలాంటి గుణాలు తొందరగా మనలో నుంచి పోవు. ఎన్నాళ్ళు గట్టి ప్రయత్నంచేసి ఆణగతొక్కినాఎప్పుడో ఒకసారి యివి నీద్రలేచి మనల్ని ఆణగతొక్కుతాయి. మమకారాన్ని, విషయ కోరికలను పూర్తిగా వదలనిలో బహ్మ తత్వం అంటే ఏమిటో ఆలోచనకు కూడ అందదు “ అన్న సాయిసూచన ప్రకారం సాయి సైనికులంతా వీటిపై భయంకరమైన పోరాటాన్ని ప్రారంభించాలి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close