దైవం మానుష రూపేణా

దైవం మానుష రూపేణా


IMG_20190818_223857.jpg

“1993 నవంబరు నెలలో శ్రీ సాంబశివరావు గారిని ఆహ్వానించడానికి టౌన్ రైల్వే స్టేషన్ కు వెళ్ళితిని. అతి సామాన్యంగా దిగిన ఇద్దరు వ్యక్తులలో మొదలుగా భారి విగ్రహం గల వ్యక్తిని చూచి శ్రీ సాంబశివరావు గారుగా భావించాను. కాని వారి వెనుక అతి సామన్యంగా భుజానికి చిన్న సంచి , చేతిలో చిన్న Brief Case తో దిగిన వారే సాంబశివరావు గారని కుక్కు టేశ్వరరావు గారు పరిచయం చేయగానే చాలా ఆశ్చర్యపోయితిని.”6వ సాయి కోటి యజ్ఞంలో సాంబశివరావు గార్ని నిశితంగా చూశాను. కాని నాకు ఏమి బోధపడలేదు. ”7వ” సాయికోటి యజ్ఞంలో వారికి చాలా సన్ని హింతగా తిరగడం వల్ల కొంచెం కొంచెముగా శ్రీ సాంబశివరావు గార్ని, వారిలో ఒక నూతన వ్యక్తిని చూడ గలిగాను. ఆ మహాత్ముని శక్తిని క్రమంగా వారి పరిచయం సహచర్యం ద్వారా, పూర్తిగా అర్థం చేసుకోగలిగితిని.

అప్పటి నుంచి వారి ప్రవచనాలు బోధలను విని వారి రచనలను సూక్తులను చదవడంవల్ల నాలో బాబా భక్తి ఒక మహత్తర శక్తిగా మారింది. జీవిత కాలం బాబా సేవకే అంకితం చేయాలి అనే భావం శ్రీ గురు దేవులు సాంఒశివ రావు గారి సాహచర్యం వారి ఆశీర్వాదంతో బలపడింది. నిజమైన సాయి సేవకునిగా మారితిని.సాంబశివరావు గార్ని అప్పటి నుంచి నా మనోఫలకం పై శ్రీ సాయిగా ప్రతిష్టించుకొని ఆరాధించడం మొదలు పెట్టాను.

చూపులకు వారు సామాన్యులు ఆర్తులను ఆదరించుటలో అసామాన్యులు. ఆ శివుడే అనంత శక్తి మయు డై , ఈ సాంబశివుడై -సర్వస్య శరణాగతియన్న అగుపించును సాయిశుడై ”

జూలై మాసం 19వ తేది శ్రీ గురు దేవుల ఆశీర్వాదంతో వారి పరి వేక్షణలో వారిచే నా స్వగృహంలో సాయి సత్యవ్రతం చేయించుకొన్నాను. వారి పాద స్పర్శతో పవిత్రం కాబడిన ఆ ఇల్లు అప్పటికి మా అన్నదమ్ములు ముగురి ఉమ్మడి ఆస్థి. ‘శ్రీ సాంబశివరావుగారి ఆశీర్వాదం పొందిన ఒక వారం రోజులకు నా ఇద్దరు తమ్ములు వచ్చి వారికి హక్కు ఉన్న రెండు భాగాల ఆస్థిని దాని పై గల అప్పులను వదలి మొ త్తం ఇంటిని నాకు స్వాధీనం చేయడం ఇది శ్రీ బాబా ఆశీర్వాద ఫలం, శ్రీ సాంబశివరావు గారి అనుగ్రహం కాక మరి ఏమిటి ? ఎవ్వరి భాగం వారు తీసుకొంటారు, అనుకొన్నది ఎప్పటికి ఉహించనది జరిగింది. ఇది శ్రీ సాంబశివరావు గారి లీల కాదా ! ఏదై నా విషయ సమస్య ,ఇబ్బంది కలితే శ్రీ గురు దేవులు సాంబశివరావు గార్కి ఉత్తరం వాసుకొంటే * వార్నించి తిరిగి సమాధానం వచ్చే సరికి సమస్య పరిష్కరించబడటం, ఇలా వ్రాసుకొంటు పోతే తరగని ఏన్నో లీలలు.  శ్రీ సాయి బాబా సాంబశివుని రూపంలో తిరుగుతూ మన భవరోగాలను భౌతిక మైన సమస్యలను తీర్చి, ఆధ్యాత్మిక మార్గం వైపు మనల్ని నడిపించడం మన పూర్వ జన్మ సుకృతం, శ్రీ సాయి నాధుని ఆశీర్వాదం.

కె. వి. వి. ప్రసాద్ రావు

 

 

శ్రీ గురు సాంబశివుని సూక్తులు

1.మేలు చేయకపోయినా ఫరవాలేదు. ఎవరికీ కీడు చేయవద్దు.

2.న్యాయంగా, ధర్మంగా నీవు సుఖపడుతూ అందరినీ సుఖపెట్టు. ఇదే పరమ మంత్రం.

3. నీ శక్తికి మించిన పని ఏదీ నీవు చేయవద్దు.

4. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు మించి పిల్లలను ప్రేమించువారు ఎవ్వరూ వుండరు.

5.భగవంతుడు ఇచ్చినదానితో హాయిగా, సంతోషంగా జీవించటమే నిజమైన వైరాగ్యం.

6.భౌతిక సంపదలన్నిటికన్నా శారీరక ఆరోగ్యం విలువైనది.

7.బాధ్యతను మరచినవాడు నిజమైన బాబా భక్తుడు కాడు.

8. ఆత్మను గురించి అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికము.

9. గురువును త్రికరణశుద్ధిగా నమ్మినపుడు ఆ గురువు ఏమి చెబితే అది చేయాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close