శ్రీ సాయినాధాయ నమః!
బాబా తనని ఆశ్రయించిన భక్తుల భక్తి విశ్వాసాలను దృఢంగా మార్చడానికిి ఎన్నోమార్చడానికి ఎన్నో విధాలుగాా ప్రయత్నిస్తుంటాడు. వారిలోని సంకుచిత భావాలను, మూఢవిశ్వాసాలను తొలగించడానికి, పలు పరిస్థితులను కల్పించి అనుభవపూర్వకంగా వారి వారి మూఢవిశ్వాసాలను సంకుచిత భావన లను దూరం చేస్తుంటాడు.
శ్రీ ఎక్కిరాల భరద్వాజ గురువుగారి సాయి సచ్చరిత్రను లోని విషయాలను చూద్దాము. బాబా అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి ఒక వర్తకుడి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగు తో మరణించాడు ఇంకా శవం అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కె ను పంపారు., “ధైర్యం ఉంటే, అలమారా లోని మిఠాయి తీసుకోమ”ని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్ళాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కే తో, “అది తింటే చచ్చి పోతాను అని ఊరు విడిస్తే బతుకుతాను అని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు.ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు నిన్ను కొడుతుంది” అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్టురోగుల చేత ఊది అందరికీ ఇప్పించే వారు. అయినా ఎవరికి ఏ ప్రమాదమూ జరగలేదు. శ్రీమతి మేనేజర్ మాటల్లో,. “వెళ్ళిపోతున్న ఒక కుష్టురోగి ని వెనక్కి పిలిచి అతని మూట లోని పాలకోవా నాకు ఇచ్చారు ఆయన పని ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రతా సహనము సోదరభావం బోధిస్తున్నారు అని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకి అతీతమని గుర్తించాను. ” అని ఆమె చెప్పింది.
అలాగే శిరిడీలో కట్టెల బండిని రాకుండా చేయాలని, వేరే ఊరి నుండి కట్టెల బండి వస్తే ప్లేగు వ్యాధి ప్రబలుతోంది అని మూఢంగా విశ్వసించిన శిరిడి ప్రజలనీ బాబా ఎలా సరిదిద్దేరో మనకు తెలిసిందే. బాబా కట్టెల బండిని షిరిడిలో కి రానిచ్చి, కట్టెలను కొన్నారు. అయినా ప్లేగు వ్యాధి ప్రబల లేదు. ఇది వారికి నిదర్శనంగా చూపించి, ప్రజల్లోని మూఢవిశ్వాసాలను బాబా ఇలా దూరం చేసే వారు.
గమనిస్తే బాబా ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా మనకు బోధిస్తూ ఉంటారు. మనము ప్రతి సంఘటనని ఆధ్యాత్మికపరంగా పరిశీలించుకుంటే, ప్రతి సంఘటనలో బాబా ఉద్దేశం, బాబా మనకి బోధించాలి అనుకున్న నీతి మనకి అర్థమైపోతుంది. అందుకే బాబానీ నమ్ముకునే మనము, మనకి ఎదురయ్యే ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. తద్వారా బాబా ఉద్దేశాన్ని , ఉపదేశాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టాలి.
సదాచార సంపన్నుడైన దాదా కేల్కర్నీ, తాను వండుతున్న మాంసం పులావు ఉడికినది లేనిది చూడమని బాబా చెప్పాడు. అతడు బ్రాహ్మణుడు అవడం వలన మూతతీసి చూడకుండా ఉడికింది అని చెప్పాడు. అప్పుడు బాబా దాదా కేల్కర్ చేతిని చాలా వేడిగా ఉన్న ఆ పాత్రలో పెట్టి,, “ఇప్పుడు కొంచెం ప్లేట్లో తీసుకుని చేత్తో పరిశీలించి సరిగ్గా ఉడికినది లేనిది చెప్పు” అని అన్నాడు. బాబా తల్లిలా, ఈ విధంగా కఠినంగా వ్యవహరించి అయినా సరే, తన బిడ్డలని సరైన పంథాలో ఆలోచించేలా, ప్రవర్తించేలా చేస్తుంటాడు.
నా విషయంలోనూ ( సాయి సుమ)కొన్ని సార్లు అలాగే జరుగుతోంది. కొన్ని విషయాలను చేయాలా వద్దా అని బాబా కి చిట్టీల ద్వారా అడిగినప్పుడు, బాబా చేయమని చెప్పి, వాటిలోని ఇబ్బందులను నాకు అనుభవపూర్వకంగా అర్థమయ్యేలా చేశారు. అలాగే కొన్ని సంఘటనలను ఏర్పరిచి, నాలో ఏదైనా ప్రవర్తన దోషాలు ఉంటే వాటిని నేనే గ్రహించేలా చేస్తున్నారు.ఎందుకంటే ఏ విషయమైనా అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటేనే, ఆ జ్ఞానం మనసుకి గట్టిగా పట్టుకుంటుంది.
సత్యాసత్యాలను కళ్ళకు కట్టినట్టు అనుభవపూర్వకంగా సాయిబాబా బోధిస్తారు. ప్రతి విషయము సాయి ఆజ్ఞ తోనే జరుగుతున్నదని భావించే సాయి భక్తులకు అందరమూ, ప్రతి విషయంలో బాబా బోధించే విషయాలని గ్రహించడానికి ఇకనుండి ప్రయత్నం చేద్దాం.