శ్రీ సాయినాథాయ నమః!
శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి, ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో మే 5 1970 న జన్మించాడు. వీరి అసలు పేరు కాశీనాథ్
బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణ లో గడిపేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పు ఏమీ రాలేదు. ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసింది అని తెలిసి తిరిగి వచ్చాడు. కానీ కొద్ది కాలానికి అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్లిపోయి ఎన్నో కష్టాలు ఓర్చుకుని సాదు సాంగత్యం చేస్తుండేవాడు. తర్వాత మళ్లీ స్వగ్రామమైన పాట్నా కు వేళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ గుహ కనిపించింది .అందులో కూర్చుని ప్రాయోపవేశం చేయ దలచి ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనం అయింది. పక్కన ఎవరో నించుని అతని చర్మం ఓలుస్తున్నారురు. అతడు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్లీ బాహ్య స్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. ప్రక్కనే వాన నీరు చిన్న మడుగు కట్టి ఉంటే త్రాగి వాటి తో శరీరం తుడుచుకున్నాడు. నాలుగవ రోజు మరో దర్శనం అయింది.” దప్పికతో తానొక కాలువ దగ్గరికి వెళుతున్నాడు. తనుకు ఒక వైపు ముస్లిం సాధువు, మరొకవైపు ఒక సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి ఎందుకు చావడానికి ప్రయత్నిస్తారు ? మేము నిన్ను ఎన్నటికీ చావనీవ్వము “అని అన్నారు. అప్పుడు అతడు గుహ నుండి దిగి, జూలై 22 1890 కి ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధిస్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఒక సంవత్సరంలో గా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబం అప్పులపాలైయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు అతనిని ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యము అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడు అయ్యాడు. కానీ వ్యాపారం లో అంతా నష్టపోయాడు. బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్ర చేశారు. ఓంకారేశ్వర్ లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా, భార్య భయపడి మీద మీరు చెల్లి మేల్కొలిపింది అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది .నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగం లో వచ్చిన బాధను యోగ పూర్ణుడై తొలగించగలరు. అని తలచి భార్యను వదిలి 1911లో అట్టి దారిని వెదుకుతూ బయలుదేరాడు కాశీనాథ్.
అతడు rahuri లో యోగి కులకర్ణి దర్శిస్తే ఆయన, “నీవు మంచి స్థితిలో ఉన్నావు. నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు” అన్నారు. కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించ లేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి “చల్లని నీరు తాగవద్దు. వేడి నీరు మాత్రమే త్రాగు” అని చెప్పాడు అతడు ఆ మాట లెక్క పెట్టక, వేరొకచోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడు మళ్లీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. అతడు దత్తావతారం గా ప్రసిద్ధి కెక్కిన శ్రీ నారాయణ మహారాజ్ ను దర్శించాడు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, ” నీవు లోపల బయట బంగారం పోసినట్లు మంచి యోగ స్థితిలో ఉన్నావు .నీవు కోరదగినది ఏమీ లేదు “అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణి నీ దర్శించాడు ఆయన వెనుకటి సలహా నే ఇచ్చాడు. చేసేదేమి లేక జూన్ 27 1911 నాడు షిరిడి చేరాడు కాశీనాథ్.
రెండు రోజులు సాయి సన్నిధిలో ఉండడం తో అతడికి బాధ మటుమాయం అయింది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరం అనిపించి, తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు.” నీవు వెళ్లొద్దు. వెళితే, ఎనిమిదవరోజు తిరిగి రావాలి “అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, ” సరే వెళ్ళు. నేను చేసేది చేస్తాను “అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదోవ రోజుకు ఇరవై మైళ్ళ లో ఉన్న కోపర్గావ్ చేరాడు. అక్కడ ఉన్న భక్తులు అతనిని తోడుగా తీసుకెళ్లారు. అతన్ని చూస్తూనే బాబా, ” ఎన్ని రోజులు అయింది ?”అన్నారు. “ఎనిమిది రోజులు అయింది” అన్నాడు కాశీనాథ్ .అప్పుడు అతనిని వాడాలో ఉండమని ఆజ్ఞాపించాడు. ఈసారి అతడు ఆయన మాటకు తలొగాడు. షిరిడీలో నిత్యం భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది. ఒక రోజు అతని వైపు చూసి నవ్వుతూ బాబా భక్తులతో అన్నారు ఇలా. “ఒకప్పుడు ఒక స్త్రీ కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు.ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్కచేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలో నీ బిడ్డలు నశిస్తారు ఏమో అని నేను ఆమెను మరలా మందలించా ను. పక్క గ్రామంలో వేడి నీరు త్రాగినాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది. “అన్నారు తనకు రెండు సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనే అని గుర్తించి పులకించారు కాశీనాథ్. తర్వాత బాబా, “కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికీ రుణానుబంధం ఉన్నది.” అని, “ఒక భావి ప్రక్క, చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగిం చ వలసి వచ్చింది “అన్నారు. మాయలో పడిన శిష్యుడిని రక్షించడానికి సద్గురువు అవతరించావలసి వచ్చిందని వారి భావం ఏమో. తర్వాత కాశీనాథ్ తో, “ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయం లో నాలుగు సంవత్సరాలు ఉండు. వారి కృపలభిస్తుంది “అన్నారు బాబా.
రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయి కినివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒక రోజు “నేను అక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా? “అన్నారు బాబా .అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక రోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంట పడింది. దానిని తరిమేసి, నివేదన తో మసీదు చేరగానే సాయి, ” ఇంతదూరం రానక్కరలేదు .నేను అక్కడే ఉన్నాను. ఆ నల్ల కుక్కను నేనే !” అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశ గా చూస్తున్నాడు ఆచార వంతుడైనా కాశీనాథ్ అతనిని వెళ్లగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, ” అక్కడ హరిజనుడు రూపంలో ఉన్ననన్ను తిట్టావు . నీవు ఎక్కడ చూస్తే అక్కడే నేను ఉన్నాను గుర్తుంచుకో !”అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్టి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా మూడు సంవత్సరాలకు పైగా ఆ కాలంలో అతడు ఎన్నో బాధలను అనుభవించాడు. ముక్కు కోపము, ఆత్మాభిమానం కల వాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి ఒకప్పుడు కొన్ని మాసాలు అన్న ద్వేషం అనుభవించాడు. తుంటరి లైన యువకులు ఆయనను ఎన్నో రీతుల బాధలు కలగాచేసేవారు. ఆ బాధలు భరించలేక ఎన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్లాలనుకున్నాడు. కానీ సాయి అనుమతి ఇవ్వలేదు. “ఇప్పుడు నీవెంత ఓర్చుకుంటే, నీ భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉంటుంది. నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉంటే నా స్థితి నీకు కలుగుతుంది” అనే వారు. కానీ అతడు సుమారు మూడున్నర సంవత్సరాలు షిరిడీలో ఉన్నాక, సాయి తో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్ పూర్ వెళ్లిపోయాడు. కానీ అప్పటికే అతనిలో యోగ శక్తులు ప్రకటన అయ్యేవి. ఉదాహరణకు నేవాసా నుండి కొందరు భక్తులతో నరహరి అను భక్తుడు సాయి నీ దర్శించాడు. కానీ ఆయన సాయిని ముస్లిమ్ అని శంకించాడు.వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూచాడు. అతడు బయటకి పోయి ఖండోబా లో ఉపాసన నిశాస్త్రి కి నమస్కరించపోయాడు. ఆయన తన కాళ్లు వెనక్కి తీసుకుని, “నీవు బ్రాహ్మణుడివి, సాయి ముస్లిం. నువ్వు ఆయనకు నమస్కరించకూడదు. అటువంటప్పుడు నీతో నాకు ఏమి పని? “అన్నారు. చివరకు ఆయన శిరిడి దగ్గరున్న sakori లో ఉపాసనీ బాబా గా స్థిరపడి డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు.
మూలం: శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతము