శ్రీ సాయినాధాయ నమః
సాయి తనను నమ్మిన వారిని వారి వెంటనే ఉండి కాపాడుతారు. సంవత్సరం 1914లో శివరాత్రి ముందురోజున హర్ద లో మెజిస్ట్రేట్ గా పనిచేసిన చోటు భయ్యా తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు. వాళ్లు నెవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బులు ఇస్తామన్నా బెస్త వాళ్ళు పడవ వేయమన్నారు. వాళ్లందరూ దిక్కుతోచక సాయిని స్మరిస్తూ ఉంటే, తలగుడ్డ కాఫీ ని గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ” ఆడవాళ్లను తీసుకుని ఇంత పొద్దు పోయి వచ్చారు. మీ పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ల యజమాని వచ్చి అయినా మిమ్మల్ని నది దాటించాలి” అని చెప్పి పది అడుగులు వెళ్లి ఇక కనిపించలేదు. ఇంతలో పడవ వారే పరుగున వచ్చి, అందరిని రమ్మని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే,” మీ చిత్తము వచ్చినంత ఇవ్వండి. లేకుంటే ఏమి ఇవ్వకండి. “అన్నారు ఆ కుటుంబం శిరిడీ చేరాక జరిగినదంతా తమ లీలే నని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు.
మరొక లీల. గణపతి బొండు కథం 1914లో సకుటుంబంగా శిరిడీ వెళుతున్నప్పుడు వారు ఎక్కినరైలు పెట్టెలో మరెవరూ లేరు. అతడు” భక్తిమార్గం ప్రదీపిక “అనే గ్రంధం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టె లోకి ఎక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్లు తాను చదివేది వినడానికి వచ్చారని అనుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండు గానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. అతడు ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ బిల్లులు వెనకకు చూస్తూ పరిగెత్తుతున్నారు. అతడు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే, ఒక పక్కగా వృద్ధ ఫకీర్ ఒకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలో ఎలా వచ్చారు అతనికి అర్థం కాలేదు మరలా చూసేసరికి ఆయన అక్కడ లేడు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లు శిరిడీ చేరగానే సాయి నవ్వి, “అరే, భద్రం గానే వచ్చారే” అని అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచు రైలు దోచే వారు.
అలానే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలో ఉన్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయల్దేరాడు. అతడు అడవి చేరేసరికి ప్రొద్దు దూకింది .అతడు ధైర్యం చేసి నడక సాగించి, “బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు. నేను అక్కడకు చేరేసరికి 11:00 అవుతుంది. నాకు ఒక కప్పు టీ కావాలి “అని ప్రార్థించాడు. అతడు పది మైళ్లు నడిచి ఆలయం వద్దకు రాగానే, “నానా వచ్చాడా? “అని పూజారి అనడం వినిపించింది. “నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు? ” అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టి అందిస్తూ , “నానా వస్తున్నాడు అతడికి టీ సిద్ధం చేయండి ” అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు.
ఒక్కసారి సాయి ని నమ్మి, సాయిని శరణుజొచ్చిన భక్తులు ఇక ఏ విషయంలోనూ చింతించనవసరం లేదు. వారికి తెలియకుండానే సాయి వారి వెంటే ఉండి వారిని ప్రతి ఆపదనుండి కష్టం నుండి గట్టెక్కిస్తారు. వారి ప్రతి చిన్న కోరికను కూడా గ్రహించి, ఇట్టే నెరవేర్చే ప్రేమ స్వరూపుడు మన సాయినాధుడు.
జై సాయి దేవా!