శ్రీ సాయి నాధాయ నమః!
1945 వ సంవత్సరంలో సాయి భక్తులైన దేవ్ యొక్క తల్లి అనారోగ్యం బారిన పడింది. తన తల్లి కి అంతిమ ఘడియలు సమీపించాఈ అని దేవుకి తెలియదు. బాబా ప్రేరణతో దేవ్ తన తల్లికి ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి అని చెప్పి, స్వయంగా షిరిడి వెళ్లి సాయి సమాధి మందిరంలో కూర్చుని, శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క పారాయణ ఆరంభించాడు. తన పారాయణ పూర్తికకుండానే తన తల్లి ఆరోగ్యం ఇంకా క్షీణించిందని టెలిగ్రామ్ దేవ్ కి వచ్చింది. దేవ్ సమాధి మందిరంలో బాబా ని, ఇంటికి వెళ్లాలా వద్దా అని అనుమతి అడిగాడు. బాబా యొక్క సమాధి అతని కి ఇంటికి వెళ్ళాలనే ప్రేరణ ఇచ్చింది., “బాబా అనుమతి అయితే ఇచ్చాడు, కానీ సమయం చాలా తక్కువ ఉంది. ఊరు చాలా దూరంలో ఉంది, ప్రయాణం ఎలా అవుతుంది? “అని దేవు ఆలోచనలో పడ్డాడు.
అప్పుడే ఒక చమత్కారం అయింది. బాబా స్వయంగా దేవ్ ఎదుట సాక్షాత్కరించాడు. బాబాతో ఒక గుర్రం కూడా ఉంది. బాబా మరియు దేవ్ ఇద్దరు సూక్ష్మ శరీరంతో ప్రయాణించారు. స్వయంగా బాబా మార్గదర్శనం చేస్తున్నందున, దేవ్ బాబా తన తల్లిని కలిసి తనకి ధైర్యాన్ని ఇచ్చారు.అప్పుడు దేవ్ యొక్క తల్లి అయిన ఆ వృద్ధురాలు ప్రశాంతంగా ప్రాణాన్ని విడిచింది.. శవ సంస్కారాలు అన్ని అయినాక దేవు మల్లి శిరిడీ తిరిగి వచ్చి తన పారాయణం పూర్తి కావించారు. దేవ్ బాబా తన తల్లి మృత్యువు యొక్క సమాచారము అక్కడి భక్తులకు వినిపించగా అందరు ఆశ్చర్యంతో స్తంభించి పోయారు. ఎందుకంటే, దేవ్ తాను తన తల్లి అంతిమ సంస్కారాలు కావించి వచ్చినట్టు చెప్తున్నా డు, కానీ అందరికీ దేవ్ బాబా సమాధి మందిరంలో పారాయణ చేస్తూ అక్కడే కూర్చున్నట్లు కనిపించాడు. ఈ విధంగా బాబా చాలా దివ్యశక్తులను దేవు కి ఇచ్చారు. దేవ్ ఇతరుల జీవితంలో జరగబోయే దుస్సంఘటన లను ముందే వారికి చెప్పి వారిని ప్రమాదాల నుండి కాపాడేవాడు.
దేవ్ సాధారణంగా బివ్వు పూరి మందిరానికి వెళ్లి అక్కడ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేసేవాడు. ఒకసారి అతడు పారాయణం పూర్తి చేయగా, గ్రామస్తులందరూ ప్రసాదంతో మందిరానికి చేరుకున్నారు. నారాయణ తర్వాత అందరికీ బాబా యొక్క భోజన ప్రసాదాలు వడ్డించ బడ్డాయి. మధ్యాహ్న హారతి సమయం అయింది. గ్రామస్తులందరూ మధ్యాహ్న హారతి లో పాల్గొన్నారు. దేవ్ కూడా హారతి లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఏదో దివ్యశక్తి వచ్చినట్టుగా అతడికి అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అక్కడ ఒక పొడవైన వ్యక్తి అతని పక్కన ఉండడం చూశాడు. ఆయన మిగిలిన గ్రామస్తుల కన్నా భిన్నంగా ఉన్నాడు. ఆ సమయంలో మంత్ర పుష్పాంజలి పూర్తి అయ్యింది. గ్రామస్తులందరూ ఆ మందిరంలోని విగ్రహానికి పుష్పాలను అర్పించారు. దేవ్ కి కనిపించిన ఆ పొడవైన వ్యక్తి కూడా విగ్రహానికి దగ్గరగా వెళ్లి, పుష్పాలని విగ్రహం యొక్క పాదాలకి కాకుండా తన పాదాలకి తానే సమర్పించుకున్నాడు. పారాయణం, ఆ తర్వాత మధ్యాహ్న హారతి పూర్తి కాగానే, పుష్పాంజలి ఘటించ సమయంలో, తమని ఆశీర్వదించడానికి బాబా ప్రత్యక్షమయ్యారు అని దేవ్ కి అర్థమైంది. బాబా ప్రేమను చూసి అతడు చాలా ఆనందించాడు.