శ్రీ సాయినాధాయ నమః!
నానాసాహెబ్ రాసనే అనే భక్తుని జీవితంలో కొన్ని దుఃఖ ఘటనలు జరిగాయి. ఆ దంపతులకు పుట్టిన ఇద్దరు ఆడ శిశువులు మరియు ఒక మగ శిశువు జబ్బు కారణంగా, పుట్టిన కొన్ని నెలల తర్వాత చనిపోవడం జరిగింది. ఈ ఘటనల వలన నానాసాహెబ్ హతాశుడయ్యాడు. చాలా నిరాశగా ఉదాసీనంగా ఉండసాగాడు. 1926లో, తమకు పుట్టిన మగ శిశువు కొన్ని నెలల తరువాత చనిపోగానే నానాసాహెబ్ యొక్క భార్య సుందర్ బాయి మంగలే యొక్క ఆరోగ్యం క్షీణించసాగింది.. అతడువెంటనే షిరిడి పరిగెత్తుకెళ్లి బాబా యొక్క చరణాలను ఆశ్రయించి తమను కష్టాలనుండి విముక్తి చేయమని ప్రార్థించాడు. బాబా తో, “బాబా నాకు దీర్ఘాయుష్షు గల ఒక పిల్లవాడిని కృపతో అనుగ్రహించండి” అని వేడుకున్నాడు. అదే రోజు రాత్రి నానాఒక స్పష్టమైన స్వప్నం చూశాడు, బాబా స్వప్నంలో దగదగ వెలుగులు చిమ్ముతున్న సూర్యుడిలా ఒక వృత్తంలో దర్శనమిచ్చాడు. బాబా ఒడిలో ఒక చనిపోయిన చిన్న బాలుడు ఉన్నాడు. బాబా నానాతో ఇలా అన్నాడు, “ఎవరి గురించి అయితే నీవు విలపిస్తున్నాఓ ఆ బాలుడు నీకు చాలా ప్రమాదకారి. ఎందుకనగా ఆ బాలుడు మూలా నక్షత్రం లో పుట్టాడు. మూలా నక్షత్రంలో పుట్టిన బాలుడు తన తల్లిదండ్రులకు హాని కారకుడవుతాడు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి నేను ఇతన్ని నీకు దూరంగా తీసుకు వెళ్ళాను. చింతించకు. నేను నీకు ఒక మంచి అందమైన బాలుడు నీ ఇస్తాను”
ఇంటికి వచ్చాక నా ఆ బాలుడి జన్మ వృత్తాంతము తెలిపే జన్మ పత్రము చదవగా, దానిలో కూడా ఆ బాలుడు మూలనక్షత్రంలో పుట్టినట్టు తెలిసింది
బాబా స్వప్నంలోతెలిపినట్టు గానే, స్వప్నం వచ్చిన 15 నెలల తర్వాత అతనికి ఒక అందమైన బాలుడు జన్మించాడు.
బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా నానా కి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. 1957వ సంవత్సరంలో నాన్న చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు అనారోగ్య పీడితులు అయ్యాడు. అలాంటి స్థితిలో కూడా అతడు ప్రతి ఆదివారం జున్నార్ కి సమీపంగా ఉన్న శివ మందిరంలో దర్శించుకోవడానికి వెళ్లేవాడు. ఆ మందిరము పూనా నుంచి 40 మైళ్ళ దూరంలో ఉండేది. ఆ మందిరంలో జానకి దాస్ అదేపేరుగల సాధువు కూడా ఉండేవాడు. నానా ప్రతి సాధువు యొక్క రూపంలో సాయి బాబాను దర్శించుకుని వారికి నమస్కారం చేసేటప్పుడు” భగవాన్ సాయి బాబా యొక్క చరణాలకి నా యొక్క పాద నమస్కారములు” అని మనసులో అనుకునే వాడు.
ఒక ఆదివారం ఎప్పటిలాగే నానా పూజాది కార్యక్రమాల కోసం సాయి మందిరానికి వచ్చి బాబాకు ప్రణామం చేసి, తన నియమిత పూజా విధానం లో నిమగ్నమయ్యాడు. అప్పుడు అతడికి ఒక శివుడి ఫోటోలో దివ్యమైన ప్రకాశం కనిపించింది, ఆ ప్రకాశంలో తన ఇష్టదైవమైన సాయినాధుడు యొక్క దర్శనం అయింది. సాయి నాథుడు దర్శనమిచ్చిన క్షణంలోనే ఎంతో కాలంగా అతను పడుతున్న అనారోగ్య బాధలు తొలగిపోయి అతని ఆరోగ్యము మరియు మానసిక స్థితి మెరుగు పడింది.
జై సాయిరాం.