శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయి భక్తుడైన జ్యోతిద్ర తార్ఖడ్ వేసవి సెలవుల్లో శిరిడికి వచ్చాడు. ఒకనాటి సాయంకాలం బాబా దర్శనార్థం ద్వారకామాయి కి రాగా, బాబా తనని తన వద్ద కూర్చో పెట్టుకున్నాడు. ఆ రోజు చాలా ఉక్కపోతగా ఉండెను. అయినప్పటికీ భక్తులు బాబా దర్శనార్థం అధిక సంఖ్యలో వచ్చారు. అప్పుడే, పళ్ళు అమ్ముకునే ఒక వ్యక్తి గంప లో కర్బూజ పళ్ళను అమ్ముతూ ద్వారకామాయి దగ్గరికి వచ్చాడు. బాబా ఆ పళ్ళను కొని కర్బూజానీ కోసి అక్కడి భక్తులకి పంచాడు. కానీ జ్యోతిద్ర కి మాత్రం ఒక్క ముక్క కూడా ఇవ్వలేదు.
ఆ సమయంలోనే అందమైన దుస్తులను ధరించిన ఒక వ్యక్తి తన ఇద్దరు నౌకర్లుని తీసుకుని ద్వారకామాయి కి వచ్చాడు. ఇతరులు బాబా గురించిచెప్పాగా., తన జబ్బుకి పరిష్కారం కోసం బాబా దగ్గరికి అతను వచ్చి ఉన్నాడు.బాబా కర్బూజా పండు యొక్క ఒక ముక్కను తీసుకుని, తియ్యగా ఉండే ఎర్రని బాగాన్ని వేరుచేసి, దాని ఆకుపచ్చ భాగాన్ని జ్యోతిద్ర మరియు ఆ వ్యక్తికి తినమని ఇచ్చాడు. బాబా ద్వారా, పండు గాక తోలు ని మాత్రమే ఇవ్వబడినదువలన, దీన్ని అవమానంగా తలచి, కోపంతో ఆ వ్యక్తి బాబాతో, “తొక్క తినడానికి నేను ఆవును, మేకను కాదు “అని అహంకారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అప్పుడే బాబా జ్యోతిద్ర వైపు తిరిగి అన్నాడు, “ఓ సోదరా, ఆ మహానుభావుడికి తొక్క తినడం మంచిగా అనిపించలేదు. సరే ఈ తొక్క ఇక నువ్వే తిను. “అనగానే జ్యోతిద్ర గురు ప్రసాదంగా ఆ తొక్క ని వెంటనే తినేసాడు.. మహా ఆశ్చర్యం!! కర్బూజా పండు యొక్క తొక్క అరటి పండు వంటి మృదుత్వం తో, చెరుకు వలే చాలా తీయగా ఉండెను. నిజానికి అతడు తన జీవితంలో ఇంత తీయని తొక్కని తిని ఉండలేదు. బాబా యొక్క విలక్షణమైన ఈ ఈ లీల కి పాత్రుడైన జ్యోతిద్ర తన జీవన కాలం అనగా, తను మరణించే తన 72వ సంవత్సరం దాకా మధుమేహానికి దూరంగా, చాలా ఆరోగ్యంగా జీవించారు.
నిజానికి బాబా మధుమేహాన్ని నివారించడానికి కర్బూజతొక్కనీ మందుగా ఆ మొదటి వ్యక్తికి ఇవ్వబోయాడు. కానీ అతడు అహంకారంతో బాబా చేయబోయే మేలును గ్రహించలేక, అహంకారంతో సాయి ప్రసాదాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు. కానీ, సర్వస్య శరణాగతితో సాయి శరణు పొందిన జ్యోతిద్ర ఆ సాయి ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించాడు. తద్వారా, జీవితాంతం ఆరోగ్యంగా జీవించాడు.
జై సాయిరాం