శ్రీ సాయినాధాయ నమః
ఇమాం భాయ్ చోటే ఖాన్ 1910 లో దర్వేష్ షా అనే పేరు గల ఫకీరు సలహాపై, సాయిబాబా ని దర్శించ డానికి చోటే ఖాన్ షిరిడి ప్రవేశించాడు. అతడు షిరిడి చేరిన సమయంలో బాబా ఒక వీధి లో నిలబడి ఉండగా, ఒక భక్తురాలు బాబా పాదాలకి మొక్కుచుండెను. దర్వేష్ షాహ్ సూచించిన విధంగా చోటే ఖాన్ బాబా వెనుక నించుని ఖురాన్ యొక్క మొదటి అధ్యాయము చదవడం ప్రారంభించాడు. చోటే ఖాన్ “బిస్మిల్లా” అని అనగానే బాబా వెంటనే వెనుతిరిగి చోటే ఖాన్నీ తిడుతూ,” నువ్వు ఎవరు? నన్ను విచారణ చేయడానికి నీవు ఏమన్నా నా నాయనవా? “అని అన్నారు ఈ విధంగా బాబా అతన్ని ఇంకా తీవ్రంగా తిట్టారు.. తర్వాత మసీదులో కి వెళ్లి ఏమో అన్నారు. కానీ చోటే ఖాన్ కి ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అనుమతి లేనిదే మసీదులోకి వెళ్లడం కుదరదు. కాబట్టి చేసేది ఏమీ లేక చోటే ఖాన్ వెళ్లి మస్జిద్ ముందర కూర్చున్నాడు.
రెండు రోజుల వరకు బాబా అతన్ని మసీదులోకి అడుగుపెట్టనివ్వలేదు. కానీ కాక దీక్షిత్ మరియు ఇతర భక్తులు చోటే పక్షమున బాబాతో ఇలా అన్నారు, “బాబా. వీరందరూ నీ పిల్లలే కదా. మరి ఇతని మీద మీరు ఎందుకు కోపంగా ఉన్నారు?. అప్పుడు బాబా, “నీవు ఇతన్ని పిల్లవాడు అంటున్నావు. కానీ ఇతను ఒక మాస్టర్ ని కొట్టి చంపేశాడు.” అని చెప్పాడు. బాబా యొక్క ఈ మాటలు చోటే ఖాన్ కి సంబంధించినదే.
ఖాన్ మామలతదారు కార్యాలయంలో సిపాయి గా పని చేయుచుండెను. పోలీసుల విచారణ కి సహకరించటం లేదని ఒక పాస్టర్ ని చోటే ఖాన్ బాగా కొట్టి గాయపరిచాడు. ఆ పాస్టర్ యొక్క నోటి నుంచి రక్తం కారి అతను సృహతప్పి పడిపోయాడు. అప్పుడు మామలతదారు చోటే కానీ కి, ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చాడు. అందువలన చోటే ఖాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడినుండి వెళ్ళిపోయి దర్వేష్ షా శరణు పొందాడు. అక్కడినుండి దర్వేష్ సలహాపై బాబా సహాయం కొరకు షిరిడి చేరాడు. అతను చేసిన ఈ తప్పు వలన బాబా అతనిపై కోపించి మసీదుకి రానివ్వలేదు. రెండు మూడు రోజుల తర్వాత బడే బాబా కాసిం, జోగు మరియు దీక్షిత్ చోటే ఖాన్ నీ తీసుకుని మసీదులోకి ప్రవేశించగా, అప్పుడు బాబా అతన్ని దర్శనం చేసుకోవడానికి అనుమతినీ ఇచ్చి, “భయపడకు. అల్లా మన యజమాని. నీపై ఎవరు ఏ చర్యలు తీసుకోరు.” అని భరోసా ఇచ్చాడు, బాబా ఆజ్ఞ చే చోటే ఖాన్ సుమారు రెండు నెలలు షిరిడీ లో ఉన్నాడు.
ఒకరోజు బాబా అతనితో, “నీవు ఇప్పుడు సంకోచించకుండా తిరిగి ఇంటికి వెళ్ళాము. ఏమి భయం లేదు. నీ భూమికి సంబంధించిన వివాదం సమస్య కూడా నీ పక్షమున పరిష్కరించ బడుతుంది.” అని ఆశీర్వదించాడు. ఈ విషయం గురించి చోటే ఖాన్ బాబా ని సహాయం అడగాలి అని ముందే అనుకున్నాడు. కానీ బాబా ఆతను ఆ విషయం అడగకుండానే అతనికి తగిన సలహా ఇచ్చాడు. బాబా కృపతో భూమికి సంబంధించిన వివాదంలో ఈతని పక్షమున పరిష్కారం జరిగింది. చోటే ఖాన్ కి బాబా కృపతో తన భూమి తనకు దక్కింది.