కేశవ్ ప్రధాన్ ద్వారా మందిర నిర్మాణం
కాలక్రమంలో అతని ఆర్థిక స్థితి అభివృద్ధి చెందింది. అతడు మాటిమాటికీ షిరిడీ వెళ్ళడం ప్రారంభించారు. వెళ్ళినప్పుడల్లా అతను బాబాతో, తనతోపాటు భీవపురి రమ్మని ప్రార్థించేవాడు. ఇక ఒకరోజు బాబా తాను భీవ్ పురి వస్తాను అని ఒప్పుకున్నాడు. ప్రధాన్ చాలా మొండి స్వభావం కలవాడు. బాబా అలా అన్న తర్వాత, తాను ఎప్పుడు షిరిడి వెళ్ళినా, “బాబా మీరు భీవపురి వస్తానని వాగ్దానం చేశారు కదా మరి ఎప్పుడు వస్తున్నారు? ” అని అడిగేవాడు. అతను బాబాను భీవ్ పురి రమ్మని ఆహ్వానించడం లో బాబా పట్ల అతనికున్న అచంచలమైన భక్తి మరియు ప్రేమలు ప్రకటమయ్యేవి. అప్పుడు బాబా అతడికి తన యొక్క చిత్రాన్ని ఇస్తూ, “దీని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ఉంచుకో. ఈ చిత్రం నాయొక్క ప్రతిరూపమని నమ్ము. ఇక నువ్వు శిరిడీ రావద్దు” అని ఆదేశించారు. ఆ ప్రతిమను తీసుకుని అతను ఇంటికి వచ్చాడు కానీ బాబా మాటలు అతనికి నమ్మకం కలిగించలేదు. అందువలన అతడు మళ్ళీ షిరిడి వెళ్ళాడు. అతడి ద్వారకామాయిలో ప్రవేశించగానే, బాబా, “నేను నీ ఇంట్లోనే ఉన్నాను. ఇంకోసారి షిరిడీ రావద్దు. తిరిగి భీవ్ పూరి వెళ్లి అక్కడ నా మందిరాన్ని నిర్మించుము.మందిరంలో నా ప్రతిమను ప్రతిష్ఠించి అక్కడ అన్ని పండుగలను జరుపుకోవడం ప్రారంభించు. ఇక ఇక్కడికి ఎప్పుడు రావద్దు. షిరిడి నీ గ్రామం లోనే ఉంది “అని అన్నారు. తర్వాత ప్రధాన్ షిరిడీ వెళ్లడం మానివేశాడు.
బాబా ద్వారా కేశవ్ ప్రధాన్ కి ఇవ్వబడిన ప్రతిమ
కొంతకాలం తర్వాత ప్రధాన్ తన ఇంటి సమీపంలో ఒక చిన్న మందిరాన్ని నిర్మించి అందులో బాబా ద్వారా ఇవ్వబడిన ప్రతిమను ప్రతిష్టించాడు. మందిరంలో నియమానుసారంగా, పూజలు అర్చనలు, నైవేద్య నివేదనలు మరియు ఇతర కార్యక్రమాలు జరపడం ఆరంభమైంది

ఒకరోజు అర్థరాత్రి బాబా మందిరం యొక్క ద్వారము తెరిచిన శబ్దం వినిపించింది. ప్రధాన్ మరియు వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి, వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి వారు స్థబ్ధులయ్యారు.. బాబా మందిరంలో ప్రవేశించి తలుపులు మూసివేశారు. రాత్రి మూడు గంటలకి మళ్లీ తలుపు తెరిచి బాబా బయటికి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రధాన్ ఈ విషయాన్ని తన మిత్రులకు బంధువులకు అందరికీ చెప్పాడు. బావబా పలికిన పలుకులు, “నేను భీవ్ పూరిలోని మందిరం లోనే ఉన్నాను”, అనే మాటలు సత్యమైనవి.
బాబా ఈ మందిరాన్ని కేశవరావు ప్రధాన్ ద్వారా నిర్మింప చేయడానికి కొన్ని కారణాలున్నాయి. అతడి యొక్క ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. మాటిమాటికి షిరిడీ యాత్ర తలపెడితే అతడి ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. ఇంటి నుండి కూడా కనీసం మూడు రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకని బాబానే అతని స్వస్థలం అయినా భీవ్ పురికి విచ్చేశారు.
భీవ్ పూరి గ్రామంలో ప్రేతాత్మలు తిరుగుతూ ఉండేవి . వాటి నుండి తన భక్తులను కాపాడటానికి, అలాగే తన ద్వారా ప్రేతాత్మలకు ముక్తిని ఇవ్వడానికి కూడా బాబా భీవ్ పూరి కి వచ్చి ఉండవచ్చు.
జై సాయి రామ్