ఓం శ్రీ సాయినాధాయ నమః
భీవపురి లోని సాయిబాబా మందిరంలో బాబా లీలలు. మొట్టమొదటిి సాయిబాబా మందిరం(భీవ్ పురి )
సాయి భక్తుడు కేశవ్ ప్రధాన్ గారి ద్వారా మొట్టమొదటి సాయి మందిర నిర్మాణం భీవపురి లో బాబా అనుగ్రహంచే నిర్విఘ్నంగా జరిగిందనే విషయం మీకు తెలిసిందే.
ఒకరోజు కేశవ్ మందిరం లో ప్రతిష్టించబడిన బాబా చిత్రం ముందు నించుని, “బాబా, ఇక్కడి నుంచి చాలా దూరంలో నది ఉందని మీకు తెలుసు. మిమ్మల్ని అభిషేకించడానికి నాకు ప్రతిరోజు శుద్ధజలం అవసరం. నేను నీటి కోసం అంతదూరం వెళ్లడం మీకు ఇష్టమా? నీటి వనరులు మందిరం దగ్గరగా ఉండాలని మీకు అనిపించడం లేదా? ఇలా అనుచు అతను మందిర పరిసరానికి దగ్గర లోనే ఒక చిన్న బావిని తవ్వడం ప్రారంభించారు. బాబా అనుగ్రహం వల్ల ఆ బావి నుండి ప్రతిరోజూ ఒక పెద్ద లోటా నిండుగా నీరు అతడికి దొరకసాగింది.
ఒకసారి కేశవ్ ప్రధాన్ జీవితంలో చాలా కఠిన పరిస్థితులు వచ్చాయి. అతని కష్టాలకి అంతం అనేది లేకుండా ఉండేను. అటువంటి సమయంలో బాబా అతడికి సాక్షాత్కరించి, అతడి వీపును తట్టుతు, “నీవు చింతించకు, భయపడకు. నిన్ను రక్షించడానికి నేను ఇక్కడే ఉన్నాను “అని అతడి భయాన్ని పోగొట్టి అభయ ప్రదానం చేశారు. ఏ స్థలంలో అయితే బాబా సాక్షాత్కరించారో, ఆ పవిత్రమైన ప్రదేశాన్ని ఇతరులెవరూ అపవిత్రం చేయొద్దని ఉద్దేశంతో, బాబా సాక్షాత్కరించిన ప్రదేశంలోనే అతను తులసి కోటని నిర్మించాడు.
తులసి కోట
కేశవ్ ప్రధాన్ గ్రామం యొక్క పొలిమేరలో నివసించేవాడు. అతడి ఇంటి బయట ప్రేతాత్మలు తిరుగుతూ ఉండేవి. రాత్రి సమయంలో ఎవరైనా పాదచారి ఆ ప్రాంతం నుండి వెళ్తుంటే, ప్రేతాత్మల ప్రభావం వలన ఆ పాదచారి అదే ప్రదేశంలో గుండ్రంగా తిరుగుతూ ఉండిపోయేవాడు. ఈ సాయి మందిరం కట్టబడిన తర్వాత బాబా కృపచే అక్కడ ప్రేతాత్మల భయము పోయింది.
త్వరలోనే మందిరం మహిమ చుట్టుపక్కల గ్రామాలు మరియు ముంబై వరకు వ్యాపించింది. మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడం వలన మందిరాన్ని విస్తరించాలని ప్లాన్ తయారు చేయబడింది. కానీ తగినంత ధనం లేకపోవడం వలన మందిర విస్తరణలో జాప్యం జరిగింది. ఈ సమస్య పరిష్కారం అవ్వాలని నారాయణ పురోహిత్ అనే భక్తుడు దీక్షతో సాయి సచ్చరిత్ర పారాయణ ఆరంభించాడు. పారాయణ మొదలుపెట్టిన నాలుగవ రోజు, బాబా అతడికి స్వప్నంలో దర్శనమిచ్చి, “ఇక్కడ ధుని లేదు. అలాంటప్పుడు భీవపురి మరో షిరిడి ఎలా అవుతుంది? “అని బాబా పరోక్షంగా, ఆ మందిరంలో ధునిని ప్రారంభించమని సూచించారు. ఈ విధంగా, బాబా ఏదైనా పని చేయమని ఆజ్ఞాపిస్తే, దాన్ని పూర్తి చేసే విధానం కూడా స్వయంగా చెప్తారు. బాబా యొక్క అనుగ్రహం వలన A.RR వాలావర్కర్ ( హేమాడ్ పంత్ మనుమడైన దేవ్ బాబా) గారి కర కమలములచే ధుని ప్రజ్వలింప బడినది.