శ్రీ సాయినాధాయ నమః
ఒంగోలు నుండి వెంకట సౌభాగ్య లక్ష్మి గారు తనకు జరిగిన బాబా లీల ఈ విధంగా వివరిస్తున్నారు.
“నాకు 1983లో కడుపు నొప్పి , పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని. డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గం అని, కానీ ఆపరేషన్ చేసిన నేను బ్రతకడం అనుమానమేనని, ఆపరేషన్‌కు మద్రాసు వెళ్లాలని చెప్పారు.
ఒక రోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అచ్చటి వారు చదువుతున్న బాబాా లీలలు విని వచ్చి బాబా ని ప్రార్ధించు అని నాకు చెప్పాడు. ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వల్ల మాత్రం ఏమవుతుందిలే అని అనుకున్నాను.
ఆరోజు రాత్రి నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు. ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపు పచ్చని చీర కట్టుకొని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి “నీకు ఏమి ఇష్టము” అని అడిగింది. “నాకు పప్పుదినుసులు ఇష్టం” అని చెప్పాను. అందువల్లనే నీకి బాధ అన్నదామె. ఇంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డలు తీసి చూపి “ఇది తొలగించాను .నీకు ఇంకా బాధ ఉండదు .రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది. ఎల్లుండి అన్నం తిను.” అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే, టైం ఐదు గంటలు అయ్యింది. నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగినది.మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కలలో కనిపించి “రేపు చారు అన్నం తిను ” అన్నారు. ఆ రోజు నుండి నాకు మరల నొప్పి రాలేదు. వాంతి కూడా లేదు”
బాబా లీలలు వర్ణించలేము. ఎవరిని బాబా ఎలా అనుగ్రహిస్తారు చెప్పలేము. కొందరికి వారి రోగాలను విభూతి తో నయం చేస్తారు. కొందరికి వారి శరీరంలోని రోగాన్ని చిటికెలో తీసివేసి ఆపరేషన్ అవసరం లేదు అని డాక్టర్లకి ఎలా సమస్య మాయం అయిందో అంతుపట్టకుండా చేసి అందరినీ ఆశ్చర్యంలో మంచి వేస్తారు. కొందరి రోగాలను కలలోనే ఆపరేషన్ చేసి నిర్మూలిస్తారూ.
బాబా లీలలు అగాధము.
సర్వ సమర్థ సాయి శరణం