ఓం శ్రీ సాయినాధాయ నమఃపరమ పూజ్య గురుదేవులకి జన్మ దిన శుభాకాంక్షలు💐💐💐🌈🌈🌈🌈🌈😊😊😊🙏🙏🙏🙏
పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారితో నా అనుభవాలు
అసలు నేను గురువు గారి గురించి చెప్పడానికి కూడా అర్హురాలే కాదు. నేను వారి గొప్పదనం వర్ణించలేని అధమురాలిని. తన శిష్యులను సరిదిద్దడానికి వారు చేపట్టే క్రమశిక్షణ చర్యలు అందరికీ అర్థం కావు. క్రమశిక్షణకు మారుపేరు గురువుగారు. తన శిష్యులు ఏ చిన్న తప్పు చేసిన వెంటనే సరిదిద్దడానికి, వారిని మంచి మార్గంలో పెట్టడానికి, చాలా కఠినంగానే వ్యవహరిస్తారు. సామాన్యులకు వారి తత్వం అర్థం కాక గురువుగారికి దూరమవుతారు. కానీ వారు ఎవరి పట్ల నైనా కటినంగా వ్యవహరించారు అంటే వారు ఏదో పొరపాటు చేసి ఉంటారు అన్నది సత్యం. మనల్ని మనం తరచి చూసుకుంటే అప్పుడు వారు మన పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించారు అనేది అర్థం అవుతుంది.
మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గ్రహించే సర్వాంతర్యామి మన గురువుగారు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎక్కడో ఉన్న గురువు గారికి తెలిసిపోతుంది.
నేను గురుపౌర్ణమి కి శాఖ పురం వెళ్లడానికి కొన్ని రోజుల ముందు, ఉదయం సుమారు 5 గంటల సమయంలో గురువుగారు నా మనోఫలకంపై కనిపించారు. తర్వాత కొన్ని రోజులకు నేను గురు పౌర్ణమి కి ముందురోజు మన ఆశ్రమం శాఖ పురం వెళ్లాను. అక్కడ గురువుగారు కొందరికి దర్శనమిచ్చి మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే నేను అక్కడికి చేరుకున్నాను. నేను కూడా గురువు గారితో మాట్లాడాలని ప్రయత్నించగా, అప్పటికి సాయి సేవకులు ( గురువు గారి వద్ద దీక్ష తీసుకున్న సాయి సేవకులు) మాత్రమే గురువు గారితో మాట్లాడటానికి అనుమతించబడుతుంది అనే నియమం పెట్టారు గురువుగారు. నేను సాయి సేవక్ కానందు వలన గురువు వారి దర్శనం నేను పొందలేక పోయాను . అక్కడి ఆశ్రమ నిర్వాహకురాలు నా తరఫున, “దూరం నుండి మీ దర్శనం కోసం వచ్చారు “అని గురువు గారికి చెప్పినప్పటికీ, “అమెరికా నుండి వచ్చిన వారైనా సరే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరగదు” అని చెప్పేసారు. నాకు అసలు ఏమి అర్థం కాలేదు. ఎందుకంటే. డాబా పై గురు నిలయంలో ఉన్న గురువు గారికి డాబా క్రింద తనను కలవడానికి ఎవరెవరు వేచి ఉన్నారు తనకి చెప్పకుండానే తెలిసిపోతుంది. నేను అంత దూరం నుండి వచ్చానని గురువు గారికి ముందే తెలుసు. అయినా వారు అంత కఠినంగా నాకు దర్శనం ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు అర్థం కాలేదు. ఎందుకంటే వారు కరుణా మూర్తులు. ఎవరి పట్ల పక్షపాతం చూపరు. సాధారణంగా, వారి వద్ద దీక్ష తీసుకోలేని సాయి భక్తులకు కూడా వారు దర్శనమిచ్చి మాట్లాడుతారు.అలాంటిది అక్కడ అందరూ సాయి సేవకులకు దర్శనమిచ్చి నాకు మాత్రం దర్శనం ఇవ్వకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. “ఇప్పుడే వచ్చానుగా. భోజనాలయ్యాక నన్ను దర్శనానికి పిలుస్తారేమో” అని ఆశ పడ్డాను. కానీ అప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాను ఎందుకు గురువుగారిలా నాపై కోపంగా ఉన్నారు అని, కానీ అంతుపట్టలేదు. అంతకు ముందు నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం పెందరాళే లేచి శాఖ పురం కి బయలుదేరాలి. కానీ నేను బద్ధకంతో లేటుగా లేచి లేటుగా మా ఊరి నుండి బయలుదేరాను. అందువలన శాఖ పురం చేరుకునేసరికి రాత్రి 7:00 అయింది. ఆ సాయంత్రం ఐదు గంటలకు అందరికీ దర్శనం ఇచ్చారని తెలిసింది. నేను లేటుగా రావడం వల్ల నా బద్ధకానికి ఇది శిక్ష అని నాకనిపించింది. కానీ ఆ కారణం కూడా కాదు అని తెలిసింది.ఎందుకంటే వారు నాతోపాటు అదే సమయానికి వచ్చిన సాయి సేవకురాలికి దర్శనం ఇచ్చారు మరి..
మరునాడు గురుపౌర్ణమి ఉదయాన కూడా నాకు గురువు గారితో మాట్లాడే అవకాశం దొరకలేదు. అప్పుడు కూడా సాయి సేవకులే గురు నిలయం లోనికి అనుమతించబడ్డారు.. సాధారణ సాయి భక్తులందరికీ గురువుగారు పైనుంచి దర్శనమిచ్చారు.
ఆ రోజటి సత్సంగంలో బోధించిన విషయాల్లో, “ఇంట్లో ఉన్న ముసలి వారిని బాధ పెట్టే పనులు నచ్చని పనులుచేయవద్దు ‘అని ఎవరినో ఉద్దేశించి చెప్తున్నట్టుగా కోపంగా సూచించారు. అది నాకు పెడుతున్న చురకే అని నాకు ఆ క్షణంలోనే అర్థమైంది. ( గురువుగారు సత్సంగాల్లో, చెప్పే మాటలు, సూచించే విషయాలు సత్సంగంలో కూర్చున్న వారికి సంబంధించిన సూచనలు గా ఉంటుంటాయి) అలా, సత్సంగంలో గురువుగారు కోపంగా అన్న మాటలు నాకు నేను చేసిన పొరపాటు ఏంటో గుర్తుకు తెచ్చింది. నేను శాఖ పురం రావడానికి కొన్ని రోజుల ముందు ఒకరోజు ఉదయం , మా ఇంట్లో బోరు వేసి అర్ధగంట కాకుండానే మళ్లీ బోరు ఆన్ చేశాను.. అది మా నాన్నగారు గమనించి చాలా కోప్పడి ఫలితంగా చాలా బీపీ పెంచుకున్నారు, ఆ విధంగా వారు చాలా ఇబ్బంది పడ్డారు. నేను అప్పుడు బాబా, ఇందులో నా తప్పు ఏముంది? అని నాకు నేను సరిపెట్టుకున్నాను.
కానీ ఆరోజు నాగార్జున సాగర్ వద్ద గురువు గారి సత్సంగంలో, “మన ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బాధ కలిగించేలా ఉండొద్దు. ఏ చిన్న విషయం అయినా కానీ, మన ప్రవర్తన ఇతరులని బాధించ రాదు. దాని వలన దోషం వస్తుంది.” అని చెప్పడం వలన నా తప్పేంటో నాకు తెలిసింది. నా తప్పు వలన గురువుగారు నాతో మాట్లాడలేదు అని అర్థమైంది.
మనం అనాలోచితంగా చేసే చిన్న పొరపాట్లు ఎదుటి వారికి ఎంతో బాధను కలిగించవచ్చు. అలాగే మన ప్రతి చిన్న పొరపాటు లేదా తప్పు అయినా గురువుగారికి బాధిస్తుంది. కాబట్టి ప్రతి క్షణము ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇలా గురువుగారు ప్రతిక్షణం మనలను గమనిస్తూ, తప్పు ఉంటే కఠినంగా వ్యవహరించి అయినా మనలను క్రమశిక్షణలో పెడుతూ సరిదిద్దుతారు. మనకు కావాల్సింది గురువుపై విశ్వాసం. ఇది లేక పోయినట్లయితే మనం గురువునే విమర్శించే స్థితికి దిగజారి పోతాము.
గురువుగారి ప్రతిచర్య వెనక ఎంతో అంతరార్థం దాగి ఉంటుంది. మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు మారు మన పై చూపే అనుగ్రహం అంతులేనిది. వారి ప్రేమ సాటిరానిది.
Reblogged this on Sai Sannidhi and commented:
పరమ పూజ్య గురుదేవులకి జన్మదిన శుభాకాంక్షలు💐💐🌈🌈🌈🙏🙏🙏🙏..జయము జయము జయము మీకు గురుదేవా🙏🙏🙏
LikeLike