ఓం శ్రీ సాయినాధాయ నమః
ఒకప్పుడు మరికొంతమంది తో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు వ్రాసుకున్న అప్పీలు చూచి దీక్షిత్ మొదలైన వారు, “కేసు చాలా బలంగా ఉన్నదని లాభం లేదని ” చెప్పారు. అప్పుడు సాయి అతనిని ధూమలు వద్దకు పంపారు నిజానికి ఎట్టి ఆశా లేకున్నా, కేవలం సాయి ఆజ్ఞప్రకారం మాత్రమే ధూమల్ అహ్మద్‌నగర్ మెజిస్ట్రేట్ తో మాట్లాడారు.
నాటి రాత్రి వారికి కలలో సాయి కనబడి, ” రేపు మీరంతా విడుదలవుతారు. ఏడవకండి” అని చెప్పారు. ఆశ్చర్యం! కింది కోర్టు లోని రికార్డు చూపించకుండానే, కోర్టులో అప్పీలు గాని విచారణ గాని అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం. రఘు రూ 300 ఫీజుగా ధూమ్ ల్ కి చెల్లించాడు. వెంటనే ధూమల్ షిరిడి వెళ్ళాడు. .సాయి ఆ పైక మంతా దక్షిణగా తీసేసుకుని, “రఘు విడుదలైంది కేవలం తమ కృప వలననే “అని సూచించారు. అలానే సాయి అతనికి ఒకసారి 50 దక్షిణ అడిగారు. అతని వద్ద పైకం లేదంటే సాటే నడిగి తెమ్మన్నారు.. అంతకుముందు సాటే తన పెన్షన్ రూ 50 పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాటే సంతోషంగా 50 ఇచ్చాడు. ఆ రోజు నే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది.