ఓం శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి తమను నమ్మిన వారిని వెంటనే ఉండి కాపాడుతారు. 1914లో శివరాత్రి ముందురోజున హార్ది లో మెజిస్ట్రేట్ గా పనిచేసిన చోటు భయ్యా తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు. వాళ్లు నేనేవార్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బులు ఇస్తామన్నా బెస్త వాళ్ల పడవేయ మన్నారూ . దిక్కు తోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తూ ఉంటే తలగుడ్డ గల ఫకీరు వీరి వద్దకు వచ్చి “ఆడవాళ్లను తీసుకుని ఇంత పొద్దుపోయి వచ్చా రేమి? పడవ యజమాని వచ్చిఅయినా మిమ్మల్ని నది దాటించాలి “అని చెప్పి పది అడుగులు వెళ్లి కనిపించలేదు. ఇంతలో పడవ వారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే “ఇచ్చినంత ఇవ్వండి. లేకుంటే ఏమీ ఇవ్వకండి “అన్నారు. ఆ కుటుంబం శిరిడీ చేరాక ,జరిగినదంతా తమ లీల అని సాయి సూచించారు.
సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరాన్ని దాటించే తమ చెంతకు చేర్చుకుంటారు.