ఓం శ్రీ సాయినాథాయ నమః
గుంటూరులో సాయి భక్తులు శ్రీనివాసరావు, పుష్పావతి దంపతులకు వివాహం జరిగి 4సంవత్సరాలు అయినా పిల్లలు కలగక పోగా వారు ఎంతో బాధ పడేవారు. వారు నమ్ముకున్న దేవుడు సాయినాధుడికి ప్రతి రోజు తమకు సంతాన భాగ్యం ప్రసాదించమని వారు వేడుకునే వారు.
వారి బాధ చూడలేక బాబా వారిని అనుగ్రహించారు. కర్మ ఫలాన్ని తొలగించే సర్వ సమర్ధుడు మన సాయిదేవుడు ఒకనాడు పుష్పావతి గారి కలలో కనిపించి, బాధ పడకు,నీకు పుత్రుడు జన్మిస్తాడు అని ఆశీర్వదిస్తాడు. బాబా వారి ఆశీర్వాదముగా ఆమె కొద్ది కాలానికే గర్భం దాల్చి మగ బిడ్డ ని ప్రసవించింది.. బాబా పట్ల కృతఙ్ఞత గా ఆ బాబుకి సాయి కృష్ణ అని పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు..
జై సాయిరాం
సేకరణ :సాయి కృష్ణ