ఓం సాయినాథాయ నమః

సాయిరాం 🙏
ఆందోళన తో కృంగిన తన భక్తులని ఊరడించడానికి సాయి తన ఉనికిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటాడు అనేదానికి నిదర్శనం నిన్న రాత్రి నాకు జరిగిన అనుభవం.
ఈ మధ్య సాయి దయ తో పెండింగ్ లో వున్న ఇల్లు నిర్మాణం మళ్ళీ మొదలయ్యినా, నిర్మాణ క్రమం లో మళ్ళీ ఎన్నో టెన్షన్స్ మొదలయ్యాయి..అన్నీ రెడీ చేసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, పనివారి తో విపరీతమయిన టెన్షన్స్, ఇంకా కొన్ని సమస్యలు ఇవన్నీ మనసు ని చాలా ఆందోళన, కృంగుబాటు కి గురి చేస్తోన్నాయి. ఫలితంగా దాదాపు రోజు, ఛాతి నొప్పి తో బాధ పడటం జరుగుతోంది… అలా నిన్న రాత్రి బాధ పడుతూ మంచం మీద పడుకుని బాబా ని తలచుకుంటున్నాను. “బాబా, నాకు ఓదార్పు నివ్వు, నా మనసు చాలా కృంగిపోతోంది, నాకు తట్టుకునే శక్తి లేదు. నాకు నీ ప్రేమ ని పంచి, నా డిప్రెషన్ ని దూరం చేయు తండ్రి. నాకు నీ ప్రేమ కావాలి ” అని వేడుకుంటున్నాను. అలా నన్ను నేను చిన్న పాప గా ద్వారకామాయి లో సాయి ఒడిలో పడుకొని ఉన్నట్టు, సాయి నన్ను లాలిస్తున్నట్లు వూహించుకున్నాను. అంతలో head phones పెట్టుకుని(night head phones పెట్టుకుని youtube చూడటం అలవాటు ) whatsapp on చేసి images చూస్తూ వున్నపుడు, sudden గా మొబైల్ లో ఒక హిందీ సాయి పాట on అయ్యి వినిపిస్తోంది..”పరమ పితా, సాయి, ప్రేమ సాగరా.. ” అని..నాకు ఒక్కసారిగా, ఆశ్చర్యానందం తో ఒళ్ళు జలదరించింది.. బాధ లో ఉండి, ఊరట ని ఆశిస్తున్న మనసుకు నా ఆవేదన కి సరిపడే ఓదార్పు నిస్తూ ఆ పాట నా చెవుల్లో head phones ద్వారా వినపడుతోంటే, నేను ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.. తేరుకున్నాక, అసలు ఆ పాట నా మొబైలులో ఎలా play అయిందో అర్థం కాలేదు. నేను whatsup images folder open చేసి images చూస్తుంటే play అయింది song. screen పై images కి సంబంధించిన folders మాత్రమే వున్నాయి. Audio folder screen పై లేదు. మరి పొరపాటున audio click అయ్యే అవకాశం లేదు. సరే, ఆ పాట మొబైలు లో ఏ folder లో నయినా ఉండొచ్చు. ఆ పాట మొబైలులో ఎక్కడ ఉందొ అని అన్ని folders వెతకగా, music player folder లో ఎప్పుడో ఒక భక్తుడు పంపిన సాయి పాట అది అని అర్థం అయ్యింది.. కానీ, whatsapp images చూస్తున్న నాకు మొబైలు files లో నుండి, నా ఆవేదన కి ఖచ్చితం గా సరిపోయిన పాట ఎలా play అయ్యిందో ఇంతకీ అర్ధం కాలేదు. నా బాధ ని గమనించి బాబా, నన్ను ఓదార్చడానికి ఈ పాట నా మొబైల్ లో ఆటోమేటిక్ గా ఆన్ చేసి వినిపించాడు అని భావిస్తున్నాను. సాయి ప్రేమ, ప్రేమ రాహిత్యం తో బాధ పడేవారికి సంజీవిని లాంటిది.🙏🙏.
మీరు కూడా వినండి 😊
ఓం సాయిరాం 🙏
చాలా బాగుంది.నువ్వు రాయడం కూడా చాలా బాగుంది.బాబావారు సదా నీకు,తోడు నీడగా ఉండాలని,ఆ సాయి నాదుడిని ప్రార్ధిస్తాను.ఓం సాయి రాం.
LikeLike
Thank you madhavi ji 🙏
LikeLike