శ్రీసాయిరాం 🙏

సాయి తన దరికి నన్ను చేర్చుకోవడానికి పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబాశివరావు గారిని పరిచయం చేసారో, లేదా పూజ్య గురుదేవులే వారి రుణానుబంధం వలన మాకు పరిచయం అయ్యి, మమ్మల్ని ఆ సాయిదేవుడి దరికి చేర్చారో తెలియదు కానీ, ఆధ్యాత్మిక ప్రపంచపు గొప్ప గొప్ప విషయాలు పూజ్య గురుదేవుల ద్వారా సాయి మాకు అందచేస్తున్నారు..
గురువుగారు తరచూ సత్సంగ ప్రసంగాలు చేస్తూ, మా ఆధ్యాత్మిక సందేహాల ని నివృత్తి చేస్తూ, భౌతిక సంసార జీవితం లో ఎలా వ్యవహారించాలి, సాయి పట్ల నిజ భక్తి ని ఎలా సాధించాలో తెలుపుతూ , ఆధ్యాత్మిక సాధన విషయాల్లో తగు సూచనలతో తమ సత్సంగాలు సాగిస్తుంటారు.
అయితే ప్రస్తుత కరోనా సమయంలో, ప్రత్యక్ష ప్రసంగాలు కాకుండా,you tube లో live గా తమ దివ్య ప్రసంగాలు మాకు చేరవేస్తున్నారు.. ఎపుడు గురుగారి సత్సంగం వున్నా, చాలా ఆసక్తి గా వింటూ వుంటాను.. వారి సత్సంగం వింటుంటే, మనసు లో శాంతి ఉదయస్తుంది. మనసు లో సాయి భక్తి పురివిప్పి, మంచి వైపు మనసు మళ్ళుతుంది. సత్సంగం లో చెప్పబడిన అంశాలు మన ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకీ సరి అయిన సమాధానం గా అనిపించి మనసు సమాధాన పడుతుంది.
గురుగారు Youtube ద్వారా live సత్సంగాలు ప్రారంభించాక, సత్సంగం youtube link open చేసి విన్నాను. అయితే ఒక సత్సంగం విన్న తరువాత, ఈ మధ్య గురుగారి సత్సంగం లో ఎపుడూ వచ్చే విషయాలే వస్తున్నాయి అనే ఆలోచన వచ్చింది.. వినడం పై ఆసక్తి కొద్దిగా కోల్పోయాను. ఎపుడైయితే వినాలనే ఆసక్తి కోల్పోయానో, తరువాతి రెండు live ప్రసంగాలు వినడం అనుకోకుండా నేను మిస్ అయ్యాను. గురుగారి ఆ రెండు సత్సంగాల links నాకు లభించలేదు. ఇలా రెండూ కూడా మిస్ అయ్యానో, అపుడు బాధ మొదలయ్యింది. “అయ్యో, బాబా,గురుగారి రెండు సత్సంగాలు వినడం మిస్ అయ్యాను. ఇది గురు గారి సత్సంగాల పట్ల మనసులో ఏర్పడిన ఆశ్రద్ధ కీ పరిణామము!” అని మనస్ఫూర్తి గా అనుకున్న.. గురుగారు నా మొర ఆలకించారు.తరువాతి ప్రసంగం, పులివెందుల లో గురుగారి దివ్య సత్సంగం యొక్క links ఈసారి నలుగురు పంపారు ముందుగానే.. ఆ విధం గా గురుకృప తో ఈసారి గురు బోధ వినగాలిగాను.
అది కూడా ఎలా అంటే, గురుగారి live sathsung 6.30 కీ వుంది. నేను 6 am కీ కూడా ఇంకా నిద్ర లో వున్నా.(అలారమ్ చూసా కానీ నేను డిప్రెషన్ కీ మందులు వాడుతుండటం వల్ల నిద్ర మత్తు ఉండి లేవలేక పోయా ) అంత లో కల.. గురుగారు ఏదో మైదానం ప్రాంగణం లో నడుస్తూ వెళ్తున్నారు. నేను వెళ్లి పాద నమస్కారం చేసుకున్నాను.. తల పైన గురు గారు చేతి పెట్టి తల పై గట్టిగాఅదుముతున్నారు. అయితే ఇది కల అయితే,వాస్తవం లో కూడా తల పైన ఒత్తిడి అనిపించింది.దీనితో ఇక లేచి link on చేసి గురుగారి sathsung వినగలిగాను.
“గురుగారికి మన మనసులోని ప్రతి ఆలోచన, మన ప్రతి కదలిక అవగతమే.. గురువు పట్ల మన భావాలకీ తగినట్లు వారి కృప ఉంటుంది. పవిత్రత, క్రమశిక్షణ, గురు బోధలని ఆచరించే శిష్యుల పట్ల గురు ప్రేమ ఎల్లలు లేకుండా ప్రవహిస్తుంది.. గురు ప్రేమ, సాయి దేవుని ప్రేమ దొరకడం అదృష్టం.. నన్ను సాయిమార్గం లో, సాయి సేవలో నడిపించమని గురు చరణ కమలములకి భక్తి తో నా ప్రణామములు సమర్పించుకుంటున్నాను 🙏🙏”