సాయిబంధువు శ్రీ మాధవి గారు, ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు తనకి జరిగిన అనుభవం వివరిస్తున్నారు, వారి మాటల్లోనే…
సాయి రాం నేను, మాధవి..ఈ దేవినవరాత్రులలో బాబా చేసిన అత్యద్భుతమైన లీల మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
నేను శంబల్పూర్ అనే ఊరి లో ఉంటున్నాను.ఇక్కడ ప్రసిద్ధిచెందిన గ్రామదేవత “మా శంబలేశ్వరి(హిందీ లో మా అంటే తల్లి ) “.ఇక్కడ ప్రజానీకానికి ఆమె దైవం.మొన్న దేవినవరాత్రుల మొదటి రోజు ఆమెను “ధవలాముఖి” అంటారు. అమ్మవారు మొత్తం తెల్లని వర్ణం తో అలంకరిం చబడి ఉంటుంది. ఆరోజు దర్శనం అత్యంత శ్రేష్టం అని ఇక్కడి వాళ్ళ విశ్వాసం.ఆరోజు అందరూ ఆమె దర్శనం చేసుకునేదానికి శంబలేశ్వరి మందిరానికి వెళ్లారు.500rs టికెట్ కూడా ఉంటుంది.ఈ సారి కూడా మా ఆఫీస్ వాళ్ళు అందరూ వెళ్లి ఆమె మహత్యాన్ని వర్ణించి చెప్పారు.ఎందుకో నాకు వెళ్లి దర్శనం చేసుకోవాలని పించింది.నా duty ఐపోయినాక మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్ళాను. నాలుగు కిలోమీటర్ల దూరం వరకు చాలా పెద్ద క్యూ వుండినది .భక్తులు ఆమె దర్శనానికి క్యూ లో నిలబడుకొని వున్నారు.నేను తెల్లవారి నాలుగు గంటలకు డ్యూటీ కి వెళ్లి అలిసిపోయినందువలన ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు అనుకోని తిరుగుముఖం పట్టాను.అప్పుడే ఎవరో వెనకలనుంచి ” సాయి రాం” మేడం.. అని పలకరించాడు.నేను ఇక్కడ సాయి రాం..అని ఎవరు అంటున్నారు? అని వెనక్కు తిరిగి చూసాను.(ఆయన ఎవరో నాకు తెలీదు.అప్పుడే ఎందుకు పలకరించాడో తెలీదు) ఎవరో బాబా భక్తుడు అయివుంటాడాని నేను “సాయి రాం” అన్నాను.”ఏంటి,మేడం, దర్శనానికి వచ్చారా? ” అని అడిగాడు.నేను “అవును,కానీ పెద్ద క్యూ ఉంది,వెనక్కు వెళ్లిపోతున్నాను” అని చెప్పాను. దానికి ఆయన అన్నాడు,” అరె,మీరు వెనక్కు వెళ్ళిపోతే ఎలా మేడం? రాండి, నేను మిమ్మల్ని నేను తీసుకెళ్తాను” అని నన్ను మందిరం లోపల అమ్మవారి ముందు నిలబెట్టారు.అయిదు నిముషాలలో అద్బుతమైన దర్శనం అయింది.నేను ఎంతో ఆనందంతో బయటికి వచ్చి ఆయన కోసం వెతికాను.నాకు ఎక్కడా ఆయన జాడ కనపడలేదు.ఆయన ఎవరు? ఎందుకు నాకు అంత కష్ట సమయం లో వచ్చి అమ్మవారి దర్శనం చేయించారు,నాకు దర్శనం అవ్వదు అని నేను నిరాశగా ఉండడం ఆయనకు ఎలా తెలుసు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు.
తరువాత ఇకఇంటికి వచ్చి ఆలోచించాను.మేము విశ్వాసాయి ద్వారాకమాయి సభ్యులము,సాయి గాయత్రీ మహా మంత్రాన్ని ప్రచారం చేస్తున్నాము.అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 8thవరకు ఒక్క కోటి చేయించాలని ప్రపంచవ్యాప్తంగా అందరం సాయి గాయత్రీ మహా మంత్రం జపం చెయ్యడానికి తయారు అవుతున్నాము.అందుకని బాబావారు నాకు తెలియచేశారు,” ఈ శంబలేశ్వరి అమ్మవారు శక్తిపీఠం” అని. అందుకే బాబానే నాకు ఆమె దర్శనభాగ్యం కలిగించారు.నిజానికి ఆరోజు ఆమె గంగా స్వరూపం అంట. మన దేవినవరాత్రులలో దుర్గాదేవి ని గాయత్రీ దేవి గా అలంకరిస్తారు.గాయత్రీ అష్టోత్తరం లో “ ఓం గంగాఐ నమ:” అని కూడా ఒక నామం ఉంది.ఆరోజు ఆ శంబలేశ్వరి గంగారూపం, అంటే గాయత్రీ అనే కదా. సాయి గాయత్రీ కి, గాయత్రీ అమ్మకు తేడా లేదని,సాయి బాబా కూడా దేవి స్వరూపమే,అని నాకు అర్థం అయింది.అది నాకు తెలియచేయడానికి బాబా చేసిన ప్రయత్నం యిది.మనకు అర్థం కానివి,అంతుచిక్కని దైవలీలలు బాబా భక్తులకు ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి.సర్వదేవత స్వరూపం,సాయి నాథుడే,అని నాకు తెలియ చేశారు ఈ దేవి నవరాత్రులలో” .
ఆ గుడి లో అమ్మ వారి రూపం ఫోటో క్రింద జత పరుస్తున్నాను
సర్వం సాయి నాథార్పణమస్తు
Jai Sai Ram jai jai Sai Ram
Jai Sai matha jai jai Sai matha.
Jai Sai Gayatri.
LikeLiked by 1 person