సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

లీలా మానుష రూపా సాయిదేవా!(ఫ్యాన్ పనిచేస్తుంది సాయి ఆజ్ఞ తో )

ఓం శ్రీ సాయి నాధాయ నమః 🙏

కొంత కాలం వ్యవధి తరువాత ఇటీవల నాకు జరిగిన సాయి లీలతో మరోసారి మీ ముందుకు వస్తున్నాను.
నేను నా వృత్తి రీత్యా మా సొంత పట్టణం నుండి ప్రతి రోజు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నందున,నేను పనిచేస్తున్న పాఠశాల గల గ్రామానికి ఈ మధ్యనే shift అయ్యాను. వెతగ్గా వెతగ్గా ఒక పాత ఇల్లు అద్దె కి దొరకడం జరిగింది. ఇంట్లో స్విచ్ బోర్డ్స్ కానీ fans కానీ పాతవి అలాగే ఉంచడం జరిగింది.అయితే ఈరోజు మధ్యాహ్నం నుండి ఫ్యాన్ తిరగడం లేదు.సరేలే అని రిలాక్సయ్యి మొబైల్ చూస్తుంటే బాబా పై చాలా వక్ర బుద్ది తో కొందరు పెట్టిన negative video నా కంటపడి చాలా బాధ అనిపించింది.. “ఈ మూర్ఖు లకి బాబా సర్వ వ్యాపకత్వం, బాబా యొక్క అవ్యాజ్యమైన ప్రేమ తెలియదు. బాబా,దేవాధి దేవుడవైయిన నిన్ను కూడా వదలటం లేదు ఈ కలి మాయ, ఈ దుష్ట లోకం!!”అని బాధ పడ్డాను..వెంటనే ఒక ఆలోచన వచ్చి అదే బాధ తో బాబా ఫోటో ముందుకు వెళ్లి “బాబా నీ మహిమ తెలిపే మరొక లీల ఇపుడు నాకు చూయించు, యిపుడు ఈ ఫ్యాన్ అప్పటినుండి ఎంత ప్రయత్నం చేసినా తిరగటం లేదు కదా, నేను నిన్ను ఇపుడు ప్రార్థిస్తున్నాను తండ్రీ, నీ మహిమ తో ఈ ఫ్యాన్ ఇపుడు తిరిగేలా చెయ్యు. ఇపుడే నేను “మన ద్వారకామాయి” గ్రూపులో టైపు చేసి నీ లీల పంచుకుంటాను.కలియుగ దైవం, సర్వ శక్తిమంతం అయిన నీ లీల లు ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఇక్కడే వున్నావు, అందరి చుట్టూ నీ సర్వ వ్యాపక శక్తి విరాజిల్లుతోంది,పెద్ద పెద్ద సమస్య లే కాదు,ఏ చిన్న విషయం కూడా నీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటే నీ ప్రతిస్పందన వెంటనే నిజభక్తులకి అనుభవమౌతుంది” అని మరో మారు నిరూపించు బాబా అని మొక్కుకున్నాను.సాయి తన లీల చూయించి ఖచ్చితంగా ఫ్యాన్ తిరిగేలా చేస్తాడు అని నాకు తెలుసు, కాబట్టి స్విచ్ వేసినపుడు ఫ్యాన్ తిరగని ప్రాబ్లెమ్ ని ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నాను. ఆ తరువాత బాబా లీల తో ఫ్యాన్ తిరిగేది వీడియో తీసి పెడితే అందరికి బాబా లీల స్పష్టంగా అర్థం అవుతుంది అని అనుకున్నాను..
అలా బాబా ని ప్రార్థించి స్విచ్ వేస్తె ఆశ్చర్యం!!లీల చూపమనే నా విన్నాపాన్ని బాబా అంగీకరించారు.!!.మధ్యాహ్నం నుండి ఎంత ప్రయత్నించినా తిరగని ఫ్యాన్ బాబా లీల తో తిరిగింది.. నాకు కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి అండీ.బాబా ఇంత త్వరగా, పిలిచిన పలికే దైవం గా తను ప్రకటితం అయిన నుండి తన భక్తులని కాపాడుతూ, డాక్టర్లకి కూడా అంతు పట్టని ఎన్నో రోగాలని కనుచూపుతో పోగొడుతూ, అనుక్షణం మనల్ని గమనిస్తూ, తప్పు దారిన పడకుండా జ్ఞాన బోధ చేస్తూ, సమాధి చెందిన తరువాత కూడా “నేనున్నాను, నా సమాధి నుండే నేను మీతో మాట్లాడుతున్నాను. నన్ను ఎపుడూ తలిచినా, నేను వెంటనే అక్కడుండేదను ” అని అత్యంత ప్రేమ తో పలికే ఈ సాయి తత్వానికి మించిన దైవం లేరు.స్వయంగా ఇతర దేముళ్ళు, దేవత లు కూడా తమ భక్తులని “ఇహ లోక సంబంధామయిన లబ్ది మాత్రమే కాకుండా అత్యంత శ్రేష్టం అయిన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అలవోకగా బోధించగల సర్వ సమర్ధ సద్గురువు అయిన సాయి నాధుని దగ్గరికి తమ భక్తులని పంపిస్తున్నారు అంటే మనం సాయినాధుని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.. అందుకు ఉదాహరణ మా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు.. వీరు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కి పరమ భక్తులు.స్వామి వీరికి కల లొ కనిపించి సాయినాధుడిని పూజించుకోమ్మని సందేశం ఇచ్చారు.ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు అలా సాయి నాధుని దగ్గరికి పంపబడుతున్నారు.అందుకే “సాయి ని మించిన దైవం లేడోయి ” అంటారు సాయి భక్తులు 🙏🙏..
(దయచేసి ఈ లీలని మీకు తెలిసిన వారికి, మరియు గ్రూపుల్లో పంపగలరు.సాయి నాధునికి ప్రచారం అవసరమా అని మీరు అనుకోవద్దు.ఇపుడున్న కలుషిత సమాజం లొ సాయి లాంటి దేవుడిని కూడా నిందిస్తు videos పెడుతున్నారు కొందరు.ఈ పరిస్థితి లొ ఇపుడిపుడే సాయి మార్గం లోకి వచ్చినవారు కూడా సంధిగ్ధం లొ పడి బాబా పై నమ్మకం కోల్పోయే ప్రమాదం వుంది.సాయి లీలలని మనం ఎంత ప్రచారం చేస్తే అంత గా మనం సాయి తత్వాన్ని సమాజం లొ నిలపగలుగుతాము..ఈ సాయి సేవ లొ మనం అందరం పాల్గొందాము. జై సాయిరాం 🙏)

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close