సాయినాథాయ నమః
సాయి బంధువులందరికీ మొహర్రం శుభాకాంక్షలు.
సాయినాథుడి ఆజ్ఞ లేనిదే ఒక ఆకు అయినా కదలదు. అనే దానికి నిదర్శనం గా బాబా చూపిన లీలా మీతో పంచుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో చిన్న సాయి మందిరాన్ని నిర్మించుకుంటున్నాము అన్న సంగతి మీకు తెలిసినదే. ఏమి కర్మఫలము ఏమోకానీ ప్రారంభం నుంచి ఎన్నో అవాంతరాలు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి.”నేను సాక్షి భూతుడు మాత్రమే. చేయువాడు చేయించేవాడు ఆ భగవంతుడే” అని సాయి అన్నారు కదా. కర్మఫలం అనుభవించక తప్పదు. ఆ కర్మఫలం శేషం అయ్యేదాకా సాయి కూడా సాక్షి భూతుడు గానే చూస్తూ ఉంటాడు. పాపం సాయి ఏమి చేయగలడు. కర్మఫలం కోరల్లో మనం చిక్కుకున్నప్పుడు సాయితన భక్తుల ని కాపాడడానికి ఎన్నో విధాల ప్రయత్నిస్తుంటాడు. కానీ కర్మ బలీయమైనప్పుడు కొంతయినా ఆ కర్మఫలం అనుభవించక తప్పదు.
ఇక్కడ బాబా నాకు ఎన్నో విషయాలను నేర్పుతున్నాడు. నిర్మాణం విషయంలో బాబా అనుగ్రహం మీద, శక్తి మీద ఆధారపడి స్వయంగా ఒక మేస్త్రీ ని పెట్టుకుని మందిరం నిర్మాణం చేయించుకోవాలా ,లేక నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా కాబట్టి బిల్డర్ కి అప్పజెప్పి నిశ్చింతగా ఉండాలా అని బాబా కి చిట్స్ వేయడం జరిగింది. బిల్డర్ కి ఇవ్వమని చిట్స్ ద్వారా సందేశం వచ్చింది. అలాగే బిల్డర్ మీద నమ్మకంతో ఉండమని కూడా చిట్స్ లో వచ్చింది. తీరా చూస్తే,మెటీరియల్ నాణ్యతని ప్రశ్నించినందుకు బిల్డర్ పని మధ్యలోనే ఆపేశాడు. చిట్స్ లో వచ్చిన దాన్ని గుడ్డిగా నమ్మి అక్కడ పొరపాటు చేశాను. మొదట్లోనే అనుమానం వచ్చి, నా బుద్ధి బిల్డర్ ని నమ్మవద్దు అని చెప్పినా, చిట్స్ మీద ఆధారపడడం తప్పని బాబా అనుభవపూర్వకంగా బోధించాడు. అలా ఎవరిని కూడా ముఖ్యంగా ధనం విషయంలో నమ్మవద్దని తెలిపాడు.నా జీవితాన్ని తరచి చూస్తే, బాబా చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని నాకు ఇలా అనుభవ పూర్వకంగానే బోధిస్తూ వస్తున్నాడు..
అలా రెండు నెలలు నిర్మాణం పనులు ఆగిపోయాయి, ఒక వారం క్రిందటి నుండే మరలా ఒక మేస్త్రీ ద్వారా బాబా పని ప్రారంభం చేశాడు. మరి బాబాకి తన భక్తులని ఆదుకొనకతప్పుతుందా .
నిజాయితీగా లేనందువలనఆ బిల్డర్ పెట్టిన వాచ్ మెన్ ని తీసివేసి కొత్త వాచ్ మెన్ ని కూడా పెట్టుకున్నాను. 3 రోజుల క్రితం పాత వాచ్ మెన్ ఏదో ఒక మిషతో కన్స్ట్రక్షన్ మెటీరియల్ భద్రపరిచిన గదిలోకి వెళ్లడం గమనించాను. మేమంతా ఇంటికి వెళ్లాక, అక్కడి మెటీరియల్ భద్రత విషయంలో భయం మొదలై బాబా ని మెటీరియల్ భద్రంగా ఉంచుమని ప్రార్థించాను. బాబా నా మొర ఆలకించాడు. బాబా ప్రేరణతో కొత్త వాచ్ మెన్ తో మాట్లాడి, అంత బాగా ఉందా కనుక్కుందామని ఒక వ్యక్తిని వాచ్ మెన్ తో ఫోన్లో నాకు మాట్లాడించుమని ప్లాట్ దగ్గరికి పంపాను. బాబా అనుగ్రహం చూడండి. నేను పంపిన వ్యక్తి వెంచర్ ఎంట్రెన్స్ దగ్గరికి వస్తుండగా, ఈ కొత్త వాచ్మెన్ స్టీల్ మెటీరియల్ తీసుకొని వెళ్తూ అతనికి ఎదురయ్యాడు అట. ఆ వ్యక్తి వాచ్ మెన్ నీ ఎక్కడికి అని అడగగా ఏదో చెపుతున్నాడట. ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తీరా చూస్తే ఈ కొత్త వాచ్మెన్ దొంగతనానికి ప్రయత్నించారని తెలిసింది. పక్కవారిని కనుక్కుంటే అంతకు ముందు కూడారెండు మూడు సార్లు దొంగతనం చేశాడని తెలిసింది. ఈ విషయం ఈ విధంగా నడపడం వల్ల, బాబా నాకు దొంగని పట్టించడం తో పాటు నాకు జరిగిన నష్టాన్ని అతనికి ఇవ్వవలసిన జీతంలో నుంచి మినహాయించేలా చేశాడు. లేకపోతే, ఆ రోజు అతనికి జీతం ఇవ్వాల్సిన రోజు కాబట్టి మొత్తం జీతం ఇచ్చేసి ఉండేదాన్ని.. అలా బాబా నిర్మాణం మెటీరియల్ని నా వెంచర్ దాటకుండా అడ్డుకున్నాడు. సాయినాథ శరణం శరణం.