ఓం శ్రీ సాయినాథాయ నమః
నా మనసులో ని ఆవేదన మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను సమాజం లోఈ మధ్య వింటున్న , చూస్తున్న ఒక అంశం నన్ను చాలా కలవరపెడుతోంది . ఎటు చూసినా అన్యాయాలు, మోసాలు. అందర్నీ గుడ్డిగా నమ్మి చివరికి మోసపోయి కుమిలిపోయేవారు ఏ రంగం లో నయినా మనకి కనిపిస్తున్నారు. దీని గూర్చి మనతో పాటు మన తోటి వారిని చయితన్య పర్చడం మనందరి బాధ్యత.ముఖ్యంగా అమ్మాయిలను ప్రేమ అభిమానం అంటూ వారి మనసుని ప్రేమ ఉన్నట్లు నటించి మోసగించే ప్రబుద్ధులు వున్నారు. వారి వల్ల విలువయిన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు అమ్మాయిలు ,వారి జీవితమే ఒక ప్రశ్న గా మారినవారున్నారు .నూటికి ఏ ఒక్కరో నిజాయితీ గా వుండే ఈ కలికాలం లో ఎవరినయినా నమ్మే ముందు మొదట మన అంతరాత్మ చెప్తున్న మొదటి హెచ్చ్చరిక ని వినే ప్రయత్నం చేయాలి, ఆ తర్వాత కూడా సాయి మనకి ఎన్నో సంకేతాలు ఇస్తుంటారు. ఎవరి ద్వారా నో , నువ్వు యిది తప్పు చేస్తున్నావు అనవసరముగా ఎదుటివారిని నమ్మి ,అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మాయ ఆకర్షణ ల వల లో పడిన వారికి ఆ మాటలు వినిపించవు. ఎదుటివారి కపట ప్రేమ నిజం గా తోస్తుంది. చివరికి వారి అసలు రంగు బయట పడ్డాక తాము ఎంత మోస పోయామో తెలుసుకుని కుమిలి పోవడం తప్ప చేసేది ఏమి ఉండదు, పైగా భగవంతుడి కి దూరం అవుతారు. అందుకే ఎవరినయినా నమ్మే ముందు సమర్థ సద్గురు అయినా సాయినాథుని సలహా అడగండి. సొంత నిర్ణయాలు వద్దు. ఆధ్యాత్మిక రంగం లో మోసాలు లేవు అనుకోవటం పొరపాటు.పథ నిర్ధేశకులు , సర్ గారు అంటూ అందరి చే గౌరవం పొందుతున్న కొందరు ఆడవాళ్ళ మీద చులకన భావం తో వారి పట్ల అసభ్యం గా ప్రవర్తిస్తూవుంటారు. వివిధ రకాల సమస్యలతో సతమత మయ్యేవారు పరిష్కారం కోసమో , ఈ కలికాలం లో మనశాంతి కోసమో,సాయి సేవ చేసుకోవాలనే ఆశయం తో నో ఇలా గురువులు , సర్ గార్లు గా చలామణి అయ్యేవారిని అతి సులువు గా నమ్మేస్తుంటారు. వారి బేలత్వాన్ని ఆసరా గా తీసుకునే సదరు ప్రబుద్ధులు ఆ అవకాశం ని వాడుకుని ఆ ఆడ వారిని మోసగిస్తుంటారు. వాళ్ళ అశాంతి కి కారణమవుతారు ఒక్కోసారి సాయి బాబా నాకు కనిపించి నీతో మాట్లాడమని చెప్పారు లేదా అలా చేయమన్నారు అని కూడా చెప్పి మహిళలని లోబరచుకోవాలని చూసే ప్రబుద్దులుంన్నారు . బాబా అంటే పిచ్చి నమ్మకం తో వున్న కొందరు భక్తులు వీరి మాటలని నిజమని నమ్మే ప్రమాదముంది..మహిళలూ తస్మాత్ జాగ్రత్త.ఏ దేవుడూ ఆలాచెప్పడు. మీ మనసు ఎవరయినా కాస్త అసభ్యం గా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించినప్పుడే, సాయి మిమ్మల్ని ఆది లో నే హెచ్చరించినట్లు అని తెలుసుకోండి. అలాంటి బూటకపు గురువులని నమ్మకండి.గురువంటే వారికి కొన్ని లక్షణాలు ఉండాలి..వారిని చూడగానే మీ లో ఒకరకమయిన ఆధ్యాత్మిక , ఆరాధనా భావం కలగాలి, వారిని చూడకుండా కొంత కాలం అయితే, ఎపుడెపుడు వారిని చూస్తానో అనే ఆవేదన మీలో మీకు తెలియకుండానే కలగాలి.వారు చెప్పే ప్రతీ మాట స్వయంగా వారు మొదట ఆచరించేదయ్యి ఉండాలి. వారు ఏదీ ఆశించకుండా తనని నమ్మిన వారిని ఉద్ధరించగలిగే వారయి వుండాలి. అలాటివారే గురువు అనే పదానికి అర్హులు ..అలాంటివారిని కాకుండా అట్టహాసాలు ఆడంబరాలు మంత్రాలు శ్లోకాల తో ప్రజలని బురిడీ కొట్టించేవారిని నమ్మవద్దు. మరి కొందరు ఇవేమి లేకుండానే నిరాడంబరం గా నటిస్తూ కూడా మాయ లో దించేయవచు. అలాంటపుడు వారి ప్రవర్తన ని పరిశీలించి , బాబా సలహా అర్థించి మరీ నిర్ణయం తీసుకోవాలి.
ఒక పాఠశాల లో ఉపాధ్యాయిని గా కూడా నేను గమనించింది ఏంటంటే కౌమారం లో వున్న విద్యార్థినులు సినిమా , స్నేహాల ప్రభావంతో బయట అబ్బాయిల ని నమ్ముతున్నారు , తప్పు దారిన పడుతున్నారు. సినిమా , సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణ ని ప్రేమ గా చిత్రీకరిస్తూ ,బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఒక లోపం గా చూయిస్తూ,దీని వల్ల అమ్మాయిలు అబ్బాయిలు విచచాలవిడి గా తల్లిదండ్రుల కి తెలియకుండా ఏదేదో చేస్తూ తమ భవిష్యత్తు ని నాశనం చేసుకొనేలా ప్రేరేపిస్తున్నాయి. అమ్మాయిలూ, పెళ్లి అయ్యే వరకి అబ్బాయిలతో మాట్లాడుతూ , చనువుగా ప్రవర్తిస్తూ మాయ లో పడకండి. పెళ్లి అయ్యాక మీ భర్త తో చనువు గా మెలగండి. అంతే కానీ అప్పటి వరకి అలాంటి స్నేహాలకి దూరం గా వుండండి. మీరు స్నేహం అనుకోని మొదలు పెడ్తారు , చనువు పెరిగి , మీకు తెలియకుండానే హద్దులు దాటే ప్రమాదముంది. మీరు కళ్ళు తెరిచేసరికి జరగరానిది జరిగితే నష్టపోయేది మీరే. మానవ శరీరం లో హార్మోన్స్, అలా చనువు గా మెలిగే క్రమం లో హద్దులు దాటడానికి కారణం అవుతాయి. అది సహజం గా జరిగిపోతుంది. కాబట్టి మేము మా హద్దుల్లో మేముంటాం ,ఏం కాదు .అని అతి నమ్మకం పనికి రాదు. మీరు మోసపోవద్దు అని యింత వివరం గా చెప్తున్న నా మాటలని మనసుకి పట్టించుకోండి. మిమ్మల్ని నమ్మి మీకు స్వేఛ్చనిచ్చిన మీ తల్లి తండ్రులల్ని మోసగించకండి ఇలా చేస్తే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది. ఎవ్వరికీ అవకాశం ఇవ్వకండి. ఈ ప్రపంచం లో తల్లిదండ్రులు , గురువు , భగవంతుడు వీరు తప్ప మనలని ప్రేమించేవారు వుండరు. మీకోసం వీరు ప్రాణాలనయినా ఫణం గా పెడతారు. మీకు ఎదుటి వారిలో కనిపిస్తున్నది నిజమయిన ప్రేమ కాదు.కాస్త ఆప్యాయం గా మాట్లాడితే ప్రేమ అని తల్లిదండ్రులని వదిలి వారి వెంట వెళ్లిపోకండి. తల్లిదండ్రులు , సాయి దేవుడికి కి చెప్పనిదే, వారి సలహా అడగనిదే ఏమి చెయ్యకండి.
ఇంటర్నెట్ లో , తిరగడాలు అవన్నీ తప్పు కాదు అని మీ మనసు పాడు చేసే విషయాలుంటాయి. పెద్ద వారి మాటలు నమ్మండి ఈ విషయాల్లో .గురువులు చెప్పేది సత్యం గా తీసుకోవాలి కానీ ఇంటర్నెట్ ని ఫాలో అవకండి.. ఇంటర్నెట్ లో ని చవకబారు విషయాలు మీకు మధురం గా అనిపిస్తాయి. కానీ అవి భవిష్యత్తు లో మిమ్మల్ని కబళించే విషం తో సమానం అని గుర్తు పెట్టుకోండి. అసభ్య విషయాలు చదవడం చూడడం అలా ప్రవర్తించడం వల్ల మీకు చెడు కర్మ ఫలితాలు అనుభవించాల్సి వచ్చి కష్ట నష్టాలకి కారణమవుతాయి. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేసి తిరగడం , అసత్య ప్రవర్తన ఇవన్నీ చెడు కర్మ ఫలితాలు ఇస్తాయి. అందుకే ధర్మం గా , నీతి గా బ్రతకడం అత్యవసరం. ధర్మం తో కూడిన సుఖం అమృతం లాంటిది. అధర్మం (మీ జీవిత భాగస్వామి కాకుండా వేరే వారితో )తో కూడిన సుఖం విషం లాంటిది.అని గుర్తుంచుకోండి. అంతే కానీ ఒక ప్రముఖ హీరొయిన్ చెప్పింది పెళ్లి కి ముందు అలా చేయడం తప్పు కాదని, ఇలా సెలెబ్రిటీస్ చెప్పారని చెప్పి మీ జీవితాలని పాడు చేసుకోవద్దు.మీ వివాహం జరిగేవరకు, తల్లిదండ్రులు, మీ చదువు, కెరియర్ , భగవంతుడు వీరే లోకం గా బ్రతకండి.
ఒకవేళ మీకు పరిణతి వచ్చాక, మీకు సాయి భక్తులతో స్నేహం ఆ సాయి ప్రసాదిస్తే వారి తో ఒక సాయి బంధువు గా సాయి పరమయిన విషయాలు పంచుకొనే సాయి స్నేహం తప్పు కాదు. కానీ దీనిలో ఆకర్షణ లాంటి విషయాలు రాకుండా జాగ్రత్త పడాలి. సాయి స్నేహం అనేది ఒకరిని మరొకరు ఆధ్యాత్మికం గా ప్రోస్తాహిస్తూ, సహకరిస్తూ యిద్దరూ ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందడానికి తోడ్పడగలదు బాబా ఆశీర్వాదం ఉంటే.
ప్రతి క్షణం మనలని సాయి నుండి దూరం చేయాలని చూసే మాయ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. దీనికోసం పైన చెప్పుకున్న విషయాల్లాంటివి గుర్తు పెట్టుకోవాలి.సాయి స్మరణ ఎప్పుడూ చేస్తుండాలి. యివన్నీ అందరికీ తెలిసినవే. కానీ మల్లి చదవడం వల్ల విషయం మనసు లో నాటుకొని మనల్ని మనం కాపాడుకునేట్లు అవుతుంది. విషయాలు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.