బాబా తన నిజ భక్తుల పట్ల ఎలాంటి ఆధరణ కల్గి వుంటారో క్రింది అనుభవాలు ఒకసారి పరిశీలిద్దాము .
సాయికి అంకిత భక్తుడయినా శ్రీ అమ్ముల సాంబశివ రావు (గురు గారు ) గారు ఫరీదాబాద్ లో శ్రీ సాయి మందిరం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఒకసారి వెళ్ళారు . అయితే అప్పుడే అక్కడ పక్కన ఇంటర్నేషనల్ సాయి డీవోటీస్ కన్వెన్షన్ జరుగుతూవుంది. వేదిక పై ఎంతో మంది గురువులుగా చలామణీ అయ్యేవారు వివిధ రకాల డ్రెస్సుల్లో కూర్చున్నారు . కానీ గురుగారిని వేదిక పయికి వారు ఆహ్వానించలేదు. యిది వారిని అనుసరించేవారికి బాధ కలిగించింది . అక్కడ వేదిక పై గురుగారిలా నిరాడంబరం గా ఎవరూ లేరు . వారు తమ బాధ గురుగారికి వెల్లడించగా , గురుగారు “మనము ప్రతిష్ట కోసం ఇక్కడకు వచ్చాము . డోంట్ వర్రీ , బాబా విల్ టేక్ కేర్” అన్నారు . తర్వాత మధ్యాహ్నం అంతా అంత ఎండ వున్నా , వున్నట్లుండి మబ్బులు కమ్మి , వారం రోజుల నుండి వారు కష్టపడి వేసిన వేదిక గాలికి కూలి పోయి అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. అందరూ గురుగారు విగ్రహ ప్రతిష్ట చేసే చోటు కి అందరూ వచ్చారు. గురుగారు కరుణ తో వారి కొరకు కుర్చీ లు సర్దడం జరిగింది. అపుడు వారు గురు గారికి ౫ నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇచ్చారు . ఆ ౫ నిమిషాల్లో గురుగారు మాట్లాడిన విషయములకు సభ లోని వారంతా హర్ష ధ్వానాలు చేశారు . గురు గారి పాదాలకి నమస్కరించారు.
సాయి తన భక్తులని ఆదరిస్తారు అనేది ఎంత సత్యమో ,తన కి అంకితమయ్యి జీవించే నిజ భక్తుల్లో సాయి కొలువయివుంటాడన్నది కూడా అంతే సత్యము. తన భక్తులని వెన్నంటి నడుస్తూ వారిని కంటికి రెప్ప వాలే కాచు సాయి కన్నా మనకి ఎవరు మిన్న . మాకు మా గురు గారిని అనగా శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ని అనుసరించే వారికి , వారిలో సాయి ఉనికి ఎన్నో సార్లు అనుభవం అయ్యింది .వారి వద్ద సాయి ప్రేమ ని తనివి తీరా పొందవచ్చు.మాకు సంబంధిచిన సమస్యలకి ఎన్నో సార్లు మేము సమస్య వారికి వివరించకుండానే, పరిష్కారం అడగకుండానే వారి వద్ద నుండి సమాధానాలు పొందుతాము.ఒక్కోసారి రాబోయే సమస్య ని కూడా వారు ముందుగానే సూచించి అప్రమత్తం చేస్తుంటారు . వారు వివిధ ప్రాంతాల్లో చెప్పే సత్సంగాల్లో అక్కడ హాజారయ్యే ప్రతీ ఒక్కరికి అవసరమయ్యే సలహాలు సూచనలు అందుతుంటాయి. సాయి వారిలో కొలువయి వుండి వారి నోటి నుండి వచ్చే ప్రతీ మాట సాయి మాట అయి ఉంటుంది. ఇదంతా సాయి యొక్క ప్రేమ , సాయి శక్తి కి నిదర్శనం .
తన భక్తులు ఏదయినా తప్పు దారిలో పోబోతుంటే, సాయి గురుగారి ద్వారా ఏదో ఒక విధం గా హెచ్చరిస్తుంటారు. తన భక్తులచే ఏ చిన్న తప్పు కూడా జరగ కుండా సాయి అనుక్షణం మనలని గమనిస్తుంటారు. కానీ మనం మయా ప్రభావం చేత వారి హెచ్చరిక ని చూసీ చూడకుండా వదిలేస్తుంటాము. తర్వాతా పశ్చాత్తాప పడతాము. మనం లెక్క లేని తప్పులనయినా సాయి క్షమించి మనలని ఉద్ధరింప ప్రయత్నిస్తుంటారు. వారి కృప సాటి రానిది. వారి అసామాన్య ప్రేమ క్షమ ని మనసులో ఉంచుకుని ఎప్పుడూ మనం వారి ముందు తల దించుకునేలాంటి ఏ చిన్న తప్పు కుడా చేయకుండా ఉండాలి. అదే మనం వారి పట్ల మన ప్రేమ భక్తి ని నిరూపించుకునే ఏకాయిక విధానం.అంతే కానీ హారతులు, భజనలు, నామాలు ఎన్ని చేసినా మన ప్రవర్తన మార్చుకోక పోతే అవన్నీ నిష్ప్రయోజనం కరము..మన ప్రవర్తన మార్చుకోవడమే మనకి సాయి పట్ల భక్తి వుంది అందడానికి కొలమానం.మనం ఎప్పుడూ ప్రతీ నిమిషం సాయి(గురు) బోధనలకు అనుగుణం గా నడచుకుంటున్నామా లేదా అని ఎప్పుడూ మనని మనం తరచి చూసుకోవడం ఎంతో అవసరం.మన వుండే రూమ్ లో ఒక చిన్న సాయి ఫోటో అయినా వున్నా సాయి వున్నట్లే భావించాలి, సాయి మనం చేసే అన్ని పనులు, మన లో కలిగే ప్రతీ ఆలోచన, మనం మాట్లాడే ప్రతీ మాట గమనిస్తున్నాడనే ఎరుక కల్గి ఉండాలి. దాని వల్ల మనం ఏ చిన్న తప్పు పొరపాటు అయినా చేయకుండా ఉండగలం.
మనం ఏ భావం తో , ఎంత భావాత్మకత తో బాబా ని ప్రార్థిస్తే బాబా అంతే భావం భావాత్మకత తో స్పందిస్తాడు.
ఈరోజు పాఠశాల లో క్లాస్ లో వున్నపుడు దేని కోసమో నా హ్యాండ్ బాగ్ తీసాను. తీస్తున్నప్పుడు నా జిప్ ఫెయిల్ అయ్యి ఎన్ని సార్లు ప్రయత్నించినా జిప్ సరి కాలేదు.కంప్లీట్ గా లూస్ అయిపొయింది .ఇంటికెళ్లే వరకు స్కూల్లో ఎంత ఇబ్బంది పడాలో అని అనిపించింది, వెంటనే నేను “బాబా, నిన్నే నా స్నేహితుడు అనుకోమన్నావు , ప్రతీది నీకే చెప్పుకోమన్నావు కదా, ఇప్పుడు చెప్పు బాబా, నా బాగ్ జిప్ పోయింది, సరి చేస్తావా” అని అనుకుని మల్లి స్టూడెంట్స్ కి ఏదో instruction ఇస్తున్నాను,అలా 2 నిమిషాలు అయ్యాక ఎందుకో మల్లి నా వొళ్ళో వున్న బాగ్ జిప్ సరి చేయడానికి జిప్ లాగగా వెంటనే జిప్ టైట్ గా కూర్చుంది ఎవరో సరి చేసి నట్లుగా..నాకు చాల ఆనందం కల్గింది బాబా నా వెంట ఉన్నట్లు గా ఫీల్ అయ్యాను..ఇంకా బాబా ని నమ్మి తనని మరువకుండా ఉంటే సాయి ప్రేమ ని ఇంకెంతగా పొందవచ్చు కదా అనిపించింది.. మీరు కూడా బాబా పట్ల అనన్య ప్రేమ (సాయి తప్ప మరో దాన్ని ఆశించని ప్రేమ )కల్గి వుంది సాయి ని మీ మది లో నింపుకుంటారని ఆశిశ్తున్నాను