మొహర్రం -బాబా సమాధి

11694914_204919136540376_807610728834732728_n

సాయిరాం. ఈరోజు 21 ,సెప్టెంబర్ మొహర్రం..సరిగ్గా వంద 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇదేరోజు అనగా 1918 లో 9 వ మొహర్రం నాడు (అపుడు అక్టోబర్ 15 నాడు 9 వ మొహర్రం వచ్చింది.) బాబా మహా సమాధి చెందారు. బాబా తన నిర్యాణం ని కూడా ముందే సూచించారు .

సమాధి కి నాలుగు నెలల ముందు గానే అనగా జూన్ లో బాబా రాత్రి 8 గంటలకు అప్ప భీల్ తో ఇలా అన్నారు “నాలుగు కోళ్లు తీసుకురండి. అతిథులు వచ్చేవారున్నారు “.అప్పుడు అక్కడే వున్నా చోటే ఖాన్ , ఈ రాత్రి మసీదు కి ఎవరు రానున్నారో చూద్దామని అప్పా భీల్ తో సహా ద్వారకామాయి లో పరదా వెనక్కు దాక్కొని కూర్చుని చూడసాగారు. రాత్రి 2 గంటల తర్వాతా ఒక మీటర్ అంత పెద్ద అగ్ని గోళం చాలా వేగంగా మసీదు లోకి చొచ్చుకొని వచ్చింది. తర్వాత మసీదు పై కప్పు కి కొట్టుకుని అసంఖ్యాక మయిన భాగాలు గా విడి పోయింది. ఇది జరగ్గానే మసీదంతా గొప్ప కాంతి తో నిండి పోయింది . ఆ ప్రకాశాన్ని అప్ప భీల్ మరియు చోటే ఖాన్ భరించలేక తమ తలని కిందికి తిప్పి ముఖం కప్పుకున్నారు.అపుడు మసీద్ లో వున్నా బాబా సాటక తీసుకుని ద్వారకామాయి వద్దకు వెళ్లి అరబీ భాష లో పది పదిహేను నిమిషాల దాకా ఏదేదో అంటూ వున్నారు , అప్పుడు ఆ ప్రకాశం తగ్గిపోయింది. మరుసటి రోజు బాబా అప్ప తో నాలుగు కోళ్లు తెప్పించి వండించారు మరియు పూర్ణపు పోలీలు స్వయంగా బాబా వండారు.

ఆ తర్వాతా జులై నెల లో బడే బాబా కొడుకు కాసిం ని బాబా ఔరంగాబాద్ లో ని ఫకీర్ షంషుద్దీన్ మరియు బడే మియా దగ్గరకు ఒక సందేశాన్నిచ్చి పంపిస్తాడు , “తొమ్మిదవ నెల లో తొమ్మిదవ రోజు (ముస్లిం క్యాలెండరు ప్రకారం ) అల్లాహ్ తన ప్రపంచం తీసుకెళ్తాడు,ఇది అల్లాహ్ యొక్క ఇఛ్చా “..ఈ సందర్భం గా మౌలూ , కవ్వాలి జరిపించడానికి గాను 250 రూపాయలు ఒక పుష్ప హారం తో కూడా ఇఛ్చి పంపిస్తాడు బాబా..కాసిం మరియొక సాయి భక్తుడయిన ఇమామ్ చోటే ఖాన్ తో కలిసి అవరంగాబాద్ చే రుకుంటారు.అక్కడ స్టేషన్ లో వీరి రాక ముందే తెలిసిన షంషుద్దీన్ మియా స్టేషన్ లో వీరిని కలిసి , సాయిబాబా దగ్గరినుండి వచ్చిన అతిథులు మీరేనా అని అడగ్గా వారు బాబా సందేశం ఆ ఫకీర్ కి వినిపిస్తారు .అపుడు ఆ ఫకీర్ వారిని తన డేరా కి తీసుకెళ్లగా అక్కడ బాబా చేయించమని చెప్పిన కార్యక్రమాల బందో బస్తు అప్పటికే జరుగుతుండటం చూసి కాసిం వాళ్ళు ఆశ్చర్యపోతారు. మరుసటిరోజు బన్నేమియా యొక్క డేరా ని చేరుకుంటారు.ఆ సమయం లో బన్నే మియా చేతులు పైకెత్తి ధ్యాన ముద్ర లో కూర్చుని వుంటారు.అక్కడ ఉన్నఅరబ్ యాత్రికులు ఆ సమయం లో బన్నేమియా దగ్గరకు వెళ్లవద్దని వారిని వారిస్తారు. కొంచం సేపు ప్రతీక్షించి ఆ తర్వాత సాహసించి బన్నేమియా దగ్గరకు వెళ్లి బాబా ఇఛ్చిన పుష్ప హరమ్ ని వారి మెడ లో వేయగానే బన్నే మియా తన చేతులను కిందికి దింపి ధ్యాన ముద్ర నుండి సామాన్య అవస్థ కి వచ్చారు. తర్వాతా బాబా సందేశం వారి కి వివరింపగా బన్నే మియా ఆకాశం వైపు కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత కాసిం షిరిడి తిరిగి వచ్చారు.

ఆ విధం గా అక్టోబర్ ,1918 మంగళవారం నాడు బాబా మధ్యాహ్నం తన భౌతిక శరీరం త్యాగం చేశారు.హిందూ పంచాంగం ప్రకారం ఆరోజు ఏకాదశి, మరియు ముస్లిం పంచాంగం ప్రకారం ఆరోజు హిజరీ 1377 , శబెయ్ ఆషూరా ముహర్రం యొక్క తొమ్మిదవ రోజు.

బాబా సమాధి చెందుతూ కూడా తన దాన గుణాన్ని ప్రజలందరికీ అలవర్చుకొమ్మని చెప్తున్నట్లు గానే తన వద్ద ఉన్న తొమ్మిది నాణేలను కూడా లక్ష్మి బాబు షిండే కి దానం ఇస్తూ తన భౌతిక శరీరం వదిలేశారు. తనకోసం అని బాబా ఎప్పుడూ ఏమి దాచుకోలేదు. అహర్నిశలూ భక్తుల కోసమే జీవించారు, తన భక్తుడి మరణం తాను తీసుకుని తాను సమాధి చెందారు. బాబా ప్రేమ కి ఈ ప్రపంచం లో ని మరి ఏదీ సాటి రాదు, అలాంటి మన ప్రేమ స్వరూపిడికి ఏమిఛ్చి మనం తన ఋణం తీర్చుకుందాము? బాబా చెప్పిన విషయాలు, ఆచరించి మరీ చూపించిన విషయాలను అనుక్షణం పాటించడమే మనం వారి పట్ల మన ప్రేమ ని చూయించే విధానము. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టుదాం, మనకున్నంతలో దానం చేద్దాం, గణపతి మండపాల్లో మొదలయిన వాటిలో ఉన్నవారి కె అన్న ప్రసాద వితరణ జరుగుతోంది, మరి బిచ్చ గాళ్ళ గూర్చి ఆలోచించేదెవ్వరు. ఆ మండపాలు టెంపుల్స్ లో కూడా విహార యాత్ర కి వెళ్లినట్లు గా ఉన్న వారే అన్న ప్రసాదాలు తీసుకుంటుంటే దాని ప్రయోజనం సిద్దించదు. వీలయినంత గా ఇలాంటి సహాయాలు దానాలు పేద వారికి అందేలా చూద్దాం మనందరి బాధ్యత. హీనులని దీనులని ఆదరించినప్పుడే మనం సాయి కి చేసిన నిజమయిన సేవ.. జై సాయిరాం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close