సాయి నామాలు సుమాలయి సాయిసన్నిధి చేరు గాక!
నామ మహిమ మనకు తెలుసు. భగవంతుడి నామం తెలిసి అన్నా, తెలియక అన్నామన పాపాలు పోతాయంటారు. అలాంటి సాయి నామాన్ని ఒక మంత్రం రూపం లో జపించుకోవడం మనకి ఇంకా ఎక్కువ ఫలితాన్నిఇస్తుందని మన నమ్మకం. మరి ఈ సాయి గాయత్రీ మంత్రం యొక్క మహిమ ని మన ముందుకు తెస్తున్నారు “విశ్వ సాయి ద్వారకామాయి శక్తి పీఠం” సభ్యురాలయిన శ్రీమతి మాధవి గారు. వారు తనకు బాబా చూపెట్టిన ఎన్నో లీలలను మనతో మన వెబ్సైటు ద్వారా పంచుకుంటూ వున్నారు. అదే క్రమం లో, సాయి గాయత్రీ మంత్రం ఉచ్చారణ సందర్భం గా వారి గ్రూప్ కి జరిగిన అనుభవం వారి మాటల్లోనే..
“సాయి బంధువులందరికి సాయి రాం..నేను మాధవి(భువనేశ్వర్ ).ఒక మంచి బాబా లీలను మీతో పంచుకోవాలని రాస్తున్నాను.ఈ లీలను మీ అందరికి అందచేసిన వాళ్లకు ధన్యవాదాలు.మన శాస్త్రాలలో గాయత్రీ మంత్రానికి చాలా ప్రాశస్త్యం ఉంది.చాలా మంది దేవి దేవతలు కూడా గాయత్రీ మంత్రం ద్వారా సిద్దులు పొందినవారు.అలాగే ప్రతి దేవి,దేవతలకు గాయత్రీ మంత్రం ఉంటుంది.మనం ఇంట్లో చేసుకునే నిత్యపూజ కూడా గాయత్రి మంత్రం తోనే మొదలుపెడతాం.అలాగే మన ఇష్టదైవం అయిన సాయి బాబా కు కూడా సాయి గాయత్రీ మహా మంత్రం ఉంది.అది మీ అందరికి తెలిసి ఉంటుంది.మేము (విశ్వసాయి ద్వారకామాయి .org) వాళ్ళం ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రపంచం మొత్తం లో ఉన్న అందరం విశ్వశాంతి కోసం ఈ మంత్రజపం చేసుకుంటాము.ఇది చాలా మహిమాన్వితమైన మంత్రం.
- ఈ సందర్భం గా,మాకు జరిగిన అనుభవాలు
అది * 2015 సంవత్సరం. భువనేశ్వర్ లో మాఇంట్లో ఈ మంత్రం ఒక 10 మందిమి కుచోని చేసుకుంటున్నాము.అందరం ఒకేసారి జపం చేస్తున్నాము.బాబా అప్పుడే ఒక లీల చేశారు.ఏమిటి అంటే, మేము అందరం మంత్రజపం లో కళ్ళు మూసుకొని ఉండగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి , “నేను షిర్డీ నుంచి వచ్చాను,మీ కోసం విభూతి తెచ్చాను,తీసుకోండి,నేను త్వరగా వెళ్ళాలి,”అని చెప్పి, రెండు విభూది పాకెట్స్ ఇచ్చి వెళ్లారు.అది కళ్ళుమూసుకుని జపం చేస్తున్న నేను గమనించలేదు.మా వారు తీసుకొని బాబా ఫోటో ముందు పెట్టారు.అందరం ఆశ్చర్యంగా అలా ఉండిపోయినాము. ఇలా పరమ పావనమయిన సాయి గాయత్రి మంత్రం ఉఛ్చారణ ని మెచ్చ్చి బాబా మాకు ఊదీ ప్రసాదం ప్రసాదించారు.
ఇంకో లీల వినండి.అప్పుడే సాయి గాయత్రీ మంత్రం జపానికి నా స్నేహితురాలు, ఆమె భర్త కూడా వచ్చారు.ఆయన ఆవిడను మా ఇంట్లో వదిలి పెట్టి వెళ్లిపోతాం అనుకున్నారు.నేను అన్నాను కొంచెం ఆగండి,రెండు జప మాలలు అయినా చేసి వెళ్ళండి అని అడిగాను.అతను నన్ను కాదనలేక జపానికి కూర్చున్నారు.అలా కూర్చొని మొత్తం అయిపోయేవరకు కూర్చున్నారు.మేము అప్పుడు 10,000 చేసాము.అంటే 10 సార్లు మాలలు చేసాము.అప్పుడే అద్భుతంజరిగింది.ఆయన 6 నెలల కిందట ఒక స్నేహితునికి ఒక్కకోటి రూపాయలు lone ఇచ్చాడట,only నమ్మకం పైన. ఏమి పేపర్స్ లేవు. ఫ్రెండ్ కదా, తప్పక ఇస్తాడు లే,అని. చూస్తే అతను ఒక్క కోటి రూపాయలు తీసుకొని ఇంక కనపడలేదు. ఇతను ఇంకా ఆ డబ్బులు రావు అనుకున్నాడు. పాపం చాలా నిరాశగా వున్నాడు.మా ఇంట్లో ఆ సాయి గాయత్రీ మంత్రం ఐన వెంటనే,అతని ఫోన్ కు ఒక msg వచ్చింది.అది ఏమిటి అంటే” రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి,మీ డబ్బులు మీకు చెల్లిస్తాను” అని.అప్పుడు అతనికి సాయి గాయత్రీ మహిమ అర్థం అయింది.నాకు ఎంతో ధన్యవాదాలు చెప్పాడు,
మేము 2016 లో 11లక్షలు, 2017 లో 25లక్షలు, ఇప్పుడు 2018,బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రపంచం మొత్తం ఒక్క కోటి సార్లు సాయి గాయత్రీ మంత్రం చేస్తున్నాము.ఆ మంత్రం ప్లయిర్ మీకు attach చేస్తున్నాను.మీరు దీనిలో భాగస్వాములు కండి.సాయి నాథుని ఆశీర్వాదాలు పొందండి.ఈ మంత్రం “ఓం షిర్డీ వాసాయ విద్మహే,సర్వ సిద్ధిశ్చ ధీమహి, తన్నో సాయి ప్రచోదయాత్”.మీరు ఈ మంత్రాన్ని రోజూ జపించి ఆ సాయి పరబ్రహ్మ ఆశీర్వాదాలు పొందండి. దీని మహిమ అనంతం అపూర్వం. సర్వం సాయి నాథార్పణమస్తు.”
ఈ సాయి గాయత్రి మంత్రం భావం క్రింద ఇవ్వబడింది. అర్థం తెలుసుకుని మంత్రాన్ని భక్తి భావం తో,సాయిని మదినిండా నింపుకుని జపిద్దాము.
జై సాయిరాం !
Reblogged this on Sai sannidhi.
LikeLike
Madhavi Mee anubhavalu chaala baagunnayi menu kids Oct 18nunchi Sai Gayatri start chestamu ok
LikeLiked by 1 person
Baba doing miracles.jai sai ram
LikeLiked by 1 person