“సాయి చరణం – భవ భయ హరణం”

శ్రీ సాయినాథాయ నమః

21272139_1664029313615376_2894031220796106966_n.jpg

మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన సాయి బంధువు దినేష్ నందన్ తివారి తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు….

“ఒకానొకప్పుడు నేను చాలా కష్టాల్లో ఉంటిని. షిర్డీ కి వెళ్లి రావాలని సంకల్పం కూడా చేసుకుని, పైసలు కూడబెట్టాను .పైసలు ఖర్చు అయిపోయేవి. కానీ షిర్ది వెళ్లలేక పోయేవాడిని. అందుకే బాగా నిరాశ  గా వుండే వాడిని. బాబా నన్ను ఎందుకు రానివ్వడం లేదు? అయన తన వాళ్ళను పిచుక కాళ్లకు దారం కట్టి లాగినట్లు తన దగ్గరికి రప్పించుకుంటాడని విన్నాను. ఏమో నేను బాబా కి చెందిన వాడిని కానేమో అని అనుకునేవాడిని. అలా బాధ పడుతూ మా ఇంటి దారిలో వున్న సాయి బాబా గుడి కు వెళ్ళాను. అపుడే ఆరతి మొదలయ్యింది .ఆరతి అయ్యాక అక్కడ పూజారి సెల్వరాజ్ పిళ్ళై నన్ను చూసి అడిగాడు,” ఎందుకు ఏదో చింత వేధిస్తున్నట్లుగా వున్నావు?” అని అడిగాడు . నేను షిరిడి వెళ్లలేక పోతున్నాను అన్న విషయం చెప్పాను. అతడు దానికి నవ్వి , “ఊరికే యిలా చింత చేస్తూ తిరుగుతూ ఉంటే అవ్వదు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యు, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు, నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరన్న షిరిడి కి వెలుతూ ఉంటే ,ఒక శ్రీ ఫలం అంటే టెంకాయ వాళ్లకు యిచ్చి, శ్రీ సమర్ధ సద్గురు సన్నిధానం లో నీ కోరిక చెప్పి సమర్పించమను. అపుడు చూడు ” అన్నాడు. అంతే అపుడు నేను నా స్నేహితుని ద్వారా శ్రీ ఫలం పంపినాను .నన్ను నమ్మండి , 15 రోజుల్లో నేను నా భార్య శ్రీ సాయినాధుని దర్శనం చేసుకోవడం రావడం జరిగిపోయాయి .

ఇంకో లీల వినండి .ఆ రోజుల్లో నేను మధ్య ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేసేవాడిని . నా ఫ్రెండ్ అదే ఆఫీసు లో కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. అతని పేరు జి. సోనాల్కర్,అతనికి ఒక కొడుకు కూతురు వున్నారు, కూతురి పేరు సాధన .అమ్మాయి కి పెళ్లి వయసు వచ్చింది , తల్లి తండ్రి చింత చేస్తున్నారు పెళ్లి అవడం లేదని . రెండు సంవత్సరాలు గడిచి పోయాయి. ఒకరోజు నా స్నేహితుని భార్య నాతో అంది , ” అన్నయ్య, అమ్మాయి కి పెళ్లి వయసు వచ్చింది , సంభంధం కుదరడం లేదు ఎలాగ , మీరు బాబా భక్తులు కదా ! ఉపాయం చెప్పండి” అన్నది .నేను అన్నాను,(బాబా అనిపించారు) “ఎవరయినా షిర్డీ వెళ్తుంటే ఒక టెంకాయ ద్వారకామాయి బాబా కి నివేదించి మీకున్న కోరిక, అంటే మీ అమ్మాయి పెళ్లి గూర్చి ఆ టెంకాయ ద్వారా బాబా కి తెలియ జేయండి సాధన (వారి అమ్మాయి ) చేతి తో ఆ టెంకాయ తాకించండి . మీ సమస్య బాబా కి నివేదించండి .అపుడు మీ సమస్య తీరిపోతుంది” అని చెప్పాను

నా మాట మీద విశ్వాసం ఉంచి వాళ్ళు అలాగే చేశారు .నన్ను నమ్మండి , ఒకటిన్నర నెల లో , ఆ అమ్మాయి కి మంచి సంభంధం వచ్చి , పెళ్లి అయ్యి , అత్త గారింటికి కూడా వెళ్ళింది .ఇవన్నీ చూసి నాకు సాయి నాధుని మీద ఇంకా భక్తి విశ్వాసాలు ఎక్కువ అయినాయి .ఆ సాయినాధుని చరణాలే ఇక శరణాలు అనిపించింది.”
                                                                                                                             దినేష్ నందన్ తివారి
                                                                                                                               రామ్ నగర్,
                                                                                                                         జబల్పూర్ , మధ్య ప్రదేశ్

సేకరణ : శ్రీమతి మాధవి

ఈ పై లీలల ద్వారా బాబా పట్ల మన విశ్వాసం ఎంత బలం గా ఉంటే, మన భావన ప్రకారం బాబా మన సర్వ కోరికలను తీర్చి (ధర్మ బద్ధమయిన , న్యాయమయిన కోరికలు సుమా! ) , మన సమస్యలనుండి మనల్ని విముక్తులను చేస్తారు అన్నది అవగతమవుతుంది.బాబా ని మనం ఎంత గా ధ్యానిస్తామో , స్మరిస్తామో అంత గా మనం ఫలితం పొందుతాం.

“ఎవరయినా ఏమయినా సాధన చేసినచో వారు దాని ఫలితం అనుభవిస్తారు.ఎవరు నా మాటలను గుర్తుంచుకుంటారో వారు విలువయిన ఆనందం పొందెదరు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును “  అని సాయి చెప్పకనే చెప్పారు కదా !!

“సాయి చరణం – భవ భయ హరణం”11013143_768522119927751_3553047607257852173_n

1 thought on ““సాయి చరణం – భవ భయ హరణం”

  1. Very good experience.if I read such experiences my orientation increases. Thank you

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close