సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

సాయంకాల ఆరతి (తెలుగు అర్థము తో)

                    1601570_975470102509268_196573584671606527_n

                      8. శ్రీ గురు ప్రసాదయాచన దశకము

రుసో మమ ప్రియాంబికా మజవరీ పితాహీ రుసో

రుసో మమ ప్రియాంగనా, ప్రియసుతాత్మజాహీ రుసో

రుసో భగిని బంధుహీ, శ్వశుర సాసుబాయీ రుసో

న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

పుసో న సూనబాయీ త్యా, మజ న భ్రాతృజాయా పుసో

పుసో న ప్రియ సోయరే, ప్రియ సగే న జ్ఞాతి పుసో

పుసో సుహృద నా సఖా, స్వజన నాప్తబంధూ పుసో

పరీన గురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

పుసో న అబలా ములే, తరుణ వృద్దహీ నా పుసో

పుసో న గురు థాకుటే, మజన ధోర సానే పుసో

పుసో నచ భలే బరే, సుజన సాధుహీ నా పుసో

పరీ న గురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

రుసో చతుర తత్వవిత్, విబుధప్రాజ్ఞ జ్ఞానీ రుసో

రుసోహీ విదుషీ స్త్రీయా, కుశల పండితాహీ రుసో

రుసో మహిపతీ యతీ, భజక తాపసీహీ రుసో

న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

రుసో కవి ఋషీ మునీ, అనఘ సిద్ద యోగీ రుసో

రుసో హి గృహదేవతాని కుల గ్రామదేవీ రుసో

రుసో ఖల పిశాచహీ, మలిన ఢాకినీహీ రుసో

నదత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

రుసో మృగ ఖగ క్రిమి అఖిల జీవజంతూ రుసో

రుసో విటప ప్రస్తర, అచల ఆపగాబుదీ రుసో

రుసో ఖ పవనాగ్ని వార, అవని పంచతత్వే రుసో

న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

రుసో విమల కిన్నరా, అమల యక్షిణీహీ రుసో

రుసో శశి ఖగాదిహీ గగని తారకాహీ రుసో

రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో

న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

రుసో మన సరస్వతీ, చపలచిత్త తేహీ రుసో

రుసో వప దిశాఖలా, కఠిన కాల తో రుసో

రుసో సకల విశ్వహీ మయి తు బ్రహ్మగోల రుసో

న దత్తగురు సాయి మా మజవరీ కధీహీ రుసో ||

విమూఢమణూనీ హసో, మజ న మత్సరాహీడసో

దాభిరుచి ఉల్హాసో , జననకర్దమీ నా ఫసో

న దుర్గధృతిచా ధసో అశివభావ మాగే ఖసో

ప్రపంచి మన హే రుసో ధృఢ విరక్తి చిత్తీ ఠసో ||

కుణాచిహి ఘృణా నసో, న చస్పృహా కశాచీ అసో

సదైవ హృదయీ వసో, మనసిధ్యాని సాయీవసో

పదీ ప్రణయ వోరసో, నిఖిల దృశ్య బాబా దిసో

న దత్తగురు సాయి మా, ఉపరి యాచనేలా రుసో |

అర్థము : 1. నా తల్లి, తండ్రి నాపై అలిగిన అలుగుగాక, నా భార్య, బిడ్డలు నాపై అలిగిన అలుగుగాక, నా అక్కలు, చెల్లెళ్ళు, అత్తమామలు అలిగిన అలుగు గాక, దత్తగురు స్వరూపుడైన సాయి, నీవు మాత్రం నా మిద ఎప్పుడూ అలుగవద్దు. 2.నాకోడలు, వదిన, ప్రియబంధువులు, ప్రియమైన స్వజనులు, సఖులు, స్నేహితులు, మరియు ఆప్తులు వీరెవరూనాగురించి ఆలోచించకపోయిననుఫరవాలేదు. ఓసాయినాథప్రభు! నీవు మాత్రము నాపై అలుగకుము. 3.స్త్రీలు, బాలురు, తరుణులు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు, మంచివారు, చెడ్డవారు, సజ్జనులు, సాధువులు, వీరంతా నన్ను నిర్లక్ష్యం చేసినను ఫరవాలేదు. నీవు మాత్రం నాపై అలుగకుము సాయి. 4. చతురులైన వేదాంతులు, పండితులు, బుద్ధిమంతులు, జ్ఞానులు, విదుషీమణులు, కుశలురైన పండితులు, రాజులు, సన్యాసులు, భక్తులైన తపస్వులు, నాపై అలిగిన ఆలుగుగాక నీవు మాత్రం నాపై అలుగవద్దు సాయిదేవా, 5. కవులు, ఋషులు, మునులు, పేరు పొందిన సిద్ధులు, యోగులు, దేవతలు, కులదేవతలు, గ్రామదేవతలు, దుష్టశక్తులు, పిశాచములు, అపవిత్రమైన ఢాకినీశక్తులు, వీరంతా నాపై కోపగించిన కోపగించుగాక నీవు మాత్రం నాపై అలుగవద్దు సాయీశ్వరా, 6. పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, సమస్త జీవజంతువులు పాషాణ పర్వతములు, నదులు, సముద్రములు, భూమి, పంచభూతములు నాపై అలిగిన అలుగుగాక, సాయినాధా! నీవు మాత్రము నాపై అలుగకుము.

7.పరిశుద్దులైన కిన్నరులు, యక్షులు, సూర్యచంద్రాదులు ఆకాశమందలి నక్షత్రములు, దేవతల రాజైన దేవేంద్రుడు, దయలేని ధర్మరాజు వీరంతా నాపై అలిగినను, నీవు మాత్రము నాపై అలుగకుము. 8. నా శరీరము, మనస్సు – సరస్వతి, లక్ష్మి మొదలైన దేవతలు, అష్టదిక్కులు, కఠినమైన కాలము సమస్తప్రపంచము మరియు ముల్లోకములు నాపై అలిగిన అలుగు గాక, నీవు మాత్రము నాపై అలుగకుము. 9. నేను మూర్భుడనని పరిహసించినా, మాత్సర్యము ఆవహించినా, నీ పాదములయందు నాకు గల భక్తి తగ్గకుండా, జనవరూపమగు మాయలో చిక్కకుండా, నీయందు గల విశ్వాసముతో కూడిన ధైర్యము తగ్గకుండా, చెడు ఆలోచనలు రాకుండా, ధృఢమైన విరక్తి భావనలు మనసులో నాటుకొనునట్లుగా చేయుము సాయీశ్వరా! 10. ఎవరియందు ద్వేషము లేక, దేనియందు కోరికలేకుండా చేయుము. నా హృదయములో స్థిరంగా వుండి నాచేత ధ్యానించబడుతూ వుండుము. నీ పాదముల యందు ప్రేమ కలిగించుము. ప్రపంచమందలి అన్ని వస్తువులలోను నీ రూపమే కనిపించునట్లుగా చేయుము. మాతృరూపుడవైన సాయి, నేను పైన అడిగిన అన్ని విషయములు భిక్షరూపములో వేసి అనుగ్రహించుము. అలుగకుము.

                         9.మంత్ర పుష్పం

హరిః ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి

ప్రథమాన్యాసన్-తే హ నాకం మహిమానః సచంత

యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః |

ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |

నమో వయం వైశ్రవణాయ కుర్మహే |

సమే కామాన్ కామకామాయ మహ్యం

కామేశ్వరో వైశ్రవణో దధాతు !

కుబేరాయ వైశ్రవణాయ, మహారాజాయ నమః

ఓం స్వస్తి ! సామ్రాజ్యం భోజ్యం,

స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం

మహారాజ్యమాధిపత్య మయం సమంతపర్యా |

ఈశ్యాత్సార్వభౌమ స్సార్వాయుష్య ఆన్

తాదాపరార్జిత్ పృథివ్యై సముద్రపర్యంతాయా |

ఏకరాళ్ళితి! తదప్యేష శ్లోకోభి గీతో మరుతః |

పరివేష్టారో మరుత్తస్యావసన్గృహే ||

ఆవిక్షితస్య కామప్రేర్ విశ్వేదేవా : సభాసద ఇతి ||

శ్రీ నారాయణ వాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజీకి జై ! 

                         

                10.ప్రార్ధన 

కరచరణకృతంవాక్కాయజం కర్మజంవా

శ్రవణ నయనజంవా మానసంవాపరాధమ్ ||

విదితమవిదితంవా సర్వమేతత్ క్షమస్వ

జయజయ కరుణ అబ్దే శ్రీ ప్రభో సాయినాథ ||

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !

అర్ధము : చేతులతోగాని, కాళ్ళతోగాని, శరీరముతోగాని, చేయు పనులద్వారా గాని, చెవులద్వారాగాని, కళ్ళద్వారాగాని, మనస్సుతోగాని, తెలిసిగాని లేక తెలియకగాని నేను చేసిన అన్ని అపరాధములను కరుణాసాగరుడవైన ఓ సాయినాథ ప్రభో ! క్షమించి నన్ను రక్షించుము.

ఓం రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ !

♥శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ  జై!♥

(సాయంకాల ఆరతి కార్యక్రమము సమాప్తము)

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close