సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

మరణాన్ని ఆపిన సాయి శక్తి

ఓం శ్రీ సాయినాధాయ నమః

తన భక్తుడికి రాబోయే మరణాన్ని అనూహ్య రీతిలో తప్పించి అనుగ్రహించిన సాయినాథుడు..

1993 వ సంవత్సరం లో జబల్పూర్ లో నివసించే చంద్రకాంత్ అనే భక్తుడికి శ్రీ షిరిడి సాయినాధుడు చూపిన అమోఘమైన లీల తెలుసుకుందాము.

సాయి భక్తుడైన చంద్రకాంత్ రైల్వేలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవాడు.తను ఉద్యోగం చేసే ప్రాంతంలో రైల్వే శాఖలో రెండు వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకి ఒకరికొకరికి పడదు వారి కక్షలు ఎంతవరకు వచ్చాయంటే ఒకరిని ఒకరు నరుక్కుని చంపుకునే స్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితులలో ఆ రెండు వర్గాలలోని ఒక వర్గం వారు ఈ చంద్రకాంత్ ని శత్రువర్గం గా తలచి అతనిని చంపాలని తలంచారు. అందుకు సర్వసన్నద్ధులయి కత్తులు గొడ్డళ్లు మొదలగు మారణాయుధాలతో ఒకరోజు చంద్రకాంత్ మీదకి విరుచుకుపడ్డారు. తన పని తాను చేసుకుని ఇంటికి బయలుదేరి వెళుతున్న చంద్రకాంత్ కు ఈ విషయం తెలియక మామూలుగానే ఇంటికి బయలుదేరాడు. దారిలో అతడి పై శత్రువర్గం దాడి చేసింది. వెనుక నుండి ఎవరో కత్తితో వెన్నుపోటు కూడా పొడిచారు. నిత్యం శ్రీ సద్గురు సాయినామ సంస్మరణతో తపించి తరించే ఆ భక్తుడు ఎప్పుడైతే తన వెన్నులో కత్తిపోటు పడిందో అప్పుడే పంచ ప్రాణాలను ఒకటి చేసి తన ప్రాణనాధుడిని,అసహాయ సహాయుడిని,ఆనాథనాథున్ని,ఆశ్రిత వత్సలుడు అభ యప్రదాతను, పిలిచిన పలికే ప్రత్యక్ష దైవం అయిన శ్రీ సాయినాధుడిని ఎలుగెత్తి సాయి అని ఆర్తితో బిగ్గరగా పిలిచాడు. ఆ సమయంలో శ్రీ సద్గురు సాయి తప్ప తనని ఎవరు రక్షించలేరు. అటువంటి పరిస్థితి అది.వెంటనే ఆ ఆపన్న శరణుడు ఏం చేశాడో ఏమో శ్రీ సద్గురు నాధుడికే తెలియాలి.రెండో కత్తిపోటు అతని వెన్నును తాకేలోగా కత్తితో పొడిచేతన తన మిత్రుడి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి,ఆ వర్గంలోని వ్యక్తి “ఇతను ఆ మూటలో వాడు కాదురా,వాళ్లకు ఇతనికి సంబంధం లేదు. మనం పొరపాటు పడ్డాము “అనడంతో జరిగిన దానికి మరే మైనా గొడవ జరుగుతుంది ఏమో నన్న భయము,ఆ నడిరోడ్డులో నలుగురు తమను వెంబడించి హింసిస్తారేమో అనే అనుమానమో తెలియదు ఎక్కడి వారెక్కడ పారిపోయారు. ఈ భక్త శిఖమణి చంద్రకాంత్ కింద పడిపోయారు. ఇదే అసలైన శ్రీ సద్గురు సాయి లీల ఈలోగా సైకిల్ మీద ఎవరో వచ్చారు.అతన్ని సమీపించారు రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లి జరిగింది చెప్పి ఆసుపత్రిలో చేర్పించారు ఆ వ్యక్తి చంద్రకాంత్ఇం టికి వెళ్లి చంద్రకాంతపై జరిగిన హత్యా ప్రయత్నం చెప్పి అతను ఫలానా ఆసుపత్రిలో ఉన్నాడని వాళ్ళ వాళ్ళను ఆసుపత్రికి తీసుకువచ్చాడు.శ్రీ సద్గురు సాయి దయవలన ఆ భక్త మహాశయుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కొన్ని నెలల చికిత్స తర్వాత ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.అయితే అప్పటికే ఇప్పటికే ఎప్పటికీ అర్థం కాని విషయం,అతన్ని ఆస్పత్రిలో చేర్చిన వారెవరు? ఇంటికి వెళ్లి తన వాళ్లకు ఆ విషయం చెప్పి అతనికి ప్రాణ బిక్ష పెట్టిన వారెవరు? ఎంత ఆలోచించినా ఆ వ్యక్తి ఎవరో తెలియడం లేదు . ఆ భక్త శిఖమణి చంద్రకాంత్ ఇలా అంటాడు “నాకు ప్రాణ బిక్ష పెట్టి ఆసుపత్రిలో చేర్పించి నా వాళ్లను రప్పించి నన్ను రక్షించినది శ్రీ సద్గురు సాయి” అని. ఆ అపరిచితుని ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్లీ ఎప్పుడు ఎక్కడా చూడలేదని ఆ తండ్రికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనని కృతజ్ఞతా పూర్వకంగా భక్తి భావంతో వినయ విధేయ ప్రదర్శిస్తూ పలుకుతాడు ఆనాటి నుండి చంద్రకాంత్ప్ర తి మూడు నెలలకు ఒకసారి షిరిడిని సందర్శిస్తూ సాయి భక్తి లో ఆనందిస్తున్నాడు

సేకరణ : సద్గురు సాయి భక్త లీలామృతం

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close