ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి తన భక్తులని కర్మ బారిన పడకుండా చేసే సాయి లీలని తెలుసుకుందాం.

నిన్న పాఠశాల విధులని ముగించుకుని ఇంటికొచ్చి స్నానం చేస్తున్నాను. ఆక్సిడెంట్ అయినాక గత 8నెలల నుండి స్టూల్ పై కూర్చుని స్నానం చేస్తున్నాను. అలా ఆ స్థితిలో ఎప్పుడూ లేనిది స్టూల్ నుండి జారి బాత్రూం లో కిందకి పడిపోయాను. కానీ విచిత్రం గా, పడేపుడు స్టూల్ అమాంతం మొత్తం పక్కకి జరిగిపోయినా కూడా నేను ఒక్క సారిగా కిందికి పడకుండా చాలా నెమ్మదిగా ఎవరో ఆ force ని ఆపి నన్ను కిందికి జార విడుస్తున్నట్లు గా నెమ్మదిగా కింద జారాను.అది ఎలా సాధ్యం అయిందో ఇప్పటికీ అది అర్థం అవటం లేదు.నేను force గా కిందకి పడి నా నడుము విరగకుండా సాయి ఇలా కాపాడాడు అని అనిపిస్తోంది.ఆ తరువాత “నేను ఈరోజు ఏమయినా తప్పు చేసానా అని సమీక్షించుకున్నాను. ఉదయం స్కూల్ లో ఆరవ తరగతి పిల్లలని నేను గట్టిగా కొట్టిన సంగతి గుర్తుకు వచ్చింది. నేను పనిచేస్తున్న పాఠశాల హైదరాబాద్ పరిసర ప్రాంతం అవటం వల్ల పిల్లలు చాలా దూకుడు గా వున్నారు, క్లాస్ ని డిస్టర్బ్ చేస్తున్న ఇద్దరిని శాంత పర్చడం లో అలిసిపోయి, నా సహనం నశించి స్కేల్ తో కొంచెం అతి గానే దండించడం జరిగింది.”ఉపాధ్యాయులు విద్యార్థులని ప్రేమ గా దండించాలి కానీ ద్వేషం తో దండించవద్దు. “అని మా గురుదేవులు చెప్తుంటారు.నేను ఈరోజు అలా అతి గా దండించినందుకే నాకు ఈ ప్రమాదం జరిగిందేమో” అని నాకు అనిపించింది. రాత్రి పడుకునేపుడు “బాబా, ఎపుడూ లేనిది ఇలా ఎందుకు జారిపడ్డాను.నీ ఈ పనిష్మెంట్ నా ఏ కర్మ కి కారణమో నాకు తెలియజేయు” అని ప్రార్థించాను.. మరుసటి ఉదయం అంటే ఈరోజు సాయిమహారాజ్ సన్నిధి వాట్సాప్ ఛానల్ లో వచ్చిన పోస్ట్ చదువుతుంటే, నా అనుమానం నిజం చేస్తూన్న ఒక పోస్ట్(సాయి శరణనంద 33వ భాగం )కనిపించింది. దానిలో “శ్రీ కృష్ణ ప్రతిమ స్థానం లో విద్యార్ధి విద్యార్థినులు, అధ్యాపకులు కనిపించారు. మూల ప్రతిమ స్థానం లో కనిపించిన విద్యార్థి విద్యార్థినులు నేనేనని నువ్వు తెలుసుకోవాలని ఆ స్థానం లో వాళ్ళని కనిపించేలా చేశాను ” అని సాయి చెప్పిన విషయం వున్నది.అది చదివాక నాకు విషయం అర్థం అయింది.. “అందరిలోనూ సాయి వ్యాపించి వున్నారు. పాఠశాల విద్యార్తుల తో సహా.. వారి అల్లరి ని సున్నితం గా కాకుండా, వారు వినడం లేదనే కారణం తో అయినా వారిని దండించడం వారి లో వున్న సాయి ని బాధ పెట్టినట్లే అనే పాఠాన్ని నేర్చుకున్నాను.ఇక పై వారిని దండించవద్దని నిర్ణయం తీసుకున్నాను.రాత్రి పడుకుని లేచాక కూడా నిద్ర లో నా పక్క లో పట్టేసిన నొప్పి కూడా ఈరోజు అనుభవిస్తున్నాను.
తరువాత,ఈరోజు ఆదివారం కావడం తో రాపిడో బుక్ చేసుకుని కొంపల్లి లోని మా అక్క వాళ్ళింటికి బయలు దేరాను.బయల్దేరుతూ ఎప్పటి లాగానే సాయి నన్ను కాపాడు అని మొక్కుకున్నాను.మధ్యలో కి రాగానే ఆటో పంక్చర్ అయ్యి ఏదో శబ్దం తో సడన్ గా రోడ్డు పై ఆగిపోయింది.సాయి దయ వలన సరిగ్గా ఆ సమయం లో మా ఆటో వెనుక ఏ వాహనం లేనందువల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే హైదరాబాద్ వెళ్లే ఆ బిజీ దారిలో speed గా వెళ్తున్న వాహనాలు, సడన్ గా ఆగిపోయిన మా ఆటో ని గుద్దేసేవే.నా కర్మ నన్ను వెంటాడుతోన్నా నన్ను కాపాడిన సాయి కి కృతజ్ఞతలు చెప్పుకుని వేరే వెహికిల్ లో నా గమ్యం చేరుకున్నాను.
కర్మ అనేది చాలా సూక్ష్మ మైనది. సాయి చెప్పినట్లు పదునైన కత్తి అంచు మీద నడవడం లాంటిది. మన నడత లో ఏ చిన్న పొరపాటు వున్నా దాని కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. అందుకే సాయి తన భక్తులు ఏ చిన్న పొరపాటు చేసినా సహించడు. ఏ చిన్న తప్పు కూడా చేయని విధంగా సాయి తన భక్తులని సరిదిద్దుతాడు.ఒకవేళ తన భక్తుడు ఏదయినా పొరపాటు చేసినా దాని ఫలితాన్ని వెంటనే అనుభవించేలా చేసి తొలగిస్తాడు.మన జీవితం లో జరిగే ప్రతి సంఘటన లో సాయి మనకు నేర్పే పాఠం దాగి ఉంటుంది. ప్రతి నిమిషం ఆత్మ విమర్శ చేసుకుంటూ,ఏ చిన్న విషయం లో నయినా ధర్మం తప్పకుండా,మన కర్మ ల విషయం లో చాలా జాగ్రత్త గా ఉంటూ సాయి మార్గం లో మనం వెళ్తూ ఉండాలి. సూక్ష్మాతి సూక్ష్మం అయిన ధర్మ సూత్రాలని తెలుసుకుంటూ ఆచారిస్తూ ఉండడం శ్రేయస్కరం.అపుడే మన జీవితం శాంతి గా సుఖం గా సాయి నీడలో సాగిపోతుంది. జీవితం లో ఏ చిన్న తప్పు కూడా చేయని సూక్ష్మ బుద్ధి ని నాకు ప్రసాదించి, నన్ను సాయి సేవ లో ఉపయోగించుకొని ధన్యురాలిని చేయమని సాయి ని ప్రార్థిస్తున్నాను. జై సాయి దేవా 🙏
