సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

వెంట గా ఉండి గమ్యాన్ని చేర్చే సద్గురు సాయినాధుడు

ఓం శ్రీ సాయినాథాయ నమః

సాయీ అని పిలిచిన వెంటనే పలుకుతూ,తన భక్తులని అనుక్షణం రక్షించే సాయినాధుడి లీలలు తెలిపే గాధలు అంతటా మారు మ్రోగాలి..నా ఈ అనుభవం చాలా వివరంగా వ్రాస్తున్నాను, ఎందుకంటె ప్రతి నిమిషం సాయి ఉనికిని అద్భుతం గా అనుభవం లోకి తెచ్చింది, కాబట్టి ఆ క్షణాలలోని సాయి ప్రేమ ని, రక్షణ ని మీకు కూడా అనుభవం లోకి తెచ్చేందుకు ఈ నా ప్రయత్నం.నా అనుభవానికి వస్తే, మెదక్ లో టీచర్ ట్రైనింగ్ ఉండటం వలన మెదక్ వెళ్లాల్సివచ్చింది. తరచూ మాకు ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. కానీ నా కాలికి ఆక్సిడెంట్ వల్ల 4నెలల బెడ్రెస్ట్ తర్వాత అంత దూరం ట్రైనింగ్ కి వెళ్లాల్సి రావడం ఇదే మొదటిసారి. Ankle ligament tear ఇంకా పూర్తిగా క్యూర్ అవకపోవడం వలన బస్సు ఎక్కలేని పరిస్థితి. ఎక్కడకు వెళ్లినా car లో లేదా ఆటో లో వెళ్లాల్సివస్తోంది.అయితే నా car రిపేర్ లో ఉండటం తో మా colleagues వెళ్లే vehicle గూర్చి ప్రయత్నం చేసినా, వారి car లో place లేకపోవడం తో నేను బాబా తో ” బాబా, నేను వెళ్ళడానికి ఏదయినా వెహికిల్ఆ arrange చేస్తే ఈ అనుభవం భక్తులతో పంచుకుంటాను ” అని అనుకున్నాను. ఆశ్చర్యం గా మరు నిమిషం లో నాకు ఒక colleague call చేసి ట్రైనింగ్ కి car arrange అయింది అని వారి car లో ట్రైనింగ్ కి రావొచ్చు అని చెప్పాడు.వెంటనే బాబా కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.ప్రతి సమస్య లో, ప్రతి నిమిషం నువ్వు నాకు తోడు గా ఉండి నన్ను జీవితం లో ముందుకు తీసుకెళ్ళు సాయి అని మనసులో ఎపుడూ అనుకుంటుంటాను, దానికి తగినట్లుగా సాయి అనుగ్రహం చూయిస్తున్నారు.
మా colleague వాళ్ళు వేరే route నుండి వస్తుండటం తో నేను వారి car ని అందుకోవాలి అంటే మా ఊరికి కొద్దీ దూరం లో వున్న మరో ఊరి వరకు వెళ్లి వారి car అందుకోవాల్సి వుంది.ఆ ఊరికి వెళ్ళడానికి నేనుంటున్న ఊరి నుండి bus కానీ autos కానీ వెళ్లవు సాయి దయ వలన వెళ్లేప్పుడు ఉదయం ఒక ఆటో కష్టం గా దొరికిందికానీ ట్రైనింగ్ అయ్యాక తిరిగి వచ్చేప్పుడు కష్టం అయింది.ఆ మరో ఊరి వరకు drop చేసి వాళ్ళు వెళ్లిపోయాక నేను ఆ ఊరి సెంటర్ లో ఆటో కోసం వేచి చూస్తూ నిలబడ్డాను.సాయంకాలం అవడం, నేను చేరాల్సిన ప్రదేశం ఇంటీరియర్ అవడం వలన సాయంత్రం ఆటోస్ అక్కడికి రావు అని తెలిసింది.నా ముందు నుండే బస్ వెళ్తున్నా ఎక్కలేక చాలా సంకట పరిస్థితి లో అలా ఉండిపోయి బాబా ని తలచుకున్నాను ..” బాబా నన్ను క్షేమం గా ఇంటికి చేర్చు ఏదయినా వెహికల్ ని చూయించు. నువ్వు ఈ పరిస్థితి లో నా వెంటే ఉన్నట్లు నాకు కనిపించు “అని ప్రార్ధించాను.తరువాత అక్కడ wait చేస్తున్న ఆ సమయం లో నా ముందు నుండి వెళుతున్న వాహనాలపై రెండు సార్లు సాయి ఫోటో కనిపించింది కానీ అవి stickers రూపం లో ఉండటం తో నాకు అంత సంతృప్తి అనిపించక, బాబా నువ్వు సజీవం గా వున్న ఫోటో లో నన్ను చూస్తూ కనిపించు అనుకున్నాను.వెంటనే ఈసారి మా ఇంట్లో వున్న same ఫోటో తో, సరిగ్గా నా పక్కనుండి వెళ్తూవున్న వాహనం పై అందమయిన సాయి రూపం కనిపించి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. వెంటనే, ఆశ్చర్యం గా ఆటో,దాన్ని అనుసరిస్తూ దాని వెనుక మరో ఆటో ఆ రూట్ లో కొద్ది దూరం వరకు ప్రయాణం చేయడానికి దొరికింది. ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే “కొత్త గా ఆటో నేర్చుకుని ఆ ఆటో ని ఆ ఊరికి తీసుకెళ్తున్న తన బంధువుల అబ్బాయి ఆటోని ఈ ఆటో అతను వెంబడిస్తూ వెంట వస్తున్నాడు.నా కోసం సాయి ఆ పరిస్థితి ని కల్గించి ఆ ఆటో పంపినాడని తెలిసి ఆనందపడ్డాను.. ఇక ఆటో దిగాక, ఇంకా సగం దూరం వెళ్ళాలి, మళ్ళీ ఏంటి పరిస్థితి బాబా! ఎవరయినా మంచి వ్యక్తి lift ఇచ్చేలా చూడు అని సాయి ని తలచుకున్నాను. అప్పటికి చీకటి పడింది.ఒక కార్ వస్తుండటం తో కార్ ని lift అడిగాను.తను నన్ను చూసి ఆపి తను చేరాల్సిన గమ్యం వచ్చినా కూడా ,నేను ఒక్కదాన్ని వున్నాను అని గమనించి నా కోసం ఇంకా కొద్ది దూరం కార్ ని ముందుకు పోనిచ్చి నన్ను మా ఇంటి దగ్గర drop చేసి మరీ తిరిగి వెళ్ళాడు. దారిలో అతను నాతో “ఆ రూట్ మంచిది కాదని, ఆ దారిలో దారి దోపిడీ లు జరుగుతాయి అని , చుట్టూ అడవి ప్రదేశం కాబట్టి అలా risk ఎపుడూ తీసుకోవద్దు. రోజులు బాగా లేవని చాలా ఆప్యాయం గా మాట్లాడాడు.ఆ కార్ నాకు కనిపించకపోతే యే వాహన సౌకర్యం లేని ఆ దారిలో నేను ఇల్లు చేరడం చాలా కష్టం అయ్యేది.సాయే ఆ రూపం లో వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు అని అనిపించింది.ఇంటికి చేరుకొని సాయి ని చూసి ఏడ్చేసాను . ఇలా అడుగడుగునా సాయి నా వెంట వున్నాను అని నిదర్శనం గా చూయించాడు. సాయి దేవా!!ఎల్లప్పుడూ నీ రక్షణ చూయిస్తూ నా వెంట ఉండి నడిపించు తండ్రి!

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close