జై సాయి రామ్ !
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా నిర్హహించబడే సాయి కోటి మహా యజ్ఞాల్లో ,పరమ పావన సాయి నామములు నిక్షిప్తం చేస్తూ నిర్మించబడే సాయి కోటి మహా స్థూపము ల వద్ద, భక్తులు చవి చూస్తున్న సాయి లీలలు ఈ శీర్షిక న తెలుసుకుందాము.
సాయి మరియు పూజ్య గురుదేవుల అనుగ్రహం తో నిర్మించబడిన ఏలూరు లోని సాయి కోటి మహా స్థూపం వద్ద భక్తులు పొందిన మరికొన్ని అనుభవాలు గ్రహించగలరు .
జంగారెడ్డి గూడెం వారికి జరిగిన అనుభవము :
తన కుమారై తన భర్తను వదిలి రావటము, తన అల్లుడిని ఎలా ఒప్పించాలో తెలియని సందర్భంలో గత్యంతరము లేని పరిస్థితిలో బాబా వారి స్థూపం దగ్గరకు వచ్చి 11 సార్లు ప్రదక్షిణ చేసి తన కోరికను బాబా వారికి చెప్పుకొనటము, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి అతని అల్లుడి బంధువులు అమ్మాయిని ఆమె భర్తను కలుపుట జరిగినది.
జంగారెడ్డి గూడెంలోనే మరియొక అనుభవము: తమ కుమార్తెను తాడేపల్లి గూడెంలో బంగారు వ్యాపారము చేసుకునే , ఆర్థికముగా బాగానే వున్న వారికి ఇవ్వటము జరిగినది. కొంత కాలము కాపరము చేసిన తరువాత ఆమె అనారోగ్యము పాలు కావడము ..ఎంతో డబ్బు వెచ్చించి వైద్యము చేసిన తరువాత డాక్టర్ల సలహా పై రాజమండ్రి లోని పెద్ద హాస్పిటల్ లో జాయిన్ చెయ్యటము ..రోజు రోజు కు ఆమె నీరసించి పోవటము ..- అచట వున్న డాక్టర్లు ఆమె వ్యాధిని గుర్తించే పరిస్థితి లేకుండా పోవటము జరిగినది. ఆమె అంత్యదశకు చేరినట్లుగా భావించి ఆమెను రేపు ఉదయము “ఇంటికి తీసుకుని వెళ్ళమని ,చేసేది ఏమీ లేద”ని చెప్పటముతో ఆమె తల్లి బాబా వారిని స్మరించుకుని మన స్థూపమునకు 1008 సార్లు ప్రదక్షిణ చేస్తానని మొక్కు కోవటము.. అలా ఏడుస్తూ హాస్పిటల్ వరండాలో ఉంది. అప్పుడే ఒక విచిత్రము జరిగినది. అర్థరాత్రి సమయంలో గేటు దగ్గర వాచ్ మెన్ కునికిపాట్లు పడుతున్న సమయంలో ఎంతో తేజస్సుతో ఉన్న ముసలాయన ఆమె కుమార్తె వున్న గదిలో నుండి రావటము జరిగినది. తెల్లవారింది. డాక్టర్లు ఉదయము ఆమె మంచము వద్దకు వచ్చి ఆమెను పరిక్షించటము, పల్స్ హార్ట్ బీట్ నార్మల్ కు రావటము, డాక్టరు ఆశ్చర్యపోవటము జరిగింది. తరువాత నాలుగు రోజులలో ఆమెను ఆరోగ్యవంతురాలిగా ఇంటికి పంపటము జరిగినది. ఆమె యింటికి వచ్చిన మరునాడు వేసవికాలములో ఆమె తల్లి ఉదయము నుండి సాయంకాలము వరకు 1008 సార్లు ప్రదక్షిణ చేయటము కాళ్ళు బొబ్బలు ఎక్కినా సరే పూర్తి చేసింది.
విజయవాడ శ్రీ రామకోటేశ్వరరావుగారి అనుభవము :
ఎసిసి సమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన శ్రీ రామకోటేశ్వరరావు గారి విషయము – ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందముగా గడుపుతున్న ఆ దంపతుల జీవితములో ఆయన భార్యకు సుస్తీ చెయ్యటం.. పక్షవాతము లాగా శరీరములో ఏ భాగము నిలబడలేని స్థితిలో.. గురువు గారు ఇచ్చిన సలహాతో స్థూపము వద్దకు వచ్చి ఆమె భర్త మరి ఒకరి సహాయముతో ఆమెను మోసుకుంటూ ప్రదక్షిణ చెయ్యటము, కొన్ని రోజులకు ఆమెలో కొంత మార్పు రావటము, అలా తరువాత నెలలో కూడా ప్రదక్షిణ చేయించటము ఇలా కొంత కాలము తరువాత డాక్టర్లు యిక చికిత్స లేదు అన్న ఆమెను బాబావారు ఆరోగ్యవంతురాలిని చెయ్యటము. అలా వారు బాబా వారి ఆశీస్సులు అందగా అందుకు శ్రీ రామకోటేశ్వరరావు దంపతులు వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా నరసరావు పేట వద్ద గల ఆరేపల్లి ముప్పాళ్ల అను గ్రామములో మందిరమును స్తూపమును గురువుగారికే సమర్పించారు.
