అమ్ముల (పూజ్య గురుదేవులు )బోధించిన సాధనా మార్గాలు-6
1.పరోపకార, నీతివంత ఆలోచనలు మనిషికి మంచిఆరోగ్యాన్ని కూడ యిస్తాయి.
2. సర్వాన్ని కోల్పోయినా కూడ భవిష్యత్ మీద ఆశను కోల్పోరాదు.
3. పాపాలు చేసినవారు పుణ్యకార్యాలను చేయలేరు. వారిపాపాలే పుణ్యకార్యాలను అడ్డుకుంటాయి.
4. భగవంతుడగు షిరిడిసాయి సృష్టి అంతా వ్యాపించి, అన్ని వైపుల నుండి మనము చేయు పనులను చూచుచుండును.
శాంతి, ఆనందాలు మనిషికి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్చును యిస్తాయి.
5.జరుగుతున్న సంఘటనల నుంచే సత్యాలు గ్రహించాలి.
6.మనుషులందరిలో దైవత్వం వుంది. మంచిగుణాలు వున్నవారిలో అది బయట పడుతుంది.
7.కనిపించే ప్రపంచం ఒక నాటకరంగం. యిదంతా భౌతికమైన మరణంతో నశించేదే.
8. నమ్మిన మంచిని ఆచరించనిదే మనిషికి విలువ వుండదు.
9. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ ఒక ధర్మం.
10. జీవితాన్ని అన్నికోణాల నుంచి పరిశీలించాలి.
11. ప్రాపంచికజీవితాన్ని త్యాగం చేయటమే సన్యాసము.
12. ఆత్మశక్తి నెరిగినవారికి యిష్టమైనవి నశించవు. కావలసినవన్ని సృష్టించుకోగలదు ఆత్మ.
13. కష్టాలలో వున్నవారిని ఆదుకుంటే సాయి మనకష్టాలను రాకుండా చూచును.
14.ప్రతి అణువు నుండి సమస్తవిశ్వమంతా సాయి వ్యాపించి వుండును. అలా అంతటా వ్యాపించిన షిరిడిసాయి సర్వము చూసి తెలుసుకొనగలడు అని భయపడుచు ఎవరికి అన్యాయము చేయరాదు. ఇలా జీవించు వారు ఈజన్మలోను మరియు రాబోవు జనులలోను కూడా సుఖమును, ఆనందమును పొందును.
16.మానవులు సోమరితనం వదిలివేసి, చెడ్డపనులను వదిలి వేసి శుభకర్మలనే ఎప్పుడూ చేయుచుండవలెను. మంచి పనులు చేయుట వలన దీర్ఘాయుషు కలుగును. మంచిపనులు చేయుటతో పాటు చెడ్డపనులను పూర్తిగా వదిలి వేయవలెను.
17. మనసులో ఒకటి, మాటలలో యింకొకటి, పనులు చేయు నపుడు యింకొక విధముగా ప్రవర్తించువారే రాక్షసులు, పిశాచులుగా భావించబడుదురు. అలాంటి వారికి ఎప్పుడూ ఆనందము వుండదు. దు:ఖములే కలుగుతూవుంటాయి.
18. మనస్సులో వున్న దానినే మాటలలో చెప్పుచూ, మాటలలో చెప్పిన దానినే చేతలలో చూపుతూ కపటము లేనివారే “దేవతలు”.
19.మంచిగా జీవిస్తూ షిరిడిసాయిని నమ్మి జీవిస్తే మన జీవితాన్ని సాయే నడుపుతాడు.
20. ఓర్చుకోవటమనే గుణం – చేసిన తప్పులను సరి చేస్తుంది.