సాయిరాం. సాయి బంధువు .కాశి విశ్వేశ్వర రావు గారి అనుభవాలు
సాయిరాం తో నా అనుభవాలు
“కాశి విశ్వేశ్వరరావు, ప్రతాపనగర్, కాకినాడ అను నేను ప్రస్తుతము నెల్లూరు జిల్లా పరిషత్ లో లేక్కల అధికారిగా పని చేయు చున్నాను. నాకు గురువు గారితో హైదరాబాదు లో శ్రీ అమ్ముల శివరామక్రిష్ణ గారి ఇంట్లో వ్రతము జరుగు సందర్భమున పరిచయ భాగ్యము కలిగినది. ఆ పరిచయములో వారు శ్రీ సాయి బాబా గురించి చెప్పిన విషయములు నన్ను బాగా ఆకర్షించి ,నాలో శ్రీ సాయిరాం సేవ చేయవలెననే కోరిక కలిగినది. అప్పటి నుండి నా శక్త్యానుసారం గా సాయిరాంను సేవించుచూ సమయము దొరికినప్పుడల్లా గురువుగారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుచున్నాను.
తదుపరి నేను సాయిరాం సేవ చేయుట మొదలు పెట్టిన తరువాత ఒక రోజున సాయిరాంని మనసులో తలచుకొని నాకు ఎప్పటి నుండో ఉన్న షుగరువ్యాధి తగ్గాలని, మందులు మాని సాయిరాం విభుధినే మందుగా వేసుకొంటానని ప్రార్ధించాను. రెండు మాసముల తరవాత చూచు కుంటే షుగరు వ్యాధి పూర్తిగా పోయినదని డాక్టర్లు చెప్పినారు.మరి కొంత కాలం తరువాత నా మూడవ కుమారుడు బి. టెక్ చదివి ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నాడు ఆ సమయములో సాయిరాంని నా కుమారునికి ఉద్యోగం వచ్చులాగున చేయ మని ప్రార్ధించి నాను. అటు పార్ధించిన రెండు మాసములలో రైల్వేలో సాయి రాం దయవలన ఉద్యోగము వచ్చినది. సాయిరాం దయవలననే తూర్పు గోదావరి జిల్లా సాయి సేవాశ్రమము ఏర్పాటు చేసిన సందర్భములో నాకు కూడా కమిటిలో సభ్యత్వము కలగ చేసినారు. నిత్య జీవితంలో కూడా ఏవైనా ఇబ్బందులు కలిగినపుడు వెంటనే శ్రీ సాయిరాంని ప్రార్ధించుకొన గానే ఆ యిబ్బందుల నుండి బయటపడుచున్నాను. నాకు సాయినాధుని గూర్చి తెలియ చేసి, నన్ను సాయి సేవకునిగా మార్చిన పూజ్య నాలో ? గురువు శ్రీ అమ్ముల సాంబశివరావు గారికి సదా నేను రుణ పడి వుంటాను.”