శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ కి బాబా తో గల అనుబంధం


12647341_1120296437988669_2027168517256352385_nశ్రీ మోరేశ్వర్ ప్రధాన్ కి బాబా తో గల అనుబంధం

మోరేశ్వర్ ప్రథాన్

మోరేశ్వర్ ప్రథాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. నానాసాపాట్ చందోర్కర్ కీ యితని కుటుంబంతో చాలా సన్నిహితమైన స్నేహముండేది. అతడు తరచు వీరింటికి వస్తుండేవాడు. అతనివల్లనే ఆ కుటుంబమంతటికీ సాయిబాబా గురించి మొదట 1910లో తెలిసింది. ఒకసారి ప్రథాన్ అన్నగారు నానా చందోర్కర్తో మాట్లాడుతూ, “ప్రస్తుతం శ్రీ అక్కల్కోట మహరాజ్ వంటి మహనీయులెవరైనా వున్నారా?” అని అడిగాడు. సాయిబాబా అలాంటి మహనీయులేనని చెప్పి వారి మహిమను చందోర్కర్ వివరించాడు. అది విని ఆ కుటుంబంలో చాలామంది ఆ మరురోజే శిరిడీ వెళ్ళారు. కాని మోరేశ్వర్ ప్రథాన్ మాత్రం పూర్తిగా విశ్వసించలేకపోయాడు. అయినప్పటికీ తన వాళ్ళందరూ శిరిడీ నుండి రాగానే తన సోదరుని వద్దనుండి బాబా పటం, బాబా గురించి దాసగణు వ్రాసిన అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించాడు. అంతటితో ఆ దంపతులిద్దరికీ ఆయన పై విశ్వాసం కుదిరి కొద్దికాలం తర్వాత అతడు శిరిడీ దర్శించాడు.IMG_20200325_171234

ఆ వివరం అతడే యిలా వ్రాశాడు :

“మొదటిసారి నేనొక్కడినే శిరిడీ బయలుదేరాను. అపుడు నాతో మూడు లేక నాలుగు బంగాలు నాణాలు (‘గినియా’). కొద్ది నోట్లూ తీసుకున్నాను. బాబా దక్షిణ కోరితే యివ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయి నాణాలు తీసుకున్నాను. మేము శిరిడీ చేరేసరికి, మాకోసమే ఎదురుచూస్తున్నారా! అన్నట్లు బాబా లెండీవద్ద నిలబడివున్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాము. తరువాత మేము వాడాలో సాటే, నూల్కర్ మొన వారితో కలిసి బస చేశాము. తరువాత కొద్ది సేపట్లో నేను పండ్లు, పూలు తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాకు సమర్పించాను. వారి ముఖంలోకి, కళ్ళలోకి చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడనిపించింది. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకొన్నాను. వెంటనే బాబా నన్ను దక్షిణ కోరారు. మొదట నేను అనుకొన్నట్లు వారికి వెండి రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారునాణెం వారి చేతిలో పెట్టాను. బాబా ఆది తీసుకుని తమ అరచేతిలో ఒకసారి బొమ్మ; మరొకసారి బొరుసు అని పైకి వుండేట్లు మూడుసార్లు తిప్పి చూస్తూ ప్రతిసారీ నూల్కర్‌ను ‘ఇదేమిటి?’ అని అడిగారు. ‘దీనిని “గినియా” అంటారు’ అన్నాడు నూల్కర్. ఆయన • దీని విలువెంత?’ అన్నారు. అతడు, రు.15/-లు అని చెప్పారు. అపుడు బాబా దానిని తిరిగి యిచ్చి ‘ఇది నాకు వద్దు, యిది నీవద్దే వుంచుకుని నాకు రు. 15/-లు యివ్వు’ అన్నారు. నూల్కర్ సలహా ప్రకారం దానిని ప్రసాదంగా దాచుకొని పదిహేను వెండి రూపాయి కాసులు యిచ్చాను. బాబా వాటిని తిరిగి తిరిగి లెక్క పెడుతూ, ‘ఇవి పది రూపాయిలే! ఇంకా అయిదు రూపాయిలివ్వు’ అన్నారు. నిజానికాయన నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. వృత్తిరీత్యా వాదించడానికి అలవాటుపడ్డ నేను వాదిస్తానోలేదోనని చూస్తున్నారు. నేను సంతోషంగా వారికి మరో అయిదు రూపాయలిచ్చాను . నేను వారికి మొదట సమర్పిందలచినది రు. 20/-లు అని తెలిసే వారలా అన్నారు. నావద్ద డబ్బున్నా ఆయనింకేమీ అడగలేదు. అపుడు నేను బసకు వెళ్ళిపోయాను.

తరువాత నేను వారిని దర్శించినపుడు ఆయన తమ చుట్టూ చేరిన భక్తులకు ఉదీ యిస్తున్నారు. దూరంగా నిలుచున్న నన్ను జూచి దగ్గరకు రమ్మని సైగచేసి, భావూ, రెండు లేక నాలుగు రోజుల్లో అంతా బాగైపోతుందిలే! అని చెప్పి, నాకు ఉదీ యిచ్చారు. అది తీసుకుని నేను వచ్చేశాను. నాపట్ల వారి ఆదరణ చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నూల్కర్, శ్రీమతి జోగ్ నా వద్దకొచ్చారు. నూల్కర్ సంతోషంతో నన్ను కౌగలించుకున్నాడు. బాబావద్ద నాకంత ఆదరణ లభించడానికి నేనేగ్రంథ పారాయణ చేస్తానని అడిగింది శ్రీమతి జోగ్. నేను ప్రత్యేకంగా ఏమీ చేయనని చెప్పాను. నేను ఆ మరురోజే తిరుగు ప్రయాణానికి సెలవు కోరితే, ‘ రేపు వెళ్ళు’ అన్నారుగాని, అలానే బాబా నన్నక్కడ ఎనిమిది రోజులుంచేశారు.

మరురోజు నేను బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటుచేస్తూ దానికి ఎవరిని పిలవాలో, ఏ వంటకాలు సిద్ధంచేయాలో వారిని అడిగాను. బాబా, “పూర్ణపు పోలీలు చేయాలని, అతిథిగా బాబును ఆహ్వానించాల”ని చెప్పి, నేను వారిని పిలువకముందే  నేనుగూడా వస్తానుఅన్నారు. మరురోజు వడ్డన చేస్తూ బాబాకని ఒక ప్లేటులో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి అందులోని పోలీ తీసుకుపోయింది. ఆ రూపంలో బాబాయే వచ్చారని, అందరూ సంతోషంతో జైకొట్టారు. 

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close