సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

సాయి కృప తో కోరుకున్న డిజైన్ తో ఏర్పాటు అయిన వెబ్సైటు లోగో

శ్రీ సాయినాథాయ నమః

సాయినాధుడు తన భక్తులని ఎప్పుడూ నిరుత్సాహపరచడు. వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా వారి మనసులోని కోరికలను, ఇష్టాలను గమనిస్తూ వారిని ఆనందపరిచే సాయినాధుడికి జయము జయము.

నేను గత మూడు రోజుల నుండి మన saisannidhiblog.com వెబ్సైటు లొ ప్రచురించబడే పోస్ట్స్ కి watermark కోసం లోగో డిజైన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను.లోగో ఏర్పాటు విషయం లొ నాకు కొన్ని ప్రత్యేక ఇష్టాలు వున్నాయి .ఈ సందర్బంగా నా సాయి భావాలు మీతో పంచుకుంటాను..సాయి నాధుడు అంధకారంలో మునిగిన నా జీవితం లొ వెలుగులు నింపే సూర్య భగవానుడి గా భావిస్తూ , ఆ సాయిసూర్య దేవుని శరణాగతి చెంది తన అనుగ్రహం కోసం పరితపించే sunflower గా నన్ను నేను భావించుకోవడం నాకు గొప్ప అనుభూతి ని ఇస్తుంది.అందుకే మన వెబ్సైటు లొ సూర్యోదయం, sunflowers ని theme లొ చేర్చడం జరిగింది. Watermark logo కోసం కూడా ఈ కాంబినేషన్ లొ అంటే సాయి సూర్యుని ముందు sunflower ఉండేలా ఒక sticker image ని create చేయాలి అని మూడు రోజుల నుండి చాలా ప్రయత్నిస్తున్నాను.దానికయి free Apps లోనే ప్రయత్నం చేద్దాం అనుకొని నిశ్చయించుకున్నాను.బాబా తో logo విషయం లొ నా ఇష్టాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకుని సహాయం కోసం ప్రార్ధించాను. ” ఒకవేళ సూర్యుడి కోసం తపన పడే sun flowers గా మమ్మల్ని భావించుకోవడం, ఈ విషయం బాబాకి ఇష్టం అయితే దాన్ని ధ్రువీకరిస్తూ ‘సాయి , సాయి చెంత రెండు sunflowers వుండే డిజైన్ ని నేను స్వంతం గా రూపీందించేలా అనుగ్రహించాలి. దానికోసం paid Apps కాకుండా, free Apps లోనే నేను ఆ డిజైన్ ని create చేయగలగాలి, అపుడే సాయి అనుగ్రహం వుంది అనుకొంటాను ” అని కోరుకున్నాను.దీనికోసం CANVA లొ గత మూడు రోజులనుండి ప్రయత్నిస్తున్నాను . అయితే ఎంత కష్టపడినా సాయి ఫోటో కి దిగువన sunflowers ఇమేజ్ చేయలేకపోయాను.. ప్రయత్నించగా స్టికర్లా కాకుండా ఒక ఫోటో లా డిజైన్ ఇలా వచ్చింది

ఇది sticker లా కాకుండా ఒక ఫోటో లా వచ్చి watermark లా అనిపించదు. ఫోటో ని sticker లా మార్చడానికి try చేస్తే background flowers miss అయిపోతోంది.ఇక ఈరోజు చాలా అసంతృప్తి అనిపించింది, నేను ఇష్టపడ్డట్లు రాలేదు అని.ఈరోజు మళ్ళీ ప్రయత్నిస్తుంటే బాబా నాకే ఐడియాస్ తట్టేలా చేసి స్టెప్ బై స్టెప్ నేను అనుకున్న డిజైన్ ని నాకు అందించారు.. దీనికయి ముందుగా flowers ని విడిగా స్టికర్ చేసి ఆ తరువాత వివిధ elements, effects నాచే ఉపయోగింపచేసి చివరికి ఇలా నేను మనసులో ఊహించి పెట్టుకున్న డిజైన్ ని రూపొందించారు.watermark కోసం ఏ plugin instal చేయాలి, Watermark post లొ చిన్న size తో ఒక corner కి రావాలి అంటే plug in settings లొ ఏ changes చేయాలి అని ఈ విషయం లొ నాకు కొంచెం కూడా పరిజ్ఞానం లేకపోయినా సాయి తల్లి లా నా కోరిక తెలుసుకుని నాకు ఆ విధానం అంతా ఐడియా తట్టేలా చేస్తూ అంచలంచెలుగా నాచే చేయించారు.ఈవిధం గా నన్ను అనుగ్రహించారు.అలా సాయి కృప తో ఏర్పాటు అయిన website watermark మీరు ఈ ఫోటో లొ చూడవచ్చు. Thank you baba 🙏.

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close