నానా సాహెబ్ రాసనే

నానా సాహెబ్ రాసనే36969158_2092060921057322_8476404196751441920_o
దాస గను కి ఇద్దరు భార్యలున్నప్పటికీ అతనికి సంతానం కల్గకపోగా , అతడు బాబా శరణు పొంది సంతానము ని పొందిన లీల మనము సాయి సచరిత్ర లో తెలుసుకున్నాము . బాబా అనుగ్రహం తో జన్మించిన శ్రీ నానా సాహెబ్ రాసాననే గారి జీవితం లో ని బాబా చూపిన లీల తెలుసుకుందాము.

నానా ని తండ్రి దాసగణు ఎపుడు షిరిడి వెళ్లినా వెంట తీసుకుని వెళ్ళేవాడు . ఏడు సంవత్సరాల వయసులో అలా ఒకసారి నానా తన తల్లి తో కలిసి షిరిడి కి వెళ్తాడు. ద్వారకామాయి లో బాబా దగ్గర కి వెళ్ల్లి కూర్చుంటారు.నానా తల్లి తనని బాబా పాదాలకి మాలిష్ చేయమని ఆజ్ఞాపిస్తుంది. అలాగే నానా భక్తి తత్పరత తో బాబా పాదాలకి మాలిష్ చేస్తుంటాడు .అపుడు భక్తులు బాబా కి మిఠాయిలు, పళ్ళు మొదలయిన రుచికరమయిన పదార్థాలు సమర్పిస్తుంటారు. అయినా నానా తన చిత్తం బాబా పాదాలపయినే ఉంచి సేవ చేస్తుంటాడు. తన దృష్టి బాబా పాదాలపయినుండి ఆ పదార్థాలు పయి పోయిందేమోనని భ్రమ పడి తల్లి నానా ని మందలిస్తూ ఒక దెబ్బ వేస్తుంది. ఇలా అయితే నువ్వు ఎందుకు పనికి రావు అంటూ తిడుతుంటుంది . బాబా కల్పించుకుని , “తల్లీ అనవసరం గా నీ బిడ్డ ని కొడతావెందుకు? వాడు పెద్దయ్యాక నా కోసం చాలా పనులు చేస్తాడు.” అని అంటాడు. (బాబా మాటలు భవిష్యత్ లో నిజమయ్యి , బాబా సమాధి అనంతరం బూటీ మరియు ధుమాళ్ ద్వారా ఏర్పడ్డ ట్రస్ట్ లో నానా ట్రస్టీ గ నియుక్తులయ్యారు. ట్రస్టీ గా తన బాధ్యత ని సమర్థవంతం గా నిర్వహిస్తాడు.)

దాసగణు ప్రతి విషయం లో బాబా సలహా అడిగేవాడు . అలాగే నానా వివాహ విషయం లో వచ్చిన నాలుగు సంబంధాల ని బాబా వద్ద పెట్టగా బాబా ఎక్కువ కట్నం తెచ్చే సంబంధం పక్కన పెట్టి , సుందరీ భాయి అనే పేదరాలిని నానా కి భార్య గా నిర్ణయిస్తాడు . నానా కి యిద్దరు పుత్రికలు ఒక పుత్రుడు జన్మించి కొన్ని మాసాల్లోనే వ్యాధి బారిన పడి మరణిస్తారు . నానా చాలా దుఃఖితుడవుతాడు. ఒకరోజు బాబా స్వప్నం లో అతనికి కనిపిస్తాడు . అధిక తేజోవంతమయిన సూర్యుడి లాంటి గోళం లో బాబా కూర్చుని ఉంటాడు బాబా వోడి లో ఒక పసివాడి మృత దేహం ఉంటుంది. అపుడు బాబా నానా తో “నీ పుత్రుడు మరణించాడని నువ్వు విలపిస్తున్నావు కదా, వీడు మూలా నక్షత్త్రం లో పుట్టాడు. జాతకం ప్రకారం మూలా నక్షత్రం లో పుట్టిన వారు తల్లిదండ్రులకి చాలా కష్ట నష్ట కారకులవుతారు. అందుకే వీడిని నేనే తీసుకెళ్తున్నా.నువ్వు చింతించవద్దు, నీకు ఒక అందమయిన ఆరోగ్యవంతుడయినా పుతృడిని ఇస్తాను .” అని బాబా నానా ని ఒద్దారుస్తాడు . అలాగే కొన్ని మాసాలకి తన కి ఒక పుత్రుడు జన్మిస్తాడు.37054910_2011670402184597_3005695663670296576_n.jpg

1927 లో నానా జీవితం లో ని దుర్ఘటన ల వళ్ళ మానసిక శాంతి ని కోల్పోయి అనారోగ్యవంతుడవుతాడు అలాంటి స్థితి లో నూ ప్రతి ఆదివారం శివాలయం కి వెళ్తుంటాడు(నానా ఏ దేవుడిని, సాధువు ని దర్శించినా వారిలో సాయి ని చూసుకునేవాడు.) . ఒకసారి ఆ శివాలయం కి వెళ్లగా , శివుడి ప్రతిమ లో ఒక కాంతి కనిపించి దానిలో బాబా దర్శనం ఇస్తాడు.ఆ దర్శనం తో అతను శాంతి పొంది స్వస్థుడవుతాడు . అదేరోజు రాత్రి బాబా అతనికి స్వప్నం లో దర్శనం ఇఛ్చి , ” నిన్ను నీవు సంపూర్ణం గా నాకు దక్షిణ గా ఇచ్చుకో అని అడుగుతాడు . అపుడు నానా సమ్మాతిస్తాడు. ఆ తర్వాత అతని లో భౌతిక విషయాసక్తి పూర్తిగా నశించి సంపూర్ణం గా బాబా కి అంకితమవుతాడు.
జీవిత చివరి రోజుల్లో నానా షిరిడి లో సాటేవాఁడా లో ఉండసాగాడు.1985 లో నానా తన దేహాన్ని చాలించాడు

Leave a comment

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close