సాయి దేవాయనమః
సాయి బంధువులందరికీ సాయిరాం . ఈరోజు సాయి మనందరి కోసం జన్మించిన రోజు, సెప్టెంబర్ 28 , 1835 . పత్రి అనే గ్రామం లో, శివ పార్వతుల భక్తులయిన గంగా భవాజ్యుడు, దేవగిరియమ్మ అనే పుణ్య దంపతులకి సాయి జన్మించడం జరిగింది.
బాబా తన జీవితం మొత్తం తనను నమ్ముకున్న వారిని ఉద్దరించడానికి అహర్నిశలు శ్రమించారు. తాను సమాధి చెందిన తరువాత కూడా శరీరం తో వున్నప్పటికన్నా ఎక్కువ గా తన లీలలు మహిమలు చూయిస్తూ అశేష ప్రజా వాహినిని తన పాదాల చెంతకు రప్పించుకుంటున్నారు. మనం తనని మరిచిపోయినా తాను మనల్ని మరువక తన ఉనికి ని మనకి ఎప్పుడూ అనుభవింపచేస్తున్నారు అప్పుడూ , ఇప్పుడూ , ఎల్లప్పుడూ . అందుకే సాయి ప్రభంజనం వాడ వాడ లా వెల్లువయి ప్రవహిస్తోంది. ఎటు చూసినా బాబా నామమే, బాబా గుళ్ళే వున్నాయంటే యింకా కొన్ని సంవత్సరాల్లో సాయి యుగం , సాయి రాజ్యం తప్పక వస్తుంది అని మా నమ్మకం. మరి మనమందరం సాయి సైనికుల్లా గా సాయి సామ్రాజ్యం లో మన శతృవులయిన ఈర్ష స్వార్ధం ద్వేషం లాంటి మాయ జనిత గుణాల పై పోరు సాగిద్దాం.ఈ పోరు లో బాబా సహాయం కోరుదాం . భక్త వత్సలుడయిన సాయి తప్పక మాయ ని ఎదురించే మన యుద్ధం లో సహాయం అందిస్తాడు. మన ని ప్రతీ క్షణం మాయ కోరలకి చిక్కకుండా కాపాడుతుంటాడు. కావాల్సిందల్లా మన జీవితం లో ప్రతీ క్షణం బాబా నేర్పించే విషయాలను సరయిన దృష్టి తో వెంటనే గ్రహించి మన మనసులో శాశ్వతంగా పదిల పరచుకోవడమే. తన భక్తుడిని ఈర్ష స్వార్ధ అరిషడ్వార్గాలకు అతీతం గా తీర్చి దిద్దడం లో సాయి ని మించిన గురువు మనకిక దొరకరు. సాయి మనలని అనుక్షణం గమనిస్తూ మనం ఏదయినా తప్పు లేదా పొరపాటు చేస్తుంటే పక్కనుండి మనకి నేర్పించే పాఠాలు అమోఘమయినవి .
ఈరోజే నాకు జరిగిన ఒక అనుభవం చూడండి. నేను టీచర్ గా పనిచేసే స్కూల్ నుండి స్కూల్ అయ్యాక బయటికొస్తున్నాను. చాలా వర్షం ఉండటం తో మా colleague కార్ లో డ్రాప్ చేస్తాననడం తో సరే అని స్కూల్ బయటకి వచ్చి కార్ ఎక్కుతున్నాము. నాతో వున్న ముగ్గురు ఎక్కాక చివరగా నేనే యెక్క బోతున్నాను. అక్కడే, వాళ్ళ అమ్మాయి అయిన యింకో టీచర్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ వర్షం లో తడుస్తూ బైక్ పై వున్నాడు. నన్ను “మా అమ్మాయి ఎక్కడుంది” అని అడుగుతున్నాడు. నేను వర్షం లో తడవకుండా వుండడానికి కరెక్ట్ గా కార్ ఎక్కడానికి తొందర పడుతున్న క్షణం లోనే ఆయన అడగడం వల్ల, నేను వాళ్ళ అమ్మాయి ని స్కూల్ బయట ఆగి ఉండడం చూసినా కూడా ఆయనకి సమాధానం చెప్పక , నేను ఎక్కడానికి వీలుగా నా handbag పట్టుకోమని కార్ లో కూర్చున్న వారికి చెప్తున్నాను. నా మాట రెండుసార్లు వారు కూడా వినిపించుకోక మూడవసారి విని నా హ్యాండ్ బాగ్ తీసుకోవడం జరిగింది. మనసులో ఏంటీ ఇన్నిసార్లు చెప్తున్నా స్వార్థం తో వినిపించుకోరే , అని మనసు కాస్త చివుక్కుమంది. తర్వాత ఇంటికెల్లాక నాకు విషయం అర్థమయ్యింది. రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మాయి ఎక్కడ అని వర్షం లో తడుస్తూ నన్నుఅడుగుతున్న ఆ 75 ఏళ్ళ వృద్ధుడిని పట్టించుకోక ,నేను మాత్రం తడవద్దనే స్వార్ధం తో అలాగే సమాధానం చెప్పకుండా కార్ లో వెళ్లిపోయానే. అని చాలా బాధ కల్గింది . నేను ఆయన మాట కి సమాధానం చెప్పకుండా వున్నప్పుడు ఆ వ్యక్తి కి ఎంత బాధవుతుందో తెలియ చెప్పడానికే నాకు మరుక్షణం లోనే బాబా ఆ అనుభవం, కాదు పాఠం ఇచ్చ్చారు. స్వార్ధం మనిషిని ఎంత దిగజారుస్తుందో చెప్పలేము.నా మాట విననట్లు మా కొలీగ్స్ వున్నప్పుడు ఆ బాధ ఏంటో నాకు అర్థం అయ్యేలా చేశారు సాయినాథుడు. ఒకవేళ నేను తడిసిపోయినా సరే ఆయనకి కావాల్సిన సహాయం చేసి ఉంటే, ఇంటికొచ్చాక నాకు ఈ ఆవేదన ఉండేది కాదు. తనకి సహాయం చేశానన్న సంతృప్తి మనసులో ఉండేది.
అందుకే అండీ, మాయా గుణాలు మనలో వున్నాయనే సంగతే మనకి తెలియదు మనం మనల్ని మనం పరిశీలించుకునే వరకు. పరోపకారం లో ఉన్న ఆత్మ సంతృప్తి చాల విలువయినది. ఒకరిని బాధిస్తే అది మనలని దహిస్తుంది. . ఇలాంటి పాఠాలు మనకి అనుక్షణం బాబా మనకి బోధిస్తుంటారు. ఒక బాధ్యత గల శిక్షకుడిలా మనల్ని దండించి మరీ మనం ఆ పాఠాలను వంట బట్టించుకొనేలా చేసి మనలను కలి మాయ నుండి కాపాడే సాయి కన్నా మనకు ఎవరు మిన్న?
ఈ సాయి జన్మదినం సందర్భంగా ఈరోజటి నుండే మన ప్రవర్తన ని మనకు మనమే అనుక్షణం పరిశీలించుకుని ఆత్మ విమర్శ చేసుకుని బాబా చెప్పిన మార్గం లో మనం వున్నామా లేదా కాస్త పక్కకి వెళ్తున్నామా అని గమనించుకోవాలి, మన నడవడి ని సరిదిద్దు కోవాలి, సాయి కి ఇష్టమయిన భక్త బృందం లో మనమూ చేరిపోవాలి మన సత్ప్రవర్తన తో. అప్పుడు సాయి మనకివ్వలేని నిధి లేదు. ఆ నిధే ఆధ్యాత్మిక నిధి. భౌతిక కోరికల నిధి కాదు. అది ఎందుకు పనికి రానిది, ఏనాటికయినా మనలను వీడిపోని సాయి ప్రేమ లో మనమంతా తడిసిపోవాలి..సాయి అనురాగ అనుగ్రహాల వెచ్చదనం లో హాయి పొందాలి.. సాయి వోడి లో, మన జీవిత గమనం లో ఎదురొచ్చే కర్మ అలజడులనుండి సేద తీరాలి ఒక చిన్న పాప లా మారి. శిశువులు తమకేమి తెలియని బేలతనం తో వారి తల్లి ని మాత్రమే నమ్మి ఉన్నట్లు, మనం అలా శిశువు లాంటి మనసుతో సాయి చేయి ని విడువక సర్వస్య శరణాగతి తో సాగిపోదాము,. జై సాయి రామ్