సాయిరాం. ఈ క్రింది లీలని సాయి బంధువు మాధవి గారు తనకు తెలిసిన సాయి లీల గా పంపడం జరిగింది. వారి కార్యాలయం లో పని చేసే సదాశివ అనే అబ్బాయి కి జరిగిన అనుభవం ఇది. మొన్న మనమందరమూ చంద్రునిలో బాబా దర్శనం తో ఆనందించాము. ఆ దర్శనం తనకు అవలేదని బాధపడుతున్న ఈ అబ్బాయి ని బాబా అనుగ్రహించిన తీరు చదవండి అతడి మాటల్లోనే ,..
“సాయి బంధువులందరికి ” సాయి రాం”.నేను సదాశివ. నాకు మొన్న జరిగిన బాబా లీల మీతో పంచుకోవాలని రాస్తున్నాను.బాబా లీలలు.అద్భుతం.అనంతం.అతీతం.నా లాంటి చదువు రాని వాళ్ళు వాటిని చెప్పడం కూడా కష్టం. ఈ మధ్యన చంద్రునిలో సాయి బాబా కనపడ్డారని అందరూ అంటూ ఉంటారు.మాధవి మేడం కూడా ఒకరోజు రాత్రి ఫోన్ చేసి”సదాశివ,చంద్రునిలో బాబా కనపడుతున్నరు.. చూడు” అని చెప్పారు.నేను వెంటనే రాత్రి 10 గంటలకు చూసాను.నాకు ఏమి కనపడలేదు.ఒక్క గంట చూసాను.ఏమి కనపడలేదు.ఇంతలో మా ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇదేమాట చెప్పారు. నేను” నాకు ఏమి కనపడటం లేదు” అని చెప్పాను.ఇంక రాత్రి మొత్తం నాకు నిద్ర రాలేదు.” అందరికి కనపడుతున్న బాబా,నాకు ఎందుకు కనపడటం లేదు,నేను ఏమి తప్పు చేశాను,నా నమ్మకం లో ఏమన్నా లోపం ఉందా” అని ఒకటే దుఃఖ పడినాను.ఎక్కడ నా మనసు ఆగలేదు.చాలా దుఃఖం గా వుండినది.తరువాత రోజు మేడం కు చెప్పాను .”అరే, సదా..ఎందుకు టెన్షన్ పడతావు, బాబా ఏదో విధంగా నీకు దర్శనం ఇస్తారులే” అని చెప్తూనే వున్నారు.
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాను.భోజనం చేసి నా దుకాణం( ఒక లేడీస్ కార్నర్) లో పోయి కూర్చున్నాను.మనసులో అలాగే వేదనగా ఉంది.ఈరోజు రాత్రి తప్పక చంద్రునిలో నాకు బాబా కనపడాలి ,అని రాత్రి ఎప్పుడు అవుతుందా,అని ఎదురుచూస్తున్న. ఇంతలో మా శంబల్పూర్ లో చాలా జోరుగా వాన పడింది. వాన నీళ్లు నా దుకాణం ముందు నుంచి ఒక నది లా ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్ల లో ఒక పెద్ద banner మడతపెట్టి ఉంది. అది నా దుకాణం ముందు ఆగిపోయింది.ఎక్కడనుంచి వచ్చిందో తెలీదు. వెంటనే నేను ఆ వాన నీళ్ల లోనే వెళ్లి చెయ్యిపెట్టి తీసాను.నా దుకాణానికి వెళ్లి దాన్ని తీసాను.చూసి ఆనందం పట్టలేక పోయినాను.అది ఒక పెద్ద బాబా ఫోటో..వాన నీళ్లలో ఎలా వచ్చిందో,బాబా కె తెలియాలి.నాకు ఆ క్షణం లో అనిపించింది ,” సదా,ఎక్కడో నేను చంద్రుడిలో ఉన్నానని,నీకు కనపడ లేదని ,నీవు బాధ పడుతున్నావు,ఇదో, చంద్రునిలోనే కాదు,నీళ్లలో కూడా నేనే వున్నాను,పంచభూతాలలో నిండి నిబిడీకృతం అయిన నన్ను ,నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు” అన్నట్లు అనిపించింది.వెంటనే నా మనసు కుదుటపడింది.ఆ స్వామి పాపం,నా కోసం ఎక్కడనుంచి యిలా వాన నీళ్లలో ప్రకటమయ్యారు.”.
“ఓం సర్వాంతర్యామినే నమః” సర్వ వ్యాపి,సర్వశ్రేష్ఠ,సత్ చిత్ అనంతం,ఆనందం ఆయన రూపం. సర్వం సాయిమయము “