బాబా వాక్కు ఫలం 

 

13124565_1182925031725809_9162158387561173994_n

విజయవాడ లో బాబా వారి మందిరం కట్టించిన, డాక్టర్ శ్రీమతి ఉషారాణి గారి అనుభవం !

బాబా వారి మందిరం విజయవాడ లో డాక్టర్ శ్రీమతి ఉషారాణి గారు నిర్మింప చేసారు. బాబా వారి లీల వారి మాటల్లో తెలుసుకుందాము .

“1988వ సంవత్సరములో నేను (నా మూడవ కుమారుడు సాయికృష్ణను) గర్భిణితో ఉన్నాను. నాకప్పుడు 5వ మాసం. ఒక రోజు బాబా వారు మా యింటికి వచ్చి, మా మంచం పై కూర్చొని ” నేను ఇటుగా వెళ్ళుతూ మిమ్మల్ని చూచి వెళ్ళదామని వచ్చాను” అన్నారు. అప్పుడు వారితో నేను “బాబా నాకు కూతురు కలిగేలా ఆశ్వీరదించు” అన్నాను. వారు “పుడుతుందిలే బాధపడకు అంటూ “ణీ”, “ణీ” అంటూ లేచివెళ్ళిపోయినట్లుగా నిద్రలో అనిపించినది. అప్పటివరకు నాకు బాబాగారి గురించి ఏమి తెలియదు. వారి పూజ కూడా నేను ఎప్పుడు చేయ్యలేదు. అయితే ఈ కల నాకు ఎంతో ఆనందంను కలిగించినది. ఆ సమయంలో మేము ఢిల్లీలో వుంటున్నాము. నేను డెలివరీ టైంకు ఇంటికి వచ్చి ఈ విషయం అందరితో చెబితే, కలలో అలా అనిపించి ఉంటుందిలే అని అందరూ అన్నారు. నాకు మాత్రము బాబావారు నిజంగా వచ్చినట్లుగా అనిపించేది. కాని అప్పుడు నాకు కూతురు పుట్టలేదు. కుమారుడు పుట్టినాడు. అతనికి సాయికృష్ణ అని పేరు పెట్టుకున్నాను. కాని ఆనాటి బాబావారి వాక్కు ప్రకారం నాకు తప్పకుండా కూతురు పుడుతుంది అన్న నమ్మకంతో ఉన్నాను. నాల్గవసారి నాకు కూతురు జన్మించడం జరిగినది. వెంటనే నాకు బాబావారు వెళ్ళిపోతూ “ణి”, “టి” అన్న మాటలు గుర్తుకువచ్చాయి. అందుచేత నా కూమారై పేరులో బాబావారి వాక్కును కలుపుతూ “సాయి షిరిణి” అని పేరు పెట్టాను.

మా హాస్పటల్ ప్రక్కనే మేము సాయిబాబా మందిరం నిర్మించడం జరిగింది. మందిర విగ్రహ ప్రతిష్టాపన నాడే నా కుమారై సాయి షిరిణి నా కడుపున పడటం జరిగింది. అప్పుడు నేను, నాకు కుమారై శ్రావణశుక్రవారం నాడు ఉదయం జన్మిస్తే బాగుండును అని అనుకొంటూవుండేదాన్ని. సరిగా అలాగే నాకు శ్రావణ శుక్రవారంనాడు ఉదయం పూట కూతురు జన్మించడం జరిగినది. మేము మా హాస్పటల్ వద్ద నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో విగ్రహ ప్రతిష్ట ఎవరిచేత చేయించాలి అని అనుకుంటూ ఉండగా మాకు పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారి గురించి తెలియటం జరిగింది. వారి చేతనే మేము ఈ కార్యక్రమం చేయించాము. విగ్రహ ప్రతిష్ట మూడు రోజులు ఎంతో వైభవంగా జరిగినది. గురువుగారు ప్రతి విషయం అర్ధం అయ్యేటట్లుగా వివరిస్తూ ఎంతో చక్కగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసినారు. ఆ మూడు రోజులు మా మందిరంలో జరిగిన కార్యక్రమాలను, వాటిలో పాల్గొన్నప్పుడు నేను పొందిన ఆనందానుభూతిని ఎన్నడూ మరువలేను. ప్రతి విషయంలోను బాబావారు మా వెంట ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్నట్లుగా ఎన్నో అనుభవాలు కలిగినాయి.

 

“సదానింబ వృక్షస్య మూలాధివాసాత్

సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతం

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధం”

 

వై. ఉషారాణి

“ఉషా” కార్డియాక్ సెంటర్

బందర్ రోడ్డు, విజయవాడ.

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close