సాయికోటి మహా స్థూప ప్రదక్షిణ వల్ల తమ సమస్యలు తొలిగించిన బాబా కరుణా పూరిత లీల ని మన తో పంచుకుంటున్నారు గుడివాడ కి చెందిన సాయి బంధువు పూర్ణ చంద్ర రావు గారు ..వారి అనుభవం వారి మాటల్లోనే ఇలా చెప్తున్నారు ..
బాబా దయ వల్ల మా అబ్బాయి దురలవాట్లు వదిలి సన్మార్గం లో కి వచ్చాడు..
మా అబ్బాయి కొండా బాల శ్రీనివాస్ ఉద్యోగము చేస్తున్నాడు. వ్యవసనాలకు బాని సై జీవితము పై విరక్తి కలిగి చేయకూడని పనులు చేసాడు. గురువు గారి గురించి తెలుసుకొని, 7.12.2000న రాజంపాలెంలో జరిగిన శ్రీ షిరిడి సాయి బాబా వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో పాల్గొని, గురువు గారిని కలవవచ్చును అనే ఉద్దేశ్యముతో రాజంపాలెం వెళ్ళాము. ఆ రోజు గురువుగారి దర్శనము కాలేదు. ఆ ప్రతిష్ఠలో మా అబ్బాయిలోని దురలవాట్లని మార్చవలసినదిగా బాబా వారిని ప్రార్థించితిని. ఫిబ్రవరి 14, 15 తేదీలలో ఏలూరు స్తూపం వద్ద జరిగిన 300 యజ్ఞములో గురువు గారిని దర్శించడము జరిగినది. వారి సత్సంగముకూడా విన్నాను. స్తూపం చుట్టు 108 ప్రదక్షిణలు చేసి మా అబ్బాయి జీవితమును మంచి మార్గములో పెట్టవలసినదిగా కోరితిని. యజ్ఞము నుంచి, తిరిగి అప్పట్లో మేముంటున్న జగ్గం పేట గ్రామము వెళ్ళేటప్పటికి మా అబ్బాయి చెడు స్నేహాలు వదలి గుడివాడలో వున్న మా తమ్ముడింటికి వెళ్ళాడు. ఆ తరువాత నవంబరు 2001లో సాయిబాబా వారి కృప వలన గుజరాత్ లో సిరామిక్ ఫ్యాక్టరీలో ఉద్యోగము వచ్చినది.
మరల ఫిబ్రవరి 14, 15 తేదీలలో 2002 సంవత్సరములో ఏలూరు స్తూపము చుట్టు 108 ప్రదక్షిణలు చేసి, యజ్ఞములో పాల్గొని మా అబ్బాయి, కోడలు కలిసి వుండేటట్లు చేయమని ప్రార్థించాను. బాబా వారు వారిద్దరిని కలిపి, కలిసి జీవించే ఏర్పాట్లు చేసెను. ఇది యదార్థముగా మా కుటుంబంలో జరిగిన విషయము నేను ధృవపరుస్తున్నాను.
బొప్పూడి పూర్ణచంద్రరావు
గుడివాడ,
కృష్ణా జిల్లా,

