సాయి సామ్రాజ్యం కయి అమ్ముల గురుదేవులు బోధించిన “సాయిమార్గం”

IMG_20190815_144433.jpg

సాయిబంధువులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ మరియు రక్షా బంధన్

శుభాకాంక్షలు

IMG_20190815_114600.jpg

సాయి సామ్రాజ్యంకయి అమ్ముల గురుదేవులు బోధించిన “సాయిమార్గం”

జై సాయినాథాయ నమః !

 

22491837_141136839965647_1428984581032161498_n

భారత దేశం లో ని ప్రజల ప్రస్తుత స్థితి

ఆ ఆ లతోనో, లేక ఎ, బి, సి, డి లతోనో పిల్లల యొక్క విద్యార్ధిదశ ప్రారంభమవుతుంది. ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలు చివరిదశకు వచ్చేటప్పటికి విద్యార్ధిలకు వయసు పెరగటం- కొంత అవగాహన పెరగటం ,ఆలోచన కలగటం, మంచి, చెడు తెలుసుకునే స్థితి రావటం జరుగుతుంది. వయసు దూకుడు వలనగానీ, సమాజంలోగల పేరణల వలనగాని యిక్కడి నుంచే విద్యార్థులు చెడుమార్గాలలో నడిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కాలంనుంచే విద్యార్థులు చాలా జాగ్రత్తగ వుండాలి. చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసలు కారాదు. రాజకీయ నాయకుల లేక యితర పెద్దల ప్రలోభాలకు లోగ కూడదు.

యిలా కొంతకాలం విద్యార్ధిదశ సాగిన తరువాత వారివారి పరిస్థితులనుబట్టి కొంతమంది వుద్యోగులుగా, వ్యాపారులుగా, సమాజ సేవకులుగా, రాజకీయ నాయకులుగా యింకా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూవుంటే, చాలామంది నిరుద్యోగులుగా కూడ మిగిలిపోతున్నారు. జీవితంలో అవకాశాలు కలిసొచ్చిన వారు సంతోషంతో జీవితం గడుపుతూ సుఖంగా వుంటూ వుంటే చాలామంది నిరాశ, నిస్పృహలతో క్రుంగిపోతూ జీవితంలో చేదు అనుభవాలను మాత్రమే అనుభవిస్తున్నారు. ఆర్ధిక సమానత్వం లేని సామాజిక వ్యవస్థవల్ల గొప్ప, పేద తేడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యిలాంటి ఆర్ధిక అసమానతలవలననే ముఖ్యంగా మన దేశంలో ఆంశాంతి ఈనాడు రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనిని ఆసరాగా తీసుకుని స్వార్ధపరులు తమ పేరు ప్రతిష్టలు, నాయకత్వాలను నిలుపు కోవటానికి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో మానవుల మధ్య విభేదాలు సృష్టించి, అవసరమైతే మారణహోమమైనా చేసి తమతమ నాయకత్వాలను నిలుపు కునే రాక్షసత్వం బాహాటంగా ప్రకటమౌతున్నది. వున్న వాళ్ళు మరింతగా పెరుగుతూ వుంటే లేనివాళ్ళు మరింతగా తరిగిపోతూ వున్నారు. నీతి నిజాయితీలు కేవలం మాటల లోనే కనిపిస్తున్నాయి, చేతలు మాత్రం అన్నీ స్వార్థంతో పూర్తిగా నిండిపోతున్నాయి. హక్కులకోసం పోరాటాలు, వుద్యమాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బాధ్యతలు సకమంగా నిర్వర్తించాలనే ఆలోచన మనిషిలో ఏమాత్రం కనిపించటంలేదు. మనుషులకు, మానవతా విలువలకు ప్రాధాన్యం తగ్గిపోయి, యంత్రాలకు విలువ పెరిగిపోతున్నది. చంద్ర మండలం పైకి మనిషి ప్రయాణం చేస్తున్నాడనే వార్తల ప్రక్కనే ఆకలి చావుల వార్తలు కూడ పడుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, మతాల మధ్య ఘర్షణలు  వార్తా పత్రికలలో ప్రతిరోజు వుండే వార్తలు.

మనుషులందరిలో రక్తం ఒకేరూపంగా వున్నట్లుగా మనుషులందరికీ కాళ్ళూ, చేతులు, కళ్ళూ, చెవులులాంటి అవ యవాలన్నీ వున్నట్లుగానే ఈర్ష్య, స్వార్ధ ద్వేషాలు – కామ, క్రోధ, లోభ, మోహాలు లాంటి సహజ గుణాలు మనుషులందరి లోనూ సాధారణంగా వుంటాయి.

ఆయితే దైవభక్తి కలిగి, దానికి తోడు మానవ ప్రేమ కలిగి, వీటికి తోడు పరోపకార బుద్ధి కలిగిన నిజమైన భక్తులు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఆడవారైనా, మగవా రైనా, చిన్న వారైనా, పెద్దవారై నా అలాంటివారికి మాత్రమే దైవాను గ్రహంవల్ల పైన తెలిపిన చెడుగుణాల ప్రభావం తగ్గటం మొదలవుతుంది. అందువలన మనిషి పరిశుద్దుడు కావాలంటే మొదట దైవభక్తి అవసరం. అందువలననే రూపం, ఆకారం లేని దేవునికి ఒక ఆకారాన్ని సృష్టించి ఆయా రూపాలను గుళ్లలో ఏర్పాటు చేశారు మన పూర్వులు. దాదాపుగా విగ్రహా రాధనకు యిదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాలంలోపెద్దగా భావించబడిన మత ప్రవక్తలు తమతమ ప్రత్యేకతను నిరూపించుకోటానికి ఒక్కొక్క కొత్తదేవుణ్ణి సృష్టించటం, ఒకే మతంలోనే కొత్తకొత్త సిద్ధాంతాలను సృష్టించడం జరిగింది. అందువలనే హిందూమతంలో చెప్పలేనంతమంది దేవుళ్లు, దేవతలూ పూజించబడుతూ వచ్చారు. ఒకే దేవుణ్ణి పూజించేవారి లోనే మళ్లీ శాఖల తేడాలు, బొట్లు పెట్టుకోవటంలో తేడాలు కూడా మనకు కనిపిస్తూవుంటాయి. పెద్దవాళ్లలోని విభేదాల కారణo గానే ముఖ్యంగా హిందూమతంలో చెట్లను, పుట్లను. చివరకు రాళ్లను కూడ పూజించే స్థితికి సామాన్యులు దిగజారి పోయి ఒకరంటే యింకొకరికి పడని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో కొంచెం తెలివిగల సామాన్యుడు గందర గోళపడిపోయి అసలు దేవుడే లేడేమో! అనే  సిద్ధాంతం వైవుకు మనసు పరుగులుతీసే స్థితికి వచ్చాడు. ఈ పరి స్థితులు యిలా వుండగా పీకల వరకు స్వార్ధం పెరిగిన మరి కొంతమంది భక్తులు పుణ్య, పాప విచక్షణే మరచిపోయి, ప్రక్కనేవున్న పేదవారిని గురించి ఆలోచించనైనా ఆలోచించ కుండా, తమ ఆస్తులను అంతస్తులను వివరీతంగా పెంచు కుంటూపోతూ, పక్కనే ఆకలితో వున్న వాడికి పట్టెడన్నం పెట్టటం యిష్టముండదుగాని, వేలకొలది రూపాయలు ఖర్చు పెట్టి  ఎక్కడో వున్న దేవుడికి రకరకాల పేర్లతో సేవలు చేయించటం మొదలు పెట్టాడు. ఇలాంటి సేవలు చేయించేవారి లక్ష్యంతమకు, తమ కుటుంబసభ్యులకు, తమ ధనానికి దేవుడు ఒక కాపలాదారుగా వుండి రక్షించాలనే స్వార్థపు కోరి కేగాని ప్రజ లంతా తనలాగే సుఖపడాలనే పవిత్ర భావం లేదు. సమర్దుడైనవాడి ఈ స్వార్ధ ప్రవర్తన కడుపు కాలే వాడికి దేవుడంటే పేమ లేకపోగా అసహ్యం కలిగించేటట్లుగా మారింది.

యిలాంటి ఆశాంతితో కూడిన పవిత్రతాభావం లేని ప్రజా వాతావరణం నానాటికీ పెరుగుటేగాని తగ్గటం కనిపించుటలేదు. యివే పరిస్థితులు మనం అనుభవించవలసివస్తే మనకు చాలా బాధగా వుంటుంది. అయినా వీటి మూలకారణాలేమిటో తెలుసుకుని సమాజానికి శాంతిని కలిగించాలనే ఆలోచన ఈనాడు నిజానికి ఏ నాయకులకు లేదనే చెప్పాలి.  మతాధికారులు కూడ తమతమ సంస్థలను పెంచుకోటానికి, అభివృద్ధి చేసుకోడానికే ప్రయత్నిస్తున్నారు కాని దూరదృష్టితో ఆలోచించి వివాదాస్పదంకాని సర్వజనామోదమైన విధానాలతో అందరినీ ఆదరించి ఆకర్షించలేకపోతున్నారు. బహుశా యిది యుగధర్మం కావచ్చు. యిలాంటి పరిస్థితులతో సాక్షాత్తు భగవంతుడే అవతరించినా బహుశా అందరినీ మార్చలేకపోవచ్చునేమో!కారణం ప్రతిదానిని వ్యతిరేకించి విమర్శించే తత్వం యుగధర్మంగా తయారైనది. అందువలనే సాక్షాత్తు భగవంతుడే సాయిగా అవతరించినా అందరినీ ఆకర్షించకుండా అర్హులైన కొంతమందిని మాత్రమే తన తత్వంలోకి లాగు తున్నాడు. అలా లాగబడినవారిలో కొంతమంది మాత్రమే నిజమైన సాయి తత్వాన్ని అర్థంచేసుకోగలుగుతున్నారు, అలాంటివారిలో చాలా కొద్దిమంది మాత్రమే సాయి సైనికు లుగా మారి ముందు తమను తాము సరి చేసుకోవటంతోపాటుగా తమకు తెలిసినవారిని కూడ సాయి సైనికులుగా మార్చ గలుగుతున్నారు. యిలాంటివారి జీవితం ధన్యం. నిస్వార్ధ సేవాపరాయణులై న యిలాంటివారిని సాక్షాత్తు శ్రీ సాయిగానే భావించి వారి పాదములకు మేము తలవంచి భక్తి శ్రద్దలతో నమస్కరిస్తున్నాము. 

 యువకులలో కొంచెం బుద్ధి, జ్ఞానం పెరిగే స్థితికి వచ్చేసరికి సమాజంలో ఎటుచూసినా గందరగోళ పరిస్థితులు కనిపిస్తు న్నాయి. నీతి నిజాయితీలకు ఏమాత్రం విలువలేని ధన సంపాదనే అన్నిటికన్నా ముఖ్యమైన నవనాగరికత సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. అభివృద్ధి ఆనే పేరుతో అవకాశం వున్న వాళ్ళు యింకా యింకా అవకాశాలను, అవసరాలను వాళ్ళకు అనుకూలంగా పెంచుకుంటూ పోతూ వాటికోసం వుద్యమాలు కూడ నిర్వహిస్తూవుంటే నిర్బాగ్యులైన పేదలు, రెక్కాడితేగాని డొక్కాడని బలహీనులు ఈ చిత్రాలన్నీ వింత దృశ్యాలుగా చూస్తూ అమాయకత్వంలో విలచిపోతున్నారు. “నీలోను, ఆందరిలోను వున్న నన్ను చూడు” అని బాబా చెప్పిన సూక్తి కి అర్ధ మేమిటి? నీలో ప్రాణం వున్నప్లే అందరిలోను ప్రాణం వున్నది. ఆ ప్రాణ శకే దైవశక్తి . మనలాగే మన ప్రక్కనే వున్న ఈ దేముడిని వదిలి పెట్టి, ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, యాత్రలు చేసినా ఫలితమేమిటి? యింతవరకు బహుశా మనకు ఈ విషయం మనసుకు అంటుకోకపోవచ్చు.  ఈ క్షణంనుంచైనా మనలో మార్పు రావాలి. కేవలం మన సుఖం, మన సౌఖ్యాలనే కాకుండా యితరుల సుఖ సంతోషాలకు మనం మన చేతనైనంత సహాయం చేయాలి. అదే నిజమైన భక్తి. దీనినే “మానవ సేవే మాధవ సేవ” అని చెప్పటంలో గల ఆర్ధం.

అవలంబించవలసిన మార్గం “సాయి మార్గం”

వున్న దానితో తృప్తి చెందక, లేనిదానికోసం బాధపడుతూ విషయ వాసనలనే మోయలేని బరువుల కోరికలతో తన దగ్గరకు వస్తున్న లక్ష లాది భక్తులకు దైవశక్తి ని నిదర్శనపూర్వకంగా చూపించి సాయి తత్వంలోకి వాళ్ళను లాగుతున్నాడు బాబా. ఆ తరు వాత మెల్లగా వారిలో మార్పు తీసుకువచ్చి తాను చెప్పవలసిన దేదో చెపుతున్నాడు. దీనిని గురించే బాబా స్వయంగా చెప్పిన సూక్తి “మొట్ట మొదట బాహ్యమైన కోరికలతోనే ప్రతి వార నా దగ్గరకు వస్తారు. వారికి కావలసినదేదో ముందు వారికి నేను యిస్తాను. కాని చివరకు నేను ఏమి యివ్వాలను కుంటానో ఆదే కోరేటట్లుగా చేస్తాను” అని.

యువతరం నుంచి ఉద్యోగ వ్యాపారాలలాంటి జీవితంలో స్థిరపడబోతున్న లేక స్థిరపడివారు భక్తి అనే ఈ నూతన నిర్వచనాన్ని సాయి ఎందుకు చెప్పారో జాగ్రత్తగా గ్రహిం చాలి. నీ సుఖంకోసం, నీ సౌఖ్యంకోసం కొంత వరకు ప్రయ త్నించుకోవటంలో తప్పులేదు. కాని యితరుల సుఖసౌఖ్యాలకు ఏమాత్రం యిబ్బంది కలిగించకుండా వుండాలి. యిది చాలా ముఖ్యం. అలా కాకుండా సమర్ధత వున్నదని, అవకా శాలు వున్నాయని, లేక పరిస్థితులు నాకు అనుకూలంగా వున్నాయని, ఆధర్మానికి, అన్యాయానికి దిగితే, దానిద్వారా యితరులకు చెందవలసిన సుఖ, సౌఖ్యాలను నీవు లాక్కుని అనుభ విస్తే ఆలాంటి సుఖం నీకు లభించినందుకు నీవు దేమునికి లంచంగా కొంత మొక్కు చెల్లించినా, దేముడు మాత్రం తన లేఖలలో నీ పేరున నీవు చేసిన తప్పులను ఖర్చుగా రాసుకుం టాడు. యిది నూటికి నూరుపాళ్ళు నిజం. యిందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మానవులంతా ఆయన బిడ్డలే. వుద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా ఈ నగ్న సత్యాన్ని సాయి భక్తులంతా గుర్తుంచుకోవాలి,

వ్యాపార మందే ఒక వస్తువును కొని దానిని కొన్న రేటు కంటే కొంచెం ఎక్కువగా అమ్మటం. ఆ తేడా లాభం. అదే ఆదాయం. ఈ లాభాన్ని చాలా న్యాయమైన పద్ధతిలో తీసుకుంటూ, ఆలా పొందిన లాభాన్ని తనతోపాటుగా పనిచేసే ఉద్యోగులకు కొంత భాగం యిస్తూవుండాలి. కొన్ని ముడిపదార్గాల నుంచి కొన్ని వస్తువులను తయారుచేసే ఉత్పత్తి సంస్థల యజమానులు తమకు మిగిలే నికర లాభాలను తమ పనివార లతోపాటుగా పంచుకోవాలి. మనం తిన్నదంతా మట్టితో సమానం. యితరులకు పెట్టినదే బంగారమవుతుంది. ప్రభుత్వ సంస్థలలో స్థిర మైన వుద్యోగంచేసే వుద్యోగస్థులు హక్కు లతో పాటుగా బాధ్యతలను కూడ జాగతగ పాటించాలి. బాధ్యతలను స్వీకరించని హక్కులు ఎక్కువకాలం నిలవలేవు. అలాంటి పరిస్థితులు ఎక్కువకాలం సాగితే ఏదో ఒక నాటికి వున్న హక్కులను పోగొట్టుకొనవలసివస్తుంది. కారణం హక్కు లకు – బాధ్యతలకు సమతూకం లేక పోవటమే! పైన తెలిపిన అన్ని తరగతులవారిని బాబా చెప్పిన సూక్తి ప్రకారం సమ న్వయం చేసి చూద్దాం,

1) వ్యాపారంలో అమ్మే వస్తువుకు ఎక్కువ లాభం తీసుకున్నా మనుకోండి. యితరులలో వున్న దేముడి నుంచి మనం ఎక్కువ లాక్కున్నాం. యిది అన్యాయం కదా! ఒక వేళ ఎక్కువ లాభాలొచ్చినందుకుగాను భగవంతుడికి లంచంగా కొంత డబ్బు యిచ్చినా, వచ్చిన లాభం అంతా యివ్వం కదా? ఒక వేళ వచ్చిన లాభం యిచ్చేటట్లయితే అసలు ఆలా సంపాదించవలసిన అవసరం వుండదు. అందువలనే ఏదైనా మొక్కు మొక్కుకుంటే ఆది తీర్చే వరకు కొందరు దేముళ్ళు వూరుకోరు.  ఆ మొక్కు చెల్లించటం ద్వారానైనా కొంతవరకు మనసంపాదించిన కుళ్ళును కడిగివేద్దామని వారి తొందర..

2) ఉత్పత్తి సంస్థలలో వున్న వారు కూడ తమకు మిగిలిన నికరలాభాలలో కొంత భాగం తమ పనివాళ్ళకు తప్పని సరిగా యివ్వాలి. పనివాళ్ళ రూపంలో వున్న భగవుతుడిని ముందు తృప్తిపరచటం ద్వారా పూజించాలి..  

8) ప్రభుత్వరంగ వుద్యోగస్థులు  వారు చేయవలసినసేవలు తు. చా, తప్పకుండా తమకు విధించబడిన అన్ని నియమాలతో ప్రజల రూపంలో వున్న భగవంతుని సేవలందించాలి. హక్కులకోసమే పోరాడి బాధ్యతలను వదిలి పెట్టటం- ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే యిది దోపిడీ దొంగల దోపిడీతో సమానమౌతుంది.తాము పనిచేసే సంస్థల ద్వారా ప్రజలందరి రూపంలో వున్న భగవంతునికి తమవంతు సేవ చేయాలి. ఈ కార్యక్రమమును చేయవలసిన విధంగా చేయకుండా ఆజాగ్రత్తగ, నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా చేస్తే ,హక్కులను మాత్రం ఏమాత్రం వదులుకోకుండా ఆ అనుభవించటం ఎంతవరకు న్యాయమో ఒకసారి  ఆలోచించండి. ప్రస్తుత దేశ పరిస్థితులలో మన ప్రక్కనే పనిలేక, తిండిలేక ఆకలిచావులతో చస్తున్న పేదనీకం రూపంలో భగవంతుడు బాథపడుతూవుంటే, వాళ్ళ కంటే మనం కొన్ని సుఖాలు, సౌకర్యాలు అనుభవిస్తూ, మనం చేయవలసిన పనిని సక్రమంగా చేయకపోతే భగవంతుని దృష్టిలో మనం దొంగలకన్నా నీచమైన వాళ్ళ మౌతాము. యిలాంటి పనులు ప్రతిదినం మనం చేస్తూ ,మనం భక్తులమని చెప్పుకోవటం అందులోను సాయిబాబా భక్తులమని చెప్పుకోవటం ఎంతవరకు సబబో జాగ్రత్తగ ఆలోచించాలి. అలోంచి వదిలివేస్తే చాలదు. మంచి మార్పును ఆచరణలో చూపించాలి. అప్పుడే ప్రతి సాయి భక్తుడు ఒక సాయి సైనికుడుగా మారతాడు. అలాంటి సాయి సైనికులుగా మారిన వారు తమ ప్రవర్తన ద్వారా అనేక సాయి సైనికులను తయారుచేయగలుగుతారు. ఈ మార్పు ఆలోచనలలో నుంచి ఆచరణలోకి రావాలి. ఆచరించలేని నీతులు, నియమాలు ఎందుకూ పనికిరావు.

జాతీయ దేముడు సాయి

దేశం మొత్తంమీదే నానాటికీ పెరుగుతున్న సాయి భక్తుల సంఖ్యను జాగ్రత్తగ పరిశీలిస్తుంటే కావాలనే సాయి రోజు రోజుకు ఎక్కువమందిని తన వైపుకు లాగుతున్నట్లుగా ఆనిపిస్తుంది. నా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీకి రాలేరని బాబానే స్వయంగా చెప్పారు కదా! రోజురోజుకు షిరిడీకి వెళ్ళే భక్తుల సంఖ్య పెరుగుతున్నదంటే, వీరందరినీ బాబానే కావాలని షిరి డీకి పిలిపించుకున్నబ్లే కదా! యిలా ఎంతో మందిని తన తత్వంలోకి లాగి వారివారి పరిస్థితులనుబట్టి వారికి నిదర్శన లను చూవుతూ దేవశక్తి ని నిరూపించి చూపిస్తూ, భౌతిక తత్వంలో నుంచి ఆధ్యాత్మికతత్వంలోనికి భక్తులను మర ల్చుచూ, కలి మలినాలను తొలగించి, మానవత్వపు విలువ అను పెరిగేటట్లుగా సమాజంలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు సాయి. కేవలం భౌతికతత్వంతో నిండిన విషయ వాసనలమీద యుద్ధం ప్రకటించటానికి, ఆత్మశక్తి ని గుర్తింపజేసి మనిషిలోని దివ్యశక్తులను గుర్తింపజేయటానికి, దాని ద్వారా సమభావంతో నిండిన సమసమాజాన్ని, సర్వ నవ సమానత్వాన్ని స్థాపించి సమాజంలో శాంతి, సౌఖ్యాలను స్థిరం గా ఉండేటట్లు చేయడమే సాయి లక్ష్యం 

 ప్రతి మనిషి యిటు సంసారిక జీవిత గడుపుతూ శుఖ శాంతులు పొందుటతో పాటుగా ఆత్మ జ్ఞానాని కూడ పొందాలి. కులమత, ఆడమగ, తేడాలు లేని సమ సమానత్వము సాయి సామ్రాజ్యానికి పునాదులు. మనిషిని మనిషిగా ప్రేమించే మానవత్వం సాయి సామ్రాజ్యంలో వెల్లివిరియాలనేదే మన లక్ష్యం.

మన ఈ భారత దేశంలో ఎన్నో మతాలు వున్నాయి. ఎన్నో కులాలు వున్నాయి. కాని అందరికీ ఆమోదయోగ్యమైన దేశానికంతటికీ కలిపి ఒక దేముడు వుండటం చాలా అవసరం. దేశంలోని ప్రజలందరికీ ఒకే దేముడు వుండుట వలన అందరం ఒకటేననే ఏకత్వ భావన ఏర్పడి శాంతి స్థాపనకు వీలౌతుంది. అన్ని మతాలను, అన్ని సిద్ధాంతాలను తనలో యిముడ్చుకోగల శ్రీషిరిడి సాయిబాబావారిని ముందు ముందు భారత దేశ జాతీయ దేమునిగా ఏర్పాటు చేయవచ్చును. ఈవిధంగా శ్రీ షిరిడి సాయిని జన జీవనంలో అడుగడుగునా భాగం చేస్తూవుండాలి .దీనికి అన్ని మతాల వారు సహకరించాలి.

 అన్ని దేశములలోని అందరి ప్రజల హృదయాలను శ్రీ సాయిబాబా వారు పరిపాలించాలి. వారు పాలించే హృదయాలలో ఈర్య, స్వార్ధం, ద్వేష, అహంకార, మమకాం దుష్ట గుణములు ఎక్కడా కనిపించకుండు గాక ! పవిత్రత , పరోపకారం, నీతి, నిజాయితీ, ఓర్పు, నేర్పు, సర్వమానవ సమానత్వం, సత్యము, శాంతి, ధర్మము, ప్రేమగుణాలు విజృంభించి రాజ్యమేలు గాక !

ఈవిధముగా షిరిడి సాయిబాబా వారి సాయి సామ్రాజ్యం జన హృదయాలను పరిపాలించే హృదయ రాజ్యం గాని రాజకీ యంగా రాజ్య పరిపాలన కాదు అనే విషయం  సాయి భక్తులంతా గుర్తించాలి. అనవసర మైన రాజకీయల జోలికి సాయి భక్తులెవ్వరూ పోరాదు. అతి ముఖ్య మైన ఈ విషయాన్ని సాయిభక్తులంతా జాగ్రత్తగా గ్రహించాలి.

పొందాలి సాయిమతం -రావాలి సాయి సామ్రాజ్యం 

 అనేక మతములతో నిండిన మన భారత దేశంలోని జనులందరినీ సాయిమతం ద్వారా ఏకంచేసి, అన్ని మతాల వారి దైనందిన జీవితాలలోను షిరిడి సాయి బోధలను రంగరించి పోసి మతాల మధ్య తేడాలు , కులాల మధ్య తేడాలు ఆచారాల మధ్య తేడాలను పూర్తిగా తొలగించి అందరినీ ఒక తాటి పై నడపటానికి, అందరినీ ఒక  ప్రేమమార్గంలో కలపటానికే షిరిడి సాయిబాబా వారి పేరున స్థాపించడుతున్నది ఈ సాయి మతం.

సాయిమతం-శాంతిమతం, సాయిమతం -అందరిమతం. సాయిమతం-అందరి కోసం. షిరిడిసాయి జన్మమనందరి కోసం.,,,దేవుడి పేరుతో ధర్మం వికృతరూపం ధరించి తోటి మనిషిని మరచి, రాళ్ళకు విలువ పెంచుతున్నప్పుడు మానవ త్వాన్ని నిలపటానికి దైవశక్తి ని నిరూపించి, దేవ రహస్యా లను సామాన్యులకు అందించటానికే సాయి ఆవతరించటం జరి గింది. ఉన్న మతాలతో, ఒక మతంలోనే గల వివిధ శాఖ లతో, ఆచారాల పేరుతో సతమతమౌతున్న ప్రజలకు యింకో కొత్త మతాన్ని లేక సిద్ధాంతాన్ని సాయి ఏర్పాటు చేయలేదు.    

భారత దేశంలోని ప్రతి మనిషి మత పరం  గా మనశ్శాంతిని, సుఖ సంతోషాలను సమానత్వాన్ని అనుభవించాలటే షిరిడి సాయి బాబా వారు బోధించిన సాయిసిద్ధాంతాలకు అనుగుణమైన “సాయి మతం” తప్పక స్థాపించబడాలి, వ్యాప్తి చెందబడాలి, సాయి మతంలోకి వస్తే వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు పోతాయని ఎవరూ బాధ పడవలసిన పనిలేదు. సాయిమతంలో చేరిన తరువాత కూడ ఎవరి ఆచార వ్యవహారాలు, అలవాట్లు వాళ్ళే ఆచరించుకోవచ్చును. కాని ఎదుటి వారి ఆచార వ్యవహరాలను కూడ సగౌరవంగా చూడాలి. హీనులు, దీనులు పతితులు, అంటరానివారు అనే మాటలు సాయిమతంలో ఎక్కడ కనపడకూడదు, వినపడకూడదు. ఎలాటి వారైనా సరే తోటి మనిషిని వెలివేసి కించపరిచే పద్ధతులన్నిటిన్నీ ”సాయిమతం” సమాధి చేస్తుంది. సాయిమతంలోని ముఖ్యవిసేషం యిదే! 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close