బాబా కృపతో నయమైన మానసిక రోగం

ఓం శ్రీ సాయినాథాయ నమఃIMG-20191014-WA0007

బాబా భక్తుడైన శ్రీ క్లర్క్ ముంబాయిలో, ఉమ్మడి కుటుంబం తో నివసించేవాడు. అతడు పార్సీ మతానికి చెందిన ఒక సజ్జనుడు. మొట్టమొదటిసారి 1913 లో అతను షిరిడీ వచ్చాడు.  అతడి అన్న మానసిక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. చాలా ఉన్మాదిగా వ్యవహరించేవాడు. డాక్టర్లు తనకి పిచ్చి పట్టిందని, అతడు మానసిక ఉన్మాది అని నిర్ధారించేశారు.

క్లర్క్ యొక్క అన్న  ఉన్నట్టుండి చాలా పిచ్చి గా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో   వృద్ధురాలైన తన తల్లి ప్రాణాలకు కూడా హాని జరిగే పరిస్థితులు కలిగేవి. క్లర్క్ దగ్గర తగినంత ధనం లేకపోయినప్పటికీ, తన శక్తికొలది అతడు ఎందరో డాక్టర్ల దగ్గరికి తన అన్న ని చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినప్పటికీ అతని యొక్క మానసిక రోగం ఏమీ నయం కాలేదు. అతని యొక్క హింసాత్మకమైన ఉన్మాదం ఇంకా పెరగసాగింది.

ఒకరోజు క్లర్క్ యొక్క సహోద్యోగి తన మిత్రుడికి, షిరిడీలో బాబా యొక్క పావన చరణాల శరణు పొందమని సలహా ఇచ్చాడు. అతడికి కూడా ఈ సలహా నచ్చి, తన అన్నని తీసుకుని షిరిడి బయలుదేరాడు. షిరిడీ లో ఉండగా, తన అన్న యొక్క ప్రవర్తన లో కొంచం మార్పు రాసాగింది. దీంతో బాబా అతన్ని తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళమని ఆదేశించాడు.

ఇంటికి వెళ్ళాక, అతడి మానసిక రోగం మళ్లీ చాలా పెరిగిపోయింది. క్లర్క్ తన బాధని తెలుపుతూ షిరిడీలో బాబా కి ఒక లెటర్ ని పంపాడు. వెంటనే బాబా తన అన్నని షిరిడి కి తీసుకుని రమ్మని అనుమతి ఆదేశాలు ఇచ్చాడు. తన అన్న ని తీసుకుని అతడు షిరిడీకి వచ్చి బాబా యొక్క పాదాలచెంత తన అన్న ని వదిలి పెట్టాడు. అమీ దాస్ అనే సాయి భక్తుడు బాబా ప్రేరణతో క్లర్క్  యొక్క అన్నని, తన ఇంట్లో ఉంచుకుని అతన్ని చూసుకోవడానికి ముందుకు వచ్చాడు. అమీ దాస్ దగ్గర తన అన్నని ఉంచేసి క్లర్క్ ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు. తన అన్నని చూసుకోవడానికి అతడు షిరిడీలోని ఆమీ దాస్ కి నెలకి 30 రూపాయలు పంపించేవాడు.

పావనమైన షిరిడి క్షేత్రంలో,  శ్రీ సాయి సన్నిధి లో ఉండడం వలన కొన్ని నెలల తర్వాత, అతడి అన్న యొక్క ప్రవర్తన లో చాలా మార్పు వచ్చింది. అతడు నియమంగా బాబా యొక్క హారతుల కి హాజరయ్యేవాడు. బాబా యొక్క తీర్థంలో ఊది వేసుకుని భక్తిగా సేవించేవాడు. ఈ విధంగా, బాబా యొక్క కృప వలన అతను స్వస్థత పొందాడు. ఎంత మంది డాక్టర్లు చికిత్స చేసిన నయం కాని మానసిక రోగం, బాబా యొక్క దివ్య శక్తి వలన నయమయింది.

ఇది బాబా యొక్క అద్భుత శక్తికి అద్వితీయమైన ఉదాహరణ.

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close