శ్రీ సాయినాధాయ నమః
సాయిబాబా భక్తుడైన బాలకృష్ణ వామన్ వైద్య కే బాబాతో అనుభవాలు ఆయన మాటల్లోనే..
” నేను 1910 -1911లో మా కుటుంబంతో మొదటిసారి షిరిడి వెళ్ళాడు. అక్కడ నాలుగైదు రోజులు బాబా సమక్షంలో గడిపాను. అక్కడ బాబా మా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారు. షిరిడీ యాత్ర కన్నా ముందే మా అందరికీ బాబా యొక్క కృప స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది, నేను మా రైల్వే కార్యాలయంలో సెలవుల గురించి మరియు.రైలు పాస్ గురించి అర్జీ పెట్టుకున్నాను, కానీ మా ఆఫీస్ లో నాకు ఒక ముఖ్యమైన పని ఉండటం వలన, నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. అందువలన సెలవు దొరకలేదు. మా హెడ్ క్లర్క్ ఒక సాయి భక్తులు. బాబా కృపవలన అతడు నా సెలవులు మంజూరు చేయడం వల్ల నాకు సెలవు దొరికింది. మేము కోపర్గావ్ చేరుకునేసరికి రాత్రి అయింది. కోపర్గావు న్నుంచి శిరిడి వెళ్లే దారి చాలా భయంకరమైనది, ఆ మార్గంలోని యాత్రికులపై దొంగలు దాడి చేస్తుంటారు. కానీ బాబా కృపవలన, అలాంటిదేమీ జరుగక మేము రాత్రి ఒకటి గంటలకు శిరిడి చేరుకుని సాటి వాడాలో విడుదల చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి ఉన్నందువలన నేను నా కుటుంబ సభ్యులను కేవలం నీరు మాత్రమే త్రాగమని సూచించాను. ఎందుకనగా సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండడం మా ఆచారం. తర్వాత మేము కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాము.
ఉదయం లేవగానే, బాబా తన దగ్గర ఉండే భక్తులను, మమ్మల్ని ఖాళీ కడుపుతో ఎందుకు ఉంచారని వారిపై కోపించాడని తెలిసింది. ” నా పిల్లలు వచ్చారు. కానీ మీలో ఎవరు కూడా వారిని సరిగా చూసుకోలేదు. మీరు వారికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. అందువలన వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ” అని బాబా కోపంతో వారిని మసీదు నుంచి బయటికి పంపించాడట.. బాబా యొక్క మాతృ ప్రేమ మమ్మల్ని ఆనందంలో ముంచెత్తింది.. మేము చేరగానే బాబా, “నీకు మంచి జరుగుతుంది” అని, మమ్మల్ని ఆశీర్వదించారు
ఒక రోజు మేము బాబా కొరకు ఒక విశేషమైన నైవేద్యం తయారు చేసాము. కానీ తయారు చేయడానికి ఆలస్యమైంది, అంతలోపే ఇతర భక్తులు బాబా కొరకు నైవేద్యం తీసుకుని వెళ్లారు. బాబా మా నైవేద్యం కొరకు వేచి చూసి మేము ప్రసాదం తేగానే మామ్మల్ని సమాధి దగ్గర కూర్చోబెట్టుకుని మాకు ఆశీర్వాదం మరియు ప్రసాదాలను ఇచ్చారు.
మాపై బాబా కి గల కృప చూడండి. పరివారంతో మేము నాసిక్ వెళ్లడానికి బాబా కి అనుమతి అడిగాను. బాబా, ” మీరు నాసిక్ ఎందుకని వెళ్లాలి? అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి ఉంది. మీరు నాసిక్ వెళ్ళకండి, మీరు ఏదారిగుండా వచ్చారు అదే దారి గుండా, ఇంటికి వెళ్లిపోండి. ” అని మమ్మల్ని నాసిక్ వెళ్ళనివ్వలేదు.
షిరిడీలో నాలుగు రోజులు మేము గడిపాము. ఒకరోజు నేను మాధవరావు దేశపాండే తో మాట్లాడుతూ ఉన్నాను. నాకు బాబా యొక్క చేతి స్పర్షతో పావనమైన వారి యొక్క చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో ఉంచుకోవాలని కోరిక కలిగింది. మేము మాట్లాడుకుంటుండగా బాబా మా దగ్గర నిలబడి మా సంభాషణ వినసాగారు. వెంటనే బాబా నన్ను ఫోటో తీసుకురావడానికి పంపించారు. నేను వెళ్లి బాబాఫోటో తీసుకువచ్చాను. బాబా దాన్ని తాకి పవిత్ర పరిచి నాకు ఇచ్చి వేశారు. నేను మా ఇంటిలో ఆ బాబా ఫోటోను ఉంచుకుని, బాబాకి నైవేద్యం అర్పించిన తర్వాతే నేను భోజనం చేస్తాను.”
(తరువాయి భాగం రేపు)