నానా సాహెబ్ నిమోన్కర్

శ్రీ సాయినాధాయ నమఃIMG_20191109_093658.jpg

సాయి భక్తులైన నానా సాహెబ్ నిమోన్కర్ జీవితంలో బాబా చూపిన లీలలు.

సద్గురు తన శిష్యులకి భౌతికమైన ప్రగతి తో పాటు ఆధ్యాత్మిక ప్రగతి కూడా జరిగేలా చూస్తుంటారు. ఒకసారి నాన్న సాహెబ్ నిమోన్కర్  కి సంస్కృత భాషలో రచించిన భాగవతాన్ని మరియు ఇతర గ్రంథాలను చదవాలని చాలా తీవ్రమైన కోరిక కలిగింది. కానీ నాన్నకి సంస్కృత భాషా జ్ఞానం లేనందువలన ఆ గ్రంధాలని అతను చదవలేకపోయాడు. బాబా అతనిలోని కోరికను గమనించి అతని కోరిక తీర్చడానికి ఇక తన లీలా ప్రారంభించారు. బాబా అతనితో నానా  నీవు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎందుకు చదవట్లేదు అని అడిగాడు. అప్పుడు నానా  నాకు సంస్కృత భాషా జ్ఞానం లేదు బాబా అని సమాధానమిచ్చాడు. చింతించకు. ఈ మసీదు తల్లి నీకు సంస్కృతం నేర్పిస్తుంది. నెమ్మది నెమ్మదిగా సంస్కృత భాషని నేర్చుకో గలవు. చదవడం ప్రారంభించు. అని అనుమతి ఆదేశాలను ఇచ్చారు.

బాబా మాటలపై విశ్వాసముంచి నాన్న ప్రతిరోజు, తను చదివేది తనకి అర్థం కాకపోయినా, సంస్కృత భాషలోని శ్రీమద్భాగవతం మరియు దాని వాక్య చదవడం ప్రారంభించాడు. నెమ్మదినెమ్మదిగా ఆయనకి ఆ గ్రంధము అర్థం అవసాగింది. బాబాయ్ ఎక్కడ

ఆ తర్వాత బాబా యొక్క అనుమతి ఆదేశాలతో, గీతా మరియు జ్ఞానేశ్వరి ని కూడా అతడు    అధ్యయనము చేసేసాడు. ఈ గ్రంథాన్ని కూడా అతడికి బాబా అర్థమయ్యేలా  చేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ మరియు జోగ్ నానా వద్దకి వచ్చి ఈ గ్రంథాల్లో వారికి ఉన్న సందేహాలను తీర్చుకునేవారు. ఈ విధంగా వారి సందేహ నివారణ చేసేంత గ్రంథ పరిజ్ఞానం నాన్నకి బాబా కృపతో కలిగింది. దీక్షిత్ మరియు జోగు ఇద్దరు కూడా చదువుకున్నవారు మరియు ప్రతిదినము నియమానుసారంగా సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసేవారు. కానీ నానా ఈ గ్రంథాలను నియమంగా పారాయణ చేయకుండానే బాబా కృపతో దానిలో పరిజ్ఞానాన్ని సంపాదించాడు.

కొన్ని రోజుల తర్వాత బాబా ఆయనకి ఇతరుల యొక్క సందేహా నివారణ చేయవద్దని ఆదేశించారు. “మనం ఇతరులకు ఎందుకు పూరించాలి, ? దీని వలన మనలో అహంకారం గర్వం ఉత్పత్తి అవుతుంది, దీనివల్ల మనం పొంగిపోయి చివరికి కుప్పకూలి పోతాము” అని చక్కగా వివరించారు. అహంకారం ఎంతటివారినైనా నాశనం చేస్తుంది. తన భక్తుడిని అహంకారం నుండి కాపాడటానికి బాబా ఎంత సతర్కంగా వుంటారో  చూడండి!!

బాబా కి నానా పై ఎంత ప్రేమ అంటే, బాబా ఆయన్ని తన కుమారుడి దగ్గరికి వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. నన్ను పాతిపెట్టిన తర్వాతే నువ్వు తిరిగి వెళ్ళు(అనగా నా సమాధి అయిన తర్వాతే వేళ్ళు ).. అని అన్నారు.

(రేపు తరువాయి భాగం)

 

 

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close