కేశవరావు ప్రధాన్

28577356_10155091130645740_47982980676688428_nశ్రీ  సాయినాథాయ నమః

కులాబా జిల్లాలోని భీవపురి అనే గ్రామంలో కేశవరావు ప్రధాన్ నివసించేవాడు. ప్రధాన్ అంత ధనవంతుడు కాకపోయినప్పటికీ అతని దగ్గర ఇల్లు మరియు పొలము ఉండెను. అతని ఇల్లు పొలము దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో ఉండెను. వాళ్ళ ఇల్లు కూడా అందమైన తోట తో చాలా ప్రశాంతంగా ఉండేది,

బాబా తో పరిచయం కాకముందు ఇతనికి సాధువుల మీద నమ్మకము విశ్వాసము ఉండేది కాదు. ఇతని యొక్క ఒక మిత్రుడు సాయి బాబా యొక్క భక్తుడు. ఆయన ఒకసారి కుటుంబంతో షిరిడీ వెళ్ళుచుండెను. ప్రధాన్  యొక్క మిత్రుడు ఎన్నిసార్లు షిరిడి వెళ్దామని అతన్ని పిలిచినా అతను వారితో పాటు షిరిడి రావడానికి నిరాకరించేవాడు. అయితే అతను “బాబా పాదాలకి  మొక్కమనీ  , బాబా పాద తీర్తం తీసుకోమని  తనని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు ” అనే షరతుతో షిరిడి రావడానికి అంగీకరించాడు. తను  శిరిడీలో ఒక గదిలో ఉండి పోయి తన మిత్రుడిని మాత్రం బాబా దర్శనానికి వెల్లనీచ్చెదను  అనే ఆలోచనతో అతడు ఉండెను.

అందరూ శిరిడీ చేరుకున్నారు. కానీ ప్రధాన్ మిత్రుడు అతన్ని ద్వారకామాయి  రమ్మనమని వత్తిడి చేసాడు. అందరూ ద్వారకామాయి చేరుకున్నారు, జనం ఎక్కువగా ఉండడం వలన ప్రధాన్  ద్వారకామాయి  లో దూరంగా ఒక మూలలో కూర్చున్నాడు. నెమ్మదినెమ్మదిగా ద్వారకామాయి ఖాళీ అయింది. అతని మిత్రుడు బాబా ని  పూజించే సాగాడు, అప్పుడే బాబా ప్రధాన్  వైపు  చేత్తో చూపిస్తూ “ఎవరినీ లక్ష్యపెట్టని ఆ గర్విష్టి సైతాన్ ని ఇక్కడికి తీసుకురండి ” అని అరిచాడు. అతని మిత్రుడు ప్రధాన్ ని బాబా దగ్గరికి తీసుకు వచ్చాడు.  బాబా అలాగే కోపం తో, సాధువుల పట్ల అతనికి గల వ్యతిరేక ఆలోచనలని, మరియు సాధువుల గురించి అతను మాట్లాడే మాటలని మొత్తం అందరికీ వినిపించారు. ప్రధాన్ కి అప్పుడు బాబా యొక్క అనంతమైన శక్తి సర్వవ్యాపకతా మరియు సర్వజ్ఞత అనుభవం లోనికి వచ్చింది. బాబా మాటలతో అతడి  మనసు ప్రభావితమైంది. సాధువుల పట్ల అతనికున్న వ్యతిరేక ఆలోచనలు అంతమయి అదే క్షణంలో అతడు బాబా యొక్క పరమ భక్తుడిగా మారాడు. 

బాబా ప్రధాన్  యొక్క రెండు జేబుల్లో నుండి డబ్బులు బయటికి తీయమని ఆదేశించారు. కాగా అతను, ఒక జేబు లో ఉన్న మొత్తం అన్ని బయటికి తీయగా బాబా అతన్ని రెండవ జేబులో నుండి కూడా డబ్బులు బయటకు తీయమ్మన్నారు. అతను అలాగే చేశారు. బాబా అతన్ని వెంటనే షిరిడీ నుండి వెళ్ళిపొమ్మని ఆదేశించారు. అతని మిత్రుడు కూడా అతనితో , బాబా ఆదేశానుసారం నువ్వు షిరిడి విడిచి వెళ్లి పోవడం మంచిది అని అన్నారు. అప్పుడు ప్రధానం సందిగ్ధంలో పడిపోయాడు ఎందుకనగా అతని వద్ద తిరిగి వెళ్లడానికి  ధనం లేదు. అలాగే  తను పనిచేసే కంపెనీకి వాపస్ ఇవ్వాల్సిన ధనం కూడా బాబా తీసుకుని ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే బాబా ఒక అద్భుతమైన లీల చూపిం చారు. ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అతను తిరిగి వెళ్లడానికి ఖర్చు అంతా తాను చెల్లిస్తానని అన్నాడు. ప్రధాన్  ఆనందంతో ఒప్పుకొని, తాను తిరిగి ఇంటికి వెళ్లాక, మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు తిరిగి అతనికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.

ఇంటికి తిరిగి వెళ్లాక అతను తనకి సహాయం చేసిన వ్యక్తి అడ్రస్ కి మనీ  ఆర్డర్ ద్వారా డబ్బులు పంపించాడు. కానీ, తాను రాసిన అడ్రస్ సరైనది కాదని డబ్బు తిరిగి అతడి దగ్గరకు వచ్చింది. మరి తనకి సహాయం చేసిన వ్యక్తి బాబానే  అని అతడికి అర్థమైంది

రెండవ లీల.. ప్రదాన్   కంపెనీకి వెళ్లగా, కంపెనీ యజమాని అతనితో, బిల్లుల తో కూడిన పెద్ద ధనరాశి వారికి అందింది అని చెప్పగా, అతడు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. అతడు కంపెనీకి చెల్లించాల్సిన ధనాన్ని ఎవరు చెల్లించారో  అతనికి అర్థం కాలేదు. చివరికి ఇది కూడా బాబా లీల అని అతను గ్రహించాడు. ఈ లీల ద్వారా ప్రధాన్ కి బాబా పట్ల విశ్వాసం ఇంకా దృఢంగా మారినది.

 

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close