సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

సాయి సత్సంగం శ్రవణం- సర్వదుఃఖ విదూరం

ఓం శ్రీ సాయినాధాయ నమఃIMG-20191015-WA0024

ముందుగా శ్రీ షిరిడి సాయి నాథుడి కి క్షమాపణలు కోరుకుంటూ… నా మొబైల్ సుమారు 12 రోజుల క్రితం పోయినందువల్ల website లో పోస్టులు పెట్ట లేక పోయాను. ఎందుకంటే లాగిన్ పాస్వర్డ్ మొబైల్ లో ఆటో సేవ్ అయి ఉండడం వలన నేను పాస్వర్డ్ మరిచిపోయి వేరే సోర్స్ నుండి కూడా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వలేకపోయాను.. ఆ తర్వాత సాయి దయతో వేరే వాళ్ల మొబైల్ అందుబాటులోకి వచ్చి కొన్ని ప్రయత్నాలు చేసి తర్వాత అలాగే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవాగలిగాను సాయినాథ నన్ను క్షమించ వయ్యా.

ఇక డిసెంబర్ 10 11 12 తేదీల్లో బాబా యొక్క మందిర ప్రారంభోత్సవం,  శ్రీ శిరిడి సాయి కోటి నామ లికిత యజ్ఞం మరియు మందిరంలో శ్రీ షిరిడి సాయి విగ్రహ ప్రాణ ప్రతిష్ట శ్రీ షిరిడీ సాయి మరియు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో కన్నుల పండుగగా జరిగింది. అప్పటినుండి మందిరములో రోజు షిరిడీ లో వలె నాలుగు హారతులు సాయి అనుగ్రహంతో ఇస్తూ ఉన్నాము. ఇంకా కొద్దిగా నిర్మాణపు పనులు ఉన్నాయి. సాయి అనుగ్రహంతో అవి కూడా నన్ను పూర్తి అవుతాయని ఆశిస్తున్నాను.IMG_20191229_212935.jpg

మందిరం ప్రారంభించాక జరిగిన మొట్టమొదటి లీలా మీతో పంచుకుంటున్నాను.

26 డిసెంబర్ నాడు హైదరాబాద్ లో జరిగే గురువు గారి సత్సంగానికి బయలుదేరుతూ మందిరంలో సాయి సేవ చేసే అబ్బాయి బాలకృష్ణుని కూడా సత్సంగానికి రమ్మన్నాను. మొదట తనకి పని ఉందని చెప్పాడు కానీ గురువుగారి దర్శన భాగ్యం సత్సంగం వినే అవకాశం కోల్పోతావు అని ఒత్తిడి చేసి తనని కూడా తీసుకు వెళ్ళాను. బాలకృష్ణ మరియు తన ఫ్రెండ్ కూడా గురువుగారి దర్శనము చేసుకుని సత్సంగం విన్నారు.

ఈసారి సత్సంగంలో, ” సాయి దేవుడు తన భక్తులందరినీ ప్రేమిస్తారని, అనాధలకి ఆపద్బాంధవుడు అని, పరబ్రహ్మ సాయి పై సంపూర్ణంగా మనసు నిలపాలి అని, కాలాన్ని వృధా చేయకుండా జీవిత లక్ష్యాన్ని కై పాటుపడాలని గురువుగారు వివరించారు. ఉత్సాహం చురుకుదనం తో పాటు పడుతూ బుద్ధి విచక్షణ లు కలిగి ఇంద్రియ నిగ్రహంతో మనస్సును సాయి యందు లగ్నం చేయాలి.” అని మనసుకి హత్తుకునేలా వివరించారు.

ఆనందంగా సాయి సత్సంగ్గాన్ని మనసులో నిలుపుకొని మా ఊరికి తిరిగి వచ్చాము. నేను కారు దిగి ఇంటికి వెళ్ళాక, ఈ అబ్బాయి బాలకృష్ణ తన ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ చూశాడట. యాక్సిడెంట్ కి గురి అయ్యింది ఎవరు అని దగ్గరికి వెళ్లి చూడగా, రెండు  బైక్ లు ఢీ కొట్టుకొన్న యాక్సిడెంట్ వల్ల, ఇద్దరేసి చొప్పున 2 బైక్ లపై ఉన్న నలుగురిలో ముగ్గురు చనిపోయి ఉండడం చూశాడు. ఇంకా ఒకరు మాత్రం కాలు ఫ్రాక్చర్ అయ్యి స్పృహ కోల్పోయి ఉన్నాడు. తను ఎవరు అని చూడగా, అక్కడ ఉన్నది తన కజిన్. వెంటనే తేరుకుని తనని హాస్పిటల్లో కి తీసుకు వెళ్ళాడు. అంత ఘోరమైన ప్రమాదంలో రెండు బైకుల పై ఉన్న ముగ్గురు చనిపోయారు. కాని బాబా అనుగ్రహంతో తన కసిన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇది బాబా మరియు గురువుగారి అనుగ్రహ ప్రభావమే అని చెమ్మగిల్లిన కళ్ళతో మరుసటి ఉదయం నాకు అంతా వివరించాడు. “సాధూనాం దర్శనం పుణ్యం” అనే సూక్తి ప్రకారం సద్గురు ని దర్శనం తన తన తమ్ముడి ప్రాణాలను కాపాడింది. ఆద్యంతం గురువు గారి ద్వారా వచ్చే సాయివాణి నీ విన్నంతనే,  ఆ శ్రవణ మహిమ తన తమ్ముడిని తాను కోల్పోకుండా చేసింది. తద్వారా కలిగే బాధ నుండి తప్పించింది.

జై సాయిరాం

 

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close