ఓం శ్రీ సాయినాధాయ నమః
సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹

ఈరోజు మా మందిరంలోని సాయినాథుడు🙏
రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించడం ఆరంభించారు. అప్పుడు భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్నా చించణీకర్ షిరిడీ లో చాలాకాలం ఉండి బాబాను సేవించారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. ఒకనాడు శ్యామ, ” బాబా, నీవు ఎంతోమంది కోరికలు తీరుస్తూ ఉన్నావు. కానీ మీరు ఇంతగా సేవిస్తున్న వీరికి మాత్రం ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమీ? ” అన్నాడు. ఆయన నవ్వి, ” నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావ్ ఏమి? వీరు ఏమి అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించిన, ఒక తరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కల కాలం కొనసాగే వంశ ప్రతిష్ట వీరికి ప్రసాదిస్తాను. “అన్నాడు. ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లో అన్నా కి ఒక కోర్టు వ్యాజ్యం మూడు సంవత్సరాలు నడిచింది. దాని గురించి ఎప్పుడు బాబా ని అడిగినా “అల్లాహ్ మేలు చేస్తాడు “అనేవారు సాయి. ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు. అది తీసుకుని దీక్షిత్ మరియు అన్నా కోపంతో మసీదు చేరగానే, సాయి ఉగ్రుడై “ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు. ఆ ఉత్తరం అవతల పారేయండి” అని కసిరారు. ఆరు నెలల తర్వాత కోర్టువారు అన్నా కు అనుకూలంగా 1800 కు డిక్రీ చేశారు. ఆ భక్తులు ఇద్దరు సంతోషంతో బాబా వద్దకు వచ్చి ఆ పైకం అంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. ఆయన నవ్వి “అది నేను ఏం చేసుకుంటాను. నాకు ఇల్లా కుటుంబమా? నీవే తీసుకో!”. అన్నారు చివరికి ఆ దంపతులు సాయి ఆశ్రమం అయిన చావడి మరమ్మతుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు.
