సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

స్మరించినంతనే సర్వం సరిచేసే సాయి నాధుడు

ఓం శ్రీ సాయి నాధాయ నమః

సాయి సర్వ సంకట హరాయ నమః..
ఈ రాఖి పౌర్ణమి నాడు నాకు చూయించిన అనుభవం మీతో పంచుకుంటున్నాను..
నేను కొన్ని రోజుల క్రిందట స్కూల్ లో సాయి స్వరూపాలు అయిన విద్యార్థులని టీచర్ గా కొట్టినందుకు కర్మ రూపేణా బాత్రూం లో స్టూల్ నుండి పడిపోయినా నా నడుము విరక్కుండా సాయి చూసుకున్న విషయం పంచుకున్నాను కదా.. అయితే ఆ రోజు ఏమి అవలేదు కానీ ఆ తరువాత కింద కూర్చునేపుడు, పైకి లేచేప్పుడు లేదా కాలు మడిచేప్పుడు మోకాలి లో ఏదో బేణికినట్లుగా చాలా నొప్పిగా ఉండేది.ఈరోజు కూడా సాయి బాబా మందిరం కి వెళ్లి సాయి నాధుని పాదాల దగ్గర కూర్చున్న సమయం లో కూడా ఆ నొప్పి చాలా ఇబ్బంది గా అనిపించింది. అయినా కూడా సాయి నామం కూర్చుని కొద్ది సేపు చెప్పాను., సాయి ఆరతులు కూడా ఇబ్బంది పడుతూనే లేచి ఇవ్వడం జరిగింది.ఈ రాఖి పండుగ నాడు అన్ని విషయాల్లోనూ సాయి నాధుడి రక్షణ నాకు ప్రసాదించమని సాయి ని ఆర్థిస్తూ ఈరోజు చాలా సమయం సాయి మందిరం లోనే గడిపాను., సాయి తో మనసులోని విషయాలు ఎన్నో చెప్పుకున్నాను..గుడిలో ఇతర భక్తులేవరూ రానందువల్ల ఈరోజు నేనొక్కదాన్నే సాయి తో మనస్ఫూర్తిగా గడిపే అవకాశం కలిగింది. అలా చాలా సేపు నేల మీద కూర్చోవడం వల్ల ఇంటికెళ్ళాక కూడా ఆ నొప్పి ముందటికన్నా ఎక్కువ బాధించింది. మనసులో ” నీ గుడికి వచ్చాను, నీ సేవ చేసుకున్నాను.అయినా కూడా ఇంకా ఈ నొప్పి పెరిగిందేంటి సాయి ” అనుకున్నాను.ఆ మధ్య ఆక్సిడెంట్ లో చీలమండలం లో ligament చిరిగినట్లు, ఇపుడు కూడా మోకాలి ligament కానీ tear కానీ అయిందా అని చాలా భయపడ్డాను.. “బాబా, స్టూడెంట్స్ ని వాళ్ళు అల్లరి చేస్తుంటే కొట్టినందుకు మరీ ఇన్నిరోజులు నొప్పి అవుతుందేంటి!!దానికి మరీ ఇంత కర్మ వుంటుందా!!” అని అడిగాను.. అలా అను కుంటూ నా బెడ్ పై కూర్చుని సాయి ని స్మరిస్తూ ఉండగా ఉన్నట్లుండి టక్ మంటూ మోకాలి లో శబ్దం వచ్చింది. మోకాలి నరం బేణుకు వీడినట్లు అయ్యి వెంటనే నొప్పి మాయం అయిపొయింది.ఇన్ని రోజులుగా అలా కూర్చున్నపుడు లేనిది, ఈరోజు దానంతట అదే నరాన్ని ఎవరో లాగి సరి చేసినట్లు పట్టుకున్న నరమో లేదా కండరమో వదులు అయ్యి వెంటనే నొప్పి తగ్గి పోయింది.దీనితో మెడ పట్టేసినట్లు గానే ఇన్నిరోజులు మోకాలి నరం పట్టేసిందని, నేను భయపడినంతగా ఏమి జరగలేదని తెలిసి చాలా ఆనందపడ్డాను.ఇన్నిరోజుల నొప్పి నుండి సాయి నాకు ఉపశమనం కల్గించినందుకు సాయి కి వేవేల కృతజ్ఞతలు దేవా!! నీ సన్నిధి ని నా మనసు ఎప్పుడూ వీడకుండు గాక “

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close